ఆపరేషన్‌ ముగిసింది  | Operation Valentine is set to release worldwide on December 8th 2023 | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ ముగిసింది 

Published Fri, Oct 20 2023 12:47 AM | Last Updated on Fri, Oct 20 2023 12:47 AM

Operation Valentine is set to release worldwide on December 8th 2023 - Sakshi

ఆపరేషన్‌ వాలెంటైన్‌ ముగిసింది. వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ద్విభాషా (తెలుగు–హిందీ) చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పైలట్‌గా నటించారు వరుణ్‌ తేజ్‌. ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న హీరోయిన్‌ మానుషీ చిల్లర్‌ రేడార్‌ ఆఫీసర్‌గా నటించగా, నవదీప్‌ ఓ కీలక పాత్ర చేశారు.

శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘‘వైమానిక దాడుల్లో మన దేశ వైమానిక దళం హీరోలు, వారు ఎదుర్కొన్న సవాళ్లను చూపించే ప్రయత్నంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమా పోస్ట్‌ప్రోడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ప్రోడక్షన్స్, రినైసన్స్‌ పిక్చర్స్‌పై సందీప్‌ ముద్దా నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 8న రిలీజ్‌ కానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement