'అవినీతి రహితంగా మోదీ పాలన' | Union Minister Bandaru Dattatreya Participates In Tiranga Yatra | Sakshi
Sakshi News home page

'అవినీతి రహితంగా మోదీ పాలన'

Published Sat, Aug 12 2017 11:12 AM | Last Updated on Mon, Sep 11 2017 11:55 PM

Union Minister Bandaru Dattatreya Participates In Tiranga Yatra

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాలన అవినీతి లేకుండా సాగుతోందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శనివారం నగరంలోని నెక్లెస్ రోడ్‌‌‌లో తిరంగా యాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో దత్తాత్రేయతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దత్తాత్రేయ మాట్లాడుతూ... దేశభక్తి ప్రతి పౌరునికి నరనరాన ఉండాలన్నారు.
 
అలాగే కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... ధనికులు, పేదల మధ్య అంతరాలు తొలగాలని, తెలంగాణ విమోచన దినానికి మతం రంగు పులిమి అధికారికంగా నిర్వహించడం లేదని ఆయన అన్నారు. అలాగే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... స్వాతంత్ర్య ఫలాలు అన్ని వర్గాలకు అందటం లేదని, మోదీకి వస్తున్న మంచిపేరును సహించలేక చైనా కుట్రలు పన్నుతోందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement