ఖేడ్‌లో తిరంగా యాత్ర
నారాయణఖేడ్: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు నారాయణఖేడ్‌లో తిరంగా యాత్ర కార్యక్రమాని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వారి త్యాగాలను నేటి తరం గుర్తుచేసుకోవాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగానే తిరంగా యాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీ దిలీప్ పాటిల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరాం, టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు కక్కెరివాడ విఠల్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ఏఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎంబీఆర్ యువసేన తాలూకా అధ్యక్షులు సతీష్‌యాదవ్, టైగర్ నరేంద్ర సేవా సమితి తాలూకా అధ్యక్షులు విలాస్‌రావు, బజరంగ్‌దళ్ నాయకులు ప్రవీణ్, జగదీష్, దేశ్‌ముఖ్, దుదన్‌కర్ సంతోష్, క్రిష్ణా జాదవ్, సంతోష్, నిరుద్యోగ జేఏసీ నాయకులు నీలేష్, నాగరాజు, సూరి, రాజు తదితరులు పాల్గొన్నారు.