2019లో మాదే అధికారం
2019లో మాదే అధికారం
Published Mon, Sep 12 2016 10:15 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
భిక్కనూరు:
ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం కేసీఆర్ నెరవేర్చడం లేదని, మాట మార్చడం ఆయన నైజమని బీజేపీ నేతలు విమర్శించారు. సోమవారం భిక్కనూర్ మండల కేంద్రంలో కేంద్రంలో నిర్వహించిన తిరంగా యాత్రలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఉప్పునూతల మురళీధర్‌గౌడ్ ప్రసంగించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రగల్బాలు పలికిన కేసీఆర్.. తాను అధికారంలోకి రాగానే ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, లేకుంటే ప్రజా ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు. కర్ణాటక, మహారాష్ట్రలలో అక్కడి ప్రభుత్వాలు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల మాదిరిగా నిర్వహిస్తున్నాయని, తెలంగాణలో నిర్వహించక పోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 2019లో బీజేపీదే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రైతు ఏడ్చిన రాజ్యంలో పాలకులు బాగు పడరని పదేపదే చెప్పిన కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం చేసిందేమీ లేదన్నారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శి రవీందర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు సింగం శ్రీనివాస్, నేతలు డప్పు రవి, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్, రాంరెడ్డి, ఆనంద్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement