
సాక్షి, నారాయణఖేడ్: పై చిత్రంలో ముఖానికి మాస్కు లేకుండా చూస్తున్న వ్యక్తి నారాయణఖేడ్ మండలం అబ్బెంద గ్రామ సర్పంచ్. అతన్నుంచి రూ. 500 జరిమానా వసూలు చేసి రశీదు ఇస్తున్నది పంచాయతీ కార్యదర్శి. సంగారెడ్డి జిల్లా పంచా యతీ అధికారి సురేశ్ మోహన్ ఆకస్మిక పర్యటన సందర్భంగా ఉపసర్పంచ్‌తో కలసి మాస్కు ధరించకుండా ఇంటి నుంచి బయటకు వచ్చినందుకు అధికారి వారిద్దరికీ రూ. 500 చొప్పున జరిమానా విధించారు.
ఈ ఫొటో చూశారుగా... ముఖానికి మాస్కుల్లేకుండా, భౌతికదూరం నిబంధన పట్టించుకోకుండా నగరవాసులు ఇలా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. మెహదీపట్నం సమీపంలోని గుడిమల్కా పూర్ పూల మార్కెట్‌కు వీరంతా ఇలా పోటెత్తారు. గ్రామాల్లో చూపుతున్న స్ఫూర్తిని నగరవాసులు కూడా ప్రదర్శిస్తే కరోనాకు అడ్డుకట్ట వేయడం
సాధ్యమవుతుంది.