దేశ భక్తి పెంపొందించేందుకే ‘తిరంగా యాత్ర’
-
మహారాష్ట్ర ఫారెస్టు కార్పొరేషన్ చైర్మన్ చందన్ సింగ్ చందెలాజీ
-
బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర
ఆసిఫాబాద్ : ప్రజల్లో దేశ భక్తి పెంపొందించేందుకే ప్రధాని నరేంద్ర మోదీ తిరంగా యాత్ర ప్రారంభించారని మహారాష్ట్ర ఫారెస్టు కార్పొరేషన్ చైర్మన్ చందన్ సింగ్ చందెలాజీ అన్నారు. గత నెల 15 నుంచి ఈ నెల 17 వరకు దేశ వ్యాప్తంగా చేపడుతున్న తిరంగా యాత్రను పట్టణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి గాంధీచౌక్, వివేకానందచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. శిశుమందిర్ విద్యార్థులు దేశ స్వాతంత్ర సమర యోధుల వేషధారణ, భగత్ సింగ్ వేష«ధారణతో గుర్రంపై ర్యాలీ చేపట్టారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చందన్ సింగ్, రాజూర ఎమ్మెల్యే సంజయ్ ధోటేజి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు దండనాయకుల గోపాల్ కిషన్ రావు, దండనాయకుల శ్రీనివాస రావులను శాలువలు, పూల దండలతో సన్మానించారు.
ఈ సందర్భంగా అనారోగ్యంతో మతి చెందిన బీజేపీ నాయకుడు ఇరుకుల్ల కిషోర్ కుటుంబీకులకు ప్రధాన మంత్రి భీమాయోజన పథకం కింద రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోనగిరి సతీశ్ బాబు, సీనియర్ నాయకులు ఈదులవాడ మారుతి, మండల పార్టీ అధ్యక్షుడు ఖాండ్రే విశాల్, చంద్రకాంత్, కొలిపాక వేణుగోపాల్, విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు కర్నాగౌడ్, వార్డు సభ్యురాలు కోట సునిత, కోట వెంకన్న, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.