హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అహంభావంతో మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలే ఆయనకి గుణపాఠం చెబుతారని అన్నారు. గురువారం హైదరాబాద్లో చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... ప్రధాని మోదీని కేసీఆర్ కలుస్తున్నారుగాని.. మేం మిమ్మల్ని కలవగలమా అని ప్రశ్నించారు.
మీరు ఫాంహౌస్లో ఎన్ని రోజులున్నారో... సచివాలయంలో ఎన్ని రోజులున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని కేసీఆర్ను చింతల డిమాండ్ చేశారు. 600 జిల్లాలను బీజేపీ పరిపాలిస్తే... 10 జిల్లాలను పరిపాలిస్తున్న కేసీఆర్కు ఇంత అహంభావమా అని చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.