
ర్యాగింగ్‌ను అరికట్టండి
వాల్మీకిపురం: కళాశాలల్లో జరుగుతున్న ర్యాగింగ్‌ను అరికట్టడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ నాయకులు బుధవారం ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని వాల్మీకిపురంలోని ఆయన స్వగృహం లో క లుసుకున్నారు. స్టాప్ ర్యాగింగ్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే చింతల మాట్లాడుతూ కళాశాలల్లో మొదటి సంవత్సరం చేరే విద్యార్థులను పరిచయం చేసుకోవాలని, సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాలన్నారు. పరిచయాల సాకుతో ర్యాగింగ్‌కు పాల్పడడం సబబుకాదన్నారు. ఇటీవల నాగార్జున యూనివ ర్సిటీలో ర్యాగింగ్ భూతానికి ఓ అమ్మాయి బలికావడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర సెక్రటరీ చక్రధర్, జిల్లా సెక్రటరీ కుమార్, విద్యార్థులు ఇంతియాజ్, శ్రీనాధ్, శ్రీకాంత్, పవన్, నాగ, ప్రశాంత్, చరణ్, హరి, ప్రసాద్, జగదీష్ పాల్గొన్నారు.