సీసీ ఫుటేజీలో నిందితురాలి గుర్తింపు
సాక్షి, మెదక్: చోరీలు చేస్తున్న మహిళను పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించి అరెస్ట్ చేశారు. గురువారం నారాయణఖేడ్ ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం కంగ్టి మండలం చుక్కల్ తీర్థ్ గ్రామానికి చెందిన విఠాబాయి ఈనెల 16 తేదీన హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్‌కు వచ్చింది. స్టీలు దుకాణంలో వస్తువులు కొనుగోలు చేసింది. దుకాణదారుడికి డబ్బులు చెల్లించేందుకు తన బ్యాగ్‌లో నుంచి నగదు తీస్తుండగా మరో మహిళ చూసింది. ఆమె చాకచక్యంగా బ్యాగులో నుంచి రెండు బంగారు ఉంగరాలు, కొంత నగదు చోరీ చేసింది.
బంగారు ఉంగరాలు, నగదు పోగొట్టుకున్న బాధిత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 17 తేదీన పట్టణంలోని మార్కెట్‌లో మరో మహిళ పర్సును చోరీ చేసేందుకు యత్నించింది. చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీ ఫుటేజీలో చోరీకి యత్నిస్తున్న దృశ్యం కనిపించడంతో నిందితురాలిని అరెస్ట్ చేశారు. నిందితురాలు మహారాష్ట్రలోని డెగ్‌లూర్‌కు చెందిన దుర్గావాడేకర్‌గా గుర్తించారు. గతంలో కర్ణాటక, మహారాష్ట్రలో పలు చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించినట్లు ఎస్‌ఐ వివరించారు.
చదవండి: మహిళ అక్రమ నిర్బంధం.. అయిదుగురు జీఎస్టీ అధికారులపై కేసు
Comments
Please login to add a commentAdd a comment