రంపచోడవరం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రాజేశ్వరి | RAMPACHODAVARAM ysrcp candidate is rajeswari | Sakshi
Sakshi News home page

రంపచోడవరం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రాజేశ్వరి

Published Tue, Apr 22 2014 1:42 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

RAMPACHODAVARAM  ysrcp  candidate is rajeswari

 హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వంతెల రాజేశ్వరి పోటీ చేస్తున్నారు. రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను ఆమోదించి ఫ్యాన్ గుర్తు కేటాయించారు. ఆ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా అనంత సత్య ఉదయభాస్కర్ వేసిన నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఆయన స్థానంలో రాజేశ్వరి ఫ్యాన్ గుర్తుపై రంగంలో ఉంటారన్న విషయాన్ని ఓటర్లు గుర్తించాలని పార్టీ సంస్థాగత వ్యవహారాల కోఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ సోమవారం తెలిపారు. రాజేశ్వరికి అవకాశం రావడంతో అసెంబ్లీకి పోటీపడుతున్న వైఎస్సార్‌సీపీ మహిళా అభ్యర్థుల సంఖ్య 12కు పెరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement