17న వరంగల్‌లో అమిత్‌షా సభ | Amit shah meeting in Warangal | Sakshi
Sakshi News home page

17న వరంగల్‌లో అమిత్‌షా సభ

Published Thu, Sep 15 2016 9:29 PM | Last Updated on Mon, May 28 2018 3:58 PM

17న వరంగల్‌లో అమిత్‌షా సభ - Sakshi

17న వరంగల్‌లో అమిత్‌షా సభ

హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒకరోజు పర్యటనకు రాష్ట్రానికి వస్తున్నారు.  బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 70 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ఆగస్టు 9 నుంచి  తిరంగాయాత్రను నిర్వహించింది. రాష్ట్రంతోపాటు నిజాం స్టేట్‌లో భాగంగా ఉన్న మహారాష్ట్రలోని 5, కర్ణాటకలోని 3 జిల్లాల్లో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరుపుతోంది. తెలంగాణలో ఈ యాత్ర ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 17న వరంగల్‌లో నిర్వహిస్తున్న బహిరంగసభకు అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.

శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి రెండు గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు అక్కడి నుంచి నేరుగా వరంగల్‌కు చేరుకుని, బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సభ ముగిశాక నగరానికి తిరిగి వచ్చి రాత్రి ఇక్కడే ఒక ప్రైవేట్ హోటల్లో బసచేస్తారు. ఈ పర్యటన సందర్భంగా పార్టీ నాయకులతో ఎలాంటి సమావేశాలు ఉండకపోవచ్చునని తెలుస్తోంది. ఆదివారం (18న) ఉదయమే హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement