తిరంగాయాత్ర ప్రారంభం
తిరంగాయాత్ర ప్రారంభం
Published Sun, Sep 11 2016 8:22 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
కోదాడ : తెలంగాణ వియోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు కోరారు. ఆదివారం కోదాడలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగాయాత్రను ఆయన బస్టాండ్ సెంటర్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణరాష్ట్ర సాధన పోరాట సమయంలో నిత్యం విమోచన దినాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పిన కేసీఆర్ నేడు అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు నిర్వహించాలని ప్రశ్నించడం ఆయన ద్వంద్వనీతికి నిదర్శనమన్నారు. ఎంపీ కవిత విమోచన దినోత్సవంపై అపరిపక్వ ప్రకటనలు చేయడం మానుకోవాలన్నారు. ఈ సందర్బంగా కోదాడలోని అక్కిరాజు వాసుదేవరావు, చాలకి ఐలమ్మ, గుడుగుంట్ల అప్పయ్య విగ్రహాలకు, కీసర జితేందర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, నూనె సులోచన, కనగాల వెంకట్రామయ్య, బొలిశెట్టి కృష్ణయ్య, యాదా రమేష్,వంగవీటి శ్రీనివాసరావు, అక్కిరాజు యశ్వంత్, కనగాల నారాయణ, సాతులూరి హన్మంతరావు, కొదుమూరి ప్రవీణ్, సాంబశివరావు, నకిరికంటి జగన్మోహన్‌రావు, చిలుకూరి శ్రీనివాస్, కోమటి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement