tiranga yatra
-
‘కాస్గంజ్’ కేసులో 28 మందికి యావజ్జీవం
లక్నో: సంచలనం సృష్టించిన కాస్గంజ్ హింసాకాండ కేసులో 28 మంది దోషులకు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.80 వేల చొప్పున జరిమానా చెల్లించాలని దోషులను ఆదేశించింది. న్యాయస్థానం ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2018 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్లో నిర్వహించిన తిరంగా యాత్రలో హింస చోటుచేసుకుంది. మత కలహాలు చెలరేగాయి. తిరంగా యాత్రను కొందరు అడ్డుకున్నారు. యాత్రలో పాల్గొన్న చందన్ గుప్తా అనే వ్యక్తిని కాల్చి చంపారు. దీంతో హింస మరింత ప్రజ్వరిల్లింది. కాస్గంజ్ మూడు రోజులపాటు అట్టుడికిపోయింది. ఈ ఉదంతం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. చందన్ గుప్తాను హత్య చేయడంతోపాటు హింసకు కారణమైన దుండుగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య, హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడడం, జాతీయ జెండాను అవమానించడం వంటి ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ప్రభుత్వం అప్పగించింది. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు గురువారం 28 మందిని దోషులుగా తేల్చింది. శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. నసీరుద్దీన్, అసీమ్ ఖురేషీ అనే నిందితులపై తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా గుర్తించింది. -
గాడ్సే ఫొటోలతో తిరంగా యాత్ర!
ముజఫర్‌నగర్: పంద్రాగస్టు సందర్భంగా సోమవారం అఖిల భారతీయ హిందూ మహాసభ చేపట్టిన తిరంగా యాత్రలో నాథూరాం గాడ్సే ఫొటోలను ప్రదర్శించడం కలకలం రేపుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై పలు సంఘాల నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, దీన్ని సంస్థ జాతీయాధ్యక్షుడు యోగేంద్ర వర్మ సమర్థించుకోవడం విశేషం. ‘‘ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మేము తిరంగా యాత్ర చేపట్టాం. జిల్లా మొత్తం ఈ యాత్ర కొనసాగింది. ఇందులో ప్రముఖ హిందూ నేతలంతా పాల్గొన్నారు. మేము పలువురు స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలు పెట్టాం. తిరంగా యాత్రలో మా కార్యకర్తలు ప్రదర్శించిన సమర యోధుల ఫొటోల్లో గాడ్సే కూడా ఉన్నారు. గాంధీ జాతి వ్యతిరేక విధానాలపై గాడ్సే గళం విప్పారన్నది మా విశ్వాసం’’ అని చెప్పుకొచ్చారు యోగేంద్ర వర్మ. ఇదీ చదవండి: కర్ణాటక సీఎం బొమ్మైకి మరో తలనొప్పి.. రాష్ట్ర మంత్రి ఆడియో లీక్! -
‘కేసీఆర్‌లోకి రజాకార్ల ఆత్మ ప్రవేశించింది’
సాక్షి, హైదరాబాద్ : ‘టీఆర్ఎస్ కారైతే.. దాని స్టీరింగ్ మాత్రం ఎమ్ఐఎమ్ చేతిలో ఉంది.. ఎమ్ఐఎమ్ ప్రోద్భలంతోనే కేసీఆర్ నాపై అక్రమ కేసులు బనాయించారని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. గత నెల అనుమతి లేకుండా నగరంలో తిరంగ యాత్ర నిర్వహించినందుకుగాను రాజా సింగ్‌పై కేసు నమోదయిన సంగతి తేలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా నేడు రాజా సింగ్ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదులతో కలిసి విచారణలో పాల్గొన్న ఆయన ప్రశ్నలన్నింటికి రాత పూర్వక సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రజాకార్ల పాలన సాగుతుందంటూ మండి పడ్డారు. 50 ఏళ్ల క్రితం తుడిచిపెట్టుకు పోయిన రజాకార్ల ఆత్మ మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌లో ప్రవేశించిందని విమర్శిచారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కారైతే దాని స్టీరింగ్ మాత్రం ఎమ్ఐఎమ్ చేతిలో ఉందని ఆరోపించారు. ఎమ్ఐఎమ్ ప్రోత్సాహంతోనే కేసీఆర్ తనపై అక్రమ కేసులు బనాయించారని రాజాసింగ్ మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు తిరంగ యాత్ర నిర్వహించినందుకు తనపై కేసులు పెట్టారన్నారు. ఇవన్ని చూస్తే తెలంగాణ పాకిస్తాన్లో ఉందో, భారత దేశంలో ఉందో అర్థం కావడం లేదని వాపోయారు. తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా భయపడనని రాబోయే ఎన్నికల్లో కూడా తాను బీజేపీ తరపున గోషామహల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన రాజాసింగ్ ఆద్వర్యంలో నగరంలో తిరంగ యాత్ర జరిగిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా ఆ యాత్ర నిర్వహించినందుకు అతడిపై నగరంలోని ఐదు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆబిడ్స్ పోలీసులు రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేశారు. -
'అవినీతి రహితంగా మోదీ పాలన'
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాలన అవినీతి లేకుండా సాగుతోందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శనివారం నగరంలోని నెక్లెస్ రోడ్లో తిరంగా యాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో దత్తాత్రేయతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దత్తాత్రేయ మాట్లాడుతూ... దేశభక్తి ప్రతి పౌరునికి నరనరాన ఉండాలన్నారు. అలాగే కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... ధనికులు, పేదల మధ్య అంతరాలు తొలగాలని, తెలంగాణ విమోచన దినానికి మతం రంగు పులిమి అధికారికంగా నిర్వహించడం లేదని ఆయన అన్నారు. అలాగే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... స్వాతంత్ర్య ఫలాలు అన్ని వర్గాలకు అందటం లేదని, మోదీకి వస్తున్న మంచిపేరును సహించలేక చైనా కుట్రలు పన్నుతోందని అన్నారు. -
17న వరంగల్‌లో అమిత్‌షా సభ
హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒకరోజు పర్యటనకు రాష్ట్రానికి వస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 70 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ఆగస్టు 9 నుంచి తిరంగాయాత్రను నిర్వహించింది. రాష్ట్రంతోపాటు నిజాం స్టేట్‌లో భాగంగా ఉన్న మహారాష్ట్రలోని 5, కర్ణాటకలోని 3 జిల్లాల్లో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరుపుతోంది. తెలంగాణలో ఈ యాత్ర ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 17న వరంగల్‌లో నిర్వహిస్తున్న బహిరంగసభకు అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి రెండు గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు అక్కడి నుంచి నేరుగా వరంగల్‌కు చేరుకుని, బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సభ ముగిశాక నగరానికి తిరిగి వచ్చి రాత్రి ఇక్కడే ఒక ప్రైవేట్ హోటల్లో బసచేస్తారు. ఈ పర్యటన సందర్భంగా పార్టీ నాయకులతో ఎలాంటి సమావేశాలు ఉండకపోవచ్చునని తెలుస్తోంది. ఆదివారం (18న) ఉదయమే హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణమవుతారు. -
నిజామాబాద్ జిల్లాలో తిరంగా యాత్ర
డిచ్పల్లి : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గన్నారం వద్ద తిరంగా బైక్ ర్యాలీని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ తిరంగా బైక్ ర్యాలీలో బీజేపీ రూరల్ ఇన్చార్జి కేశ్‌పల్లి ఆనంద్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
2019లో మాదే అధికారం
భిక్కనూరు: ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం కేసీఆర్ నెరవేర్చడం లేదని, మాట మార్చడం ఆయన నైజమని బీజేపీ నేతలు విమర్శించారు. సోమవారం భిక్కనూర్ మండల కేంద్రంలో కేంద్రంలో నిర్వహించిన తిరంగా యాత్రలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఉప్పునూతల మురళీధర్‌గౌడ్ ప్రసంగించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రగల్బాలు పలికిన కేసీఆర్.. తాను అధికారంలోకి రాగానే ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, లేకుంటే ప్రజా ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు. కర్ణాటక, మహారాష్ట్రలలో అక్కడి ప్రభుత్వాలు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల మాదిరిగా నిర్వహిస్తున్నాయని, తెలంగాణలో నిర్వహించక పోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 2019లో బీజేపీదే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రైతు ఏడ్చిన రాజ్యంలో పాలకులు బాగు పడరని పదేపదే చెప్పిన కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం చేసిందేమీ లేదన్నారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శి రవీందర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు సింగం శ్రీనివాస్, నేతలు డప్పు రవి, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్, రాంరెడ్డి, ఆనంద్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
త్యాగధనులను స్మరించుకుందాం
మజ్లీస్ చేతిలో కీలుబొమ్మగా ప్రభుత్వం బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి ధ్వజం బోధన్: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ, వారు చూపిన బాటలో నడుద్దామని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మజ్లీస్ చేతిలో టీఆర్ఎస్ సర్కారు కీలుబొమ్మగా మారిందని, అందుకే తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం అధికారికంగా విమోజన దినోత్సవాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం బోధన్‌లో నిర్వహించిన తిరంగ యాత్ర ర్యాలీలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని స్మరిస్తూ, వారి త్యాగాలను భావితరాలకు చాటిచెప్పాలనే లక్ష్యంతోనే తిరంగ యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. మజ్లీస్ ప్రభావంతోనే.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయని, కానీ ఉమ్మడి రాష్ట్రం నుంచి గత ప్రభుత్వాలు ఇక్కడ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేడం లేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని, విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోనైనా అధికారికంగా నిర్వహిస్తారని భావిస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వాల బాటలోనే నడుస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మజ్లీస్ పార్టీ నేతలను భుజాన మోస్తోందని, ఆ పార్టీ కనుసన్నల్లోనే పాలన సాగుతోందని ఆరోపించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. మాట తప్పిన కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమ సమయంలో డిమాండ్ చేసిన సీఎం కెసీఆర్ అధికారంలోకి రాగానే మాట మార్చారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎం.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా అడ్డు పడుతోందన్నారు. తెలంగాణకు ప్రత్యేక చరిత్ర ఉందని, నిజాం నిరంకుశ పాలన, రజకార్ల అకృత్యాలకు వందలాది మంది తెలంగాణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. వందలాది మంది త్యాగల చరిత్ర కలిగిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 17న వరంగల్‌లో విమోదచన దినోత్సవ సభ తలపెట్టామని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, నేతలు అడ్లూరి శ్రీనివాస్, మురళీధర్‌గౌడ్, నర్సింహారెడ్డి, ఉమాశంకర్, శివప్ప, సుభాష్, బాపురెడ్డి, లింగం, రాజు, రామరాజు తదితరులు పాల్గొన్నారు. -
తిరంగాయాత్ర ప్రారంభం
కోదాడ : తెలంగాణ వియోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు కోరారు. ఆదివారం కోదాడలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగాయాత్రను ఆయన బస్టాండ్ సెంటర్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణరాష్ట్ర సాధన పోరాట సమయంలో నిత్యం విమోచన దినాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పిన కేసీఆర్ నేడు అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు నిర్వహించాలని ప్రశ్నించడం ఆయన ద్వంద్వనీతికి నిదర్శనమన్నారు. ఎంపీ కవిత విమోచన దినోత్సవంపై అపరిపక్వ ప్రకటనలు చేయడం మానుకోవాలన్నారు. ఈ సందర్బంగా కోదాడలోని అక్కిరాజు వాసుదేవరావు, చాలకి ఐలమ్మ, గుడుగుంట్ల అప్పయ్య విగ్రహాలకు, కీసర జితేందర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, నూనె సులోచన, కనగాల వెంకట్రామయ్య, బొలిశెట్టి కృష్ణయ్య, యాదా రమేష్,వంగవీటి శ్రీనివాసరావు, అక్కిరాజు యశ్వంత్, కనగాల నారాయణ, సాతులూరి హన్మంతరావు, కొదుమూరి ప్రవీణ్, సాంబశివరావు, నకిరికంటి జగన్మోహన్రావు, చిలుకూరి శ్రీనివాస్, కోమటి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
రజాకార్ల వారసుల పార్టీ మజ్లిస్
హన్మకొండ : తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. భారతీయ జనతా యువమోర్చా(బీజేవైఎం) గ్రేటర్ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తిరంగా యాత్రను హన్మకొండలోని తెలంగాణ అమరుల కీర్తి స్థూపం వద్ద ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా పార్టీ శ్రేణులు జాతీయ జెండాలను చేతబూని ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్నాయి. ర్యాలీ పట్టణంలో ప్రధాన వీధుల మీదుగా ఖిలా వరంగల్ వరకు జరిగింది. అక్కడ స్వాతంత్య్ర సమరయోధుడు బత్తిని మెుగిలయ్య చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వరంగల్ కాశిబుగ్గ వెంకట్రామ జంక్షన్‌లోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా, యాత్ర ప్రారంభించిన సందర్భంగా నల్లు ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ రజాకార్ల వారసుల పార్టీ ఎంఐఎంతో ఉన్న లోపాయికారీ ఒప్పందం వల్లే టీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేందుకు సాహసించడం లేదన్నారు. ఆ రోజున బీజేపీ ఆధ్వర్యంలో వాడవాడలా జాతీయ జెండాలు ఎగురవేస్తామన్నారు. బీజేవైఎం గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు సాంబయ్య, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్ టి.రాజేశ్వర్‌రావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మారావు, రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రాకేష్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రంజిత్ పాల్గొన్నారు. -
దేశ భక్తి పెంపొందించేందుకే ‘తిరంగా యాత్ర’
మహారాష్ట్ర ఫారెస్టు కార్పొరేషన్ చైర్మన్ చందన్ సింగ్ చందెలాజీ బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ఆసిఫాబాద్ : ప్రజల్లో దేశ భక్తి పెంపొందించేందుకే ప్రధాని నరేంద్ర మోదీ తిరంగా యాత్ర ప్రారంభించారని మహారాష్ట్ర ఫారెస్టు కార్పొరేషన్ చైర్మన్ చందన్ సింగ్ చందెలాజీ అన్నారు. గత నెల 15 నుంచి ఈ నెల 17 వరకు దేశ వ్యాప్తంగా చేపడుతున్న తిరంగా యాత్రను పట్టణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి గాంధీచౌక్, వివేకానందచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. శిశుమందిర్ విద్యార్థులు దేశ స్వాతంత్ర సమర యోధుల వేషధారణ, భగత్ సింగ్ వేష«ధారణతో గుర్రంపై ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చందన్ సింగ్, రాజూర ఎమ్మెల్యే సంజయ్ ధోటేజి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు దండనాయకుల గోపాల్ కిషన్ రావు, దండనాయకుల శ్రీనివాస రావులను శాలువలు, పూల దండలతో సన్మానించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో మతి చెందిన బీజేపీ నాయకుడు ఇరుకుల్ల కిషోర్ కుటుంబీకులకు ప్రధాన మంత్రి భీమాయోజన పథకం కింద రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోనగిరి సతీశ్ బాబు, సీనియర్ నాయకులు ఈదులవాడ మారుతి, మండల పార్టీ అధ్యక్షుడు ఖాండ్రే విశాల్, చంద్రకాంత్, కొలిపాక వేణుగోపాల్, విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు కర్నాగౌడ్, వార్డు సభ్యురాలు కోట సునిత, కోట వెంకన్న, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
చరిత్రను మరిపించే కుట్ర
మహబూబ్‌నగర్ న్యూటౌన్: స్వరాష్ట్రంలో రాష్ట్ర అవతరణ వేడుకలను వైభవంగా జరుపుకోవాలనుకున్న తెలంగాణ ప్రజల ఆశలపై టీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు చల్లిందని, చరిత్రను మరిపించేందుకు కుట్ర చేస్తుందని శాసన మండలి సభ్యుడు రాంచందర్‌రావు ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలో బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరంగా యాత్ర ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. క్లాక్‌టవర్ వద్ద ఆయన మాట్లాడుతూ మజ్లిస్ పార్టీ ఒత్తిళ్లతోనే సీఎం కేసీఆర్ విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహించడంలేదన్నారు. విమోచన దినం రోజు తమ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఎగురవేస్తామన్నారు. అంతకు ముందు అంబేద్కర్ చౌరస్తాలో డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ అసోసియేషన్ చైర్మన్ నర్సింహారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్, మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండు రెడ్డి, జిల్లా నాయకులు పడాకుల సత్యం, పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ అనంతరెడ్డి, న్యాయవాదులు నాగేందర్రాజు, రమణయ్య, గడ్డం గోపాల్, శివకుమార్, మోహన్, బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు. అయిజలో... సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనదినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ఎమ్మెల్సీ రామచందర్‌రావు డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ ఆధ్వర్యంలో 70వ స్వాతంత్ర దినోత్సవ తిరంగ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ పాలన నిజాం పరిపాలనను తలపిస్తోందని విమర్శించారు. ప్రజల, రైతుల సంక్షేమార్థం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకు ముందు తిరంగ యాత్రను ఎమ్మెల్సీ ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథరెడ్డి ఉదయం మండలంలోని బింగిదొడ్డి గ్రామంలో జెండా ఊపి తిరంగయాత్రను ప్రారంభించారు. అక్కడినుంచి తూంకుంట, గుడుదొడ్డి, వెంకటాపురం, ఉప్పలక్యాంప్, చిన్నతాండ్రపాడు, మేడికొండ, పులికల్, సింధనూర్, కొత్తపల్లి, బైనపల్లి గ్రామాలమీదుగా యాత్ర సాగింది. సాయంత్రం బీజేపీ నాయకులు అయిజ పట్టణం చేరుకున్నారు. కొత్తబస్టాండ్‌లో∙బహిరంగసభ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రతంగిపాన్‌రెడ్డి, అయ్యవారి ప్రభాకర్‌రెడ్డి తదితరులుపాల్గొన్నారు. -
ఝండా ఉంఛారహే హమారా
సంగారెడ్డిలో ఘనంగా తిరంగా యాత్ర సంగారెడ్డి టౌన్: బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఘనంగా తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐబీ నుండి సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ విగ్రం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనా రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పటేల్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా తిరంగా యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, ఎస్పీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండాపురం జగన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణువర్దన్ రెడ్డి, చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు నాగరాజు, మండల అధ్యక్షులు నర్సింహా రెడ్డి, యువ మోర్చ నాయకులు విష్ణు, విజయ్, పవన్, ద్వారక రవి, సుదీర్ రెడ్డి, విద్యార్థులు, బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తు పాల్గొన్నారు. -
కేబీఆర్ పార్కు వద్ద తిరంగా యాత్ర ప్రారంభం
హైదరాబాద్: నగరంలోని కేబీఆర్ పార్కు వద్ద బీజేపీ నేతృత్వంలో శనివారం తిరంగా యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్రను కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఫిల్మ్‌నగర్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మీదుగా 5 కి.మీ మేర ఈ యాత్ర సాగుతోంది. తిరంగా యాత్రలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ కార్యకర్తలతోపాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
వీరుల త్యాగాలను స్మరించుకునేందుకే తిరంగయాత్ర
పరకాల : భారతదేశానికి స్వేచ్ఛా వాయువులను అందించేందుకు ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకునేందుకే తిరంగ యాత్రను చేపట్టినట్లు మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి అన్నారు. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పరకాలలో తిరంగయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ నుంచి ఆర్టీసీ డిపో వరకు 200 మీటర్ల జాతీయ జెండాతో వందలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జంగారెడ్డి మాట్లాడుతూ 70 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు తిరంగయాత్రను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీ వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కానుగుల గోపినాథ్, ముస్కే సంతోష్, పల్లెబోయిన సురేష్, మేకల రాజవీరు, రామన్న, జయపాల్‌రెడ్డి, సర్పంచ్ భిక్షపతి, సంఘమేశ్వర్, లెక్చరర్లు, విద్యార్దులు పాల్గొన్నారు. -
ఘనంగా తిరంగ యాత్ర
నారాయణఖేడ్: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు నారాయణఖేడ్‌లో తిరంగా యాత్ర కార్యక్రమాని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వారి త్యాగాలను నేటి తరం గుర్తుచేసుకోవాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగానే తిరంగా యాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీ దిలీప్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరాం, టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు కక్కెరివాడ విఠల్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ఏఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎంబీఆర్ యువసేన తాలూకా అధ్యక్షులు సతీష్‌యాదవ్, టైగర్ నరేంద్ర సేవా సమితి తాలూకా అధ్యక్షులు విలాస్‌రావు, బజరంగ్దళ్ నాయకులు ప్రవీణ్, జగదీష్, దేశ్‌ముఖ్, దుదన్‌కర్ సంతోష్, క్రిష్ణా జాదవ్, సంతోష్, నిరుద్యోగ జేఏసీ నాయకులు నీలేష్, నాగరాజు, సూరి, రాజు తదితరులు పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా ఏకరూప పన్ను విధానం
కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేగ్వాల్ నెల్లూరు(బారకాసు): జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ అమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా ఏకరూప పన్ను విధానం అమల్లోకి రానుందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేగ్వాల్ పేర్కొన్నారు. తిరంగయాత్రలో భాగంగా మంగళవారం ఆయన నెల్లూరు విచ్చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఒకే దేశం..ఒకే పన్ను విధానం వలన ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇది చాలా కీలకమైన మార్పుగా ఆయన అభివర్ణించారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు స్వాతంత్య్ర సమరయోధులకు ఘనమైన నివాళులర్పించేందుకే కేంద్ర ప్రభుత్వం తిరంగయాత్ర ప్రారంభించిందన్నారు. ముఖ్యంగా యువత దేశ చరిత్ర తెలుసుకుని దేశ భవిష్యత్ కోసం పనిచేయాలన్న ఉద్దేశంతో తిరంగయాత్ర ద్వారా ఆనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. అప్పట్లో సర్థార్వల్లభాయిపటేల్ దేశ ఐక్యత కోసం 560 సంస్థానాలను ఏకం చేశారన్నారు. నేడు ప్రధాని నరేంద్రమోదీ కూడా భారతదేశ అభివృద్ధి కోసం ఆదే బాటలో పయనిస్తున్నారని చెప్పారు. ఏపీని కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుంది రాష్ట్ర విభజన అనంతరం అంధ్రప్రదేశ్‌ను కేంద్రం అన్ని విధాల ఆదుకుంటుందని కేంద్ర ఆర్థిక సహాయక మంత్రి మేగ్వాల్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి అవసరమైన మేరకుఇప్పటికే నిధులు విడుదల చేసిందని, రానున్న రోజుల్లో మరిన్ని నిధులు విడుదల చేయనుందని తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తొలుత కేంద్ర, రాష్ట్ర మంత్రులు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఆత్మకూరు బస్టాండ్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రరెడ్డి, నేతలు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, తేలపల్లిరాఘవయ్య, కందుకూరి సత్యనారాయణ పాల్గొన్నారు. -
'బీజేపీ హయాంలోనే పేదలకు భరోసా'
హైదరాబాద్ : ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందడమే కాకుండా సబ్సిడీలను నేరుగా వారి ఖాతాలోకి వచ్చే విధంగా చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావు అన్నారు. గత పాలకుల హయాంలో సగానికి పైగా దళారీల చేతులోకి వెళ్ళేవన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవాడికి ఒక్కరూపాయి కూడా లేకుండా జనధన్ పథకం ద్వారా బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం జరిగిందన్నారు. తిరంగ్ యాత్రలో భాగంగా మురళీధర్‌రావు కూకట్పల్లి వై జంక్షన్ వద్దగల అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం పూలమాల వేసి అనంతరం ర్యాలీగా సమీపంలో ఉన్న ఇందిరానగర్ మురికివాడకు వెళ్ళి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి బస్తీ వాసుల స్థితిగతులను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం 85వేల ఇళ్లు కేటాయించిందనీ, రాబోయే కాలంలో మరిన్ని ఇళ్ళు కేటాయించి ప్రతి పేదవాడికి పక్కా ఇంటి కోసం కృషి చేస్తుందన్నారు. మోదీ హయాంలో అవినీతి రహిత ప్రభుత్వం నడుస్తుందని, ఇది జీర్ణించుకోలేని అవినీతి చక్రవర్తులకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయన్నారు. ప్రధాని చేపట్టబోయే పథకాలు పేదలకు నేరుగా అందే విధంగా తాము కృషి చేస్తామన్నారు. -
దేశభక్తిని చాటిన తిరంగా యాత్ర
అనంతపురం కల్చరల్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన తిరంగా యాత్ర ఆద్యంతం దేశభక్తిని చాటింది. యువకేంద్ర యూత్ కోఆర్డినేటర్ శివకుమార్ నేతృత్వంలో యాద్ కరో ఖుర్బాని పేరిట త్రివర్ణ పతాకంతో కార్యక్రమం జరిగింది. వందలాది మంది యువతీ యువకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, కార్పోరేషన్ కార్యాలయం, ఎలే్కపి మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, మేయర్ స్వరూప, డిప్యూటీ మేయర్ గంపన్న తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యులు కావాలని, తమ తెలివితేటలను, శక్తియుక్తులను దేశ ప్రగతి కోసం ఉపయోగించాలని వక్తలు పిలుపునిచ్చారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు కల్లూరు సుబ్బారావు వారసుడైన కల్లూరి ఆదినారాయణను ఘనంగా సత్కరించారు. అంతకు ముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర డీడీఓ శ్రీనివాసులు, సాయి సంస్థ అధ్యక్షులు విజయ్సాయికుమార్, యోగా గురువులు సాయి మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క వర్గానికే కొమ్ము కాస్తాయి: అమిత్ షా
కాకోరి: ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాకోరిలో శనివారం తిరంగా యాత్ర'ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్‌వాది పార్టీ అధికారంలోకి వస్తే యూపీ అభివృద్ధి చెందుతుందా? 24 గంటలూ కరెంట్ ఇస్తారా? బులంద్‌షహర్ గ్యాంగ్‌రేప్ ఘటన లాంటి కేసులు ఆగుతాయా అని ప్రశ్నలు వర్షం కురిపించారు. సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్‌వాది పార్టీ అధికారంలోకి వస్తే ఒక వర్గం కోసమే పనిచేస్తాయని ఆరోపించారు. బీజేపీ అన్ని వర్గాల అభివృద్ధికి పాటు పడుతుందని హామీయిచ్చారు. 'సబ్ కా సాత్, సబ్ వికాస్' తమ అమిత్ షా విధానమనిగుర్తు చేశారు. -
సత్తర్ సాల్ ఆజాదీ.. యాద్ కరో కుర్బానీ
‘తిరంగా యాత్ర’ థీంసాంగ్ను ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు సాక్షి, న్యూఢిల్లీ: డెబ్బై ఏళ్ల భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సత్తర్ సాల్ ఆజాదీ.. యాద్ కరో కుర్బానీ’ పేరుతో రూపొందించిన ‘తిరంగా యాత్ర’ థీం సాంగ్‌ను కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్య శుక్రవారం ఢిల్లీలో విడుదల చేశారు. గజల్ శ్రీనివాస్ రచించిన ఈ పాటను నాలుగు భాషల్లో రూపొందించినట్లు ఆయన తెలిపారు.