చరిత్రను మరిపించే కుట్ర | Official do the Septem-17 | Sakshi
Sakshi News home page

చరిత్రను మరిపించే కుట్ర

Published Sat, Sep 10 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

111.అయిజలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రామచందర్‌రావు

111.అయిజలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రామచందర్‌రావు

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: స్వరాష్ట్రంలో రాష్ట్ర అవతరణ వేడుకలను వైభవంగా జరుపుకోవాలనుకున్న తెలంగాణ ప్రజల ఆశలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నీళ్లు చల్లిందని, చరిత్రను మరిపించేందుకు కుట్ర చేస్తుందని శాసన మండలి సభ్యుడు రాంచందర్‌రావు ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలో  బీజేపీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరంగా యాత్ర ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. క్లాక్‌టవర్‌ వద్ద ఆయన మాట్లాడుతూ మజ్లిస్‌ పార్టీ ఒత్తిళ్లతోనే సీఎం కేసీఆర్‌ విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహించడంలేదన్నారు.  
 
విమోచన దినం రోజు  తమ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఎగురవేస్తామన్నారు. అంతకు ముందు అంబేద్కర్‌ చౌరస్తాలో డా.బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.   కార్యక్రమంలో రాష్ట్ర బార్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి,  పార్టీ రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్, మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి,  జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండు రెడ్డి, జిల్లా నాయకులు పడాకుల సత్యం,  పార్టీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ అనంతరెడ్డి, న్యాయవాదులు నాగేందర్‌రాజు, రమణయ్య, గడ్డం గోపాల్, శివకుమార్, మోహన్, బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.
 
అయిజలో... సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచనదినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా  ప్రకటించాలని  ఎమ్మెల్సీ రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు. శనివారం బీజేపీ ఆధ్వర్యంలో 70వ స్వాతంత్ర దినోత్సవ తిరంగ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ పాలన నిజాం పరిపాలనను తలపిస్తోందని విమర్శించారు. ప్రజల, రైతుల సంక్షేమార్థం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకు ముందు తిరంగ యాత్రను ఎమ్మెల్సీ ప్రారంభించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథరెడ్డి ఉదయం మండలంలోని  బింగిదొడ్డి గ్రామంలో  జెండా ఊపి తిరంగయాత్రను ప్రారంభించారు.  అక్కడినుంచి  తూంకుంట, గుడుదొడ్డి, వెంకటాపురం, ఉప్పలక్యాంప్, చిన్నతాండ్రపాడు, మేడికొండ, పులికల్, సింధనూర్, కొత్తపల్లి, బైనపల్లి గ్రామాలమీదుగా యాత్ర సాగింది. సాయంత్రం బీజేపీ నాయకులు అయిజ పట్టణం చేరుకున్నారు. కొత్తబస్టాండ్‌లో∙బహిరంగసభ నిర్వహించారు.  పార్టీ జిల్లా అధ్యక్షుడు రతంగిపాన్‌రెడ్డి, అయ్యవారి ప్రభాకర్‌రెడ్డి  తదితరులుపాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement