Pratap
-
రాయ్‌బరేలీలో రాహుల్‌కు దినేష్ పోటీనివ్వగలరా?
ఎట్టకేలకు రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తేలిపోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై పోటీకి దిగారు. మరి దినేష్.. రాహుల్‌కు తగిన పోటీని ఇవ్వగలరా? బీజేపీ అభ్యర్థి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి?ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీని గాంధీ కుటుంబానికి కంచుకోటగా పరిగణిస్తుంటారు. ఈసారి ఇక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా గాంధీ నిరాకరించారు. దీంతో ఆమె కుమారుడు రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీకి దిగారు. ఇదే స్థానం నుంచి బీజేపీ తన అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్‌ను బరిలో నిలిపింది.2018లో దినేష్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆ మరుసటి ఏడాది ఆయనకు బీజేపీ లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీపై దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేశారు. అయితే సోనియా గాంధీ 1,67,178 ఓట్లతో విజయం సాధించారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ దినేష్ ప్రతాప్ సింగ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. రాయ్‌బరేలీ రాజకీయాలలో పంచవటి వర్గం ఆధిపత్యం చెలాయిస్తుంది. దినేష్ పంచవటి వర్గానికి చెందినవారు. ఆయన గుణవర్ కమంగల్పూర్ గ్రామ నివాసి.రాయ్‌బరేలీ రాజకీయాలలో దినేష్ కుటుంబానికి ఆదరణ ఉంది. ఒకప్పుడు ఆయన సోనియా గాంధీకి అత్యంత సన్నిహితునిగా పేరొందారు. 2010లో తొలిసారిగా, 2016లో రెండోసారి కాంగ్రెస్ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ ఎమ్మెల్సీ అయ్యారు. 2018లో కాంగ్రెస్‌ను వీడి, బీజేపీలో చేరారు. మరి ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత దినేష్ కాంగ్రెస్‌కు ఎంతవరకూ పోటీనివ్వగలరో వేచిచూడాలి. -
ఇన్సూరెన్స్ డబ్బు కోసం చావు డ్రామా
పాములపాడు: నంద్యాల జిల్లా పాములపాడులోని ఏకే ట్రేడర్స్ గోదాంలో ఈ నెల 1న రాత్రి మంటల్లో సజీవ దహనమైన వ్యక్తిగా భావించిన ఫారుక్‌బాషా బతికే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ రోజు రాత్రి సజీవ దహనమైన వ్యక్తి పాములపాడు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని శెట్టి ప్రతాప్‌గా గుర్తించారు. అప్పుల్ని ఎగ్గొట్టడంతోపాటు ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఫారూక్‌బాషా తాను చనిపోయినట్టుగా చిత్రీకరించాడని తేలింది. వివరాల్లోకి వెళితే.. పాములపాడుకు చెందిన ఫారుక్‌బాషా ధాన్యం వ్యాపారం చేసేవాడు. అతడు రైతులకు దాదాపు రూ.కోటి వరకు బకాయి పడినట్టు తెలుస్తోంది. అప్పులు తీర్చకుండా ఎగ్గొట్టడంతోపాటు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము రాబట్టేందుకు ఫారుక్‌బాషా చనిపోయినట్టు నమ్మించాడు. అతడి కుటుంబ సభ్యులు కూడా మంటల్లో మరణించిన వ్యక్తి ఫారుక్‌బాషానే అని నిర్ధారించడంతో పోలీసులు పంచనామా నిర్వహించి.. మృతదేహాన్ని కుటుంబ çసభ్యులకు అప్పగించారు. మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి.. కాగా.. చెలిమిల్ల గ్రామానికి చెందిన శెట్టి ప్రతాప్ అదృశ్యమైనట్టు అతడి భార్య స్వరూప ఈ నెల 4న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా మంటల్లో లభ్యమైన మృతదేహం ఆనవాళ్లను ఆమెకు చూపించగా.. చొక్కా, ఇతర ఆనవాళ్లను బట్టి తన భర్తగానే గుర్తించింది. ఫారుక్‌బాషా తన భర్తను సజీవ దహనం చేశాడని ఆరోపించింది. దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మృతదేహం శెట్టి ప్రతాప్‌దేననే నిర్ధారణకు వచ్చారు. అప్పటికే ఫారుక్‌బాషా పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు హైదరాబాద్‌లో ఉన్నాడని తెలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయమై ఎస్ఐ అశోక్‌ను వివరణ కోరగా.. దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
గఘనయానులు...
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌లో పాల్గొనబోతున్న వ్యోమగాములంతా నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థులే. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాన్షు శుక్లా వృత్తిరీత్యా యుద్ధపైలెట్లు. వీరంతా గగన్‌యాన్ కోసం ఇప్పటికే రష్యాలో వ్యోమగాములుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. భారత్‌లోనూ ఇస్రో వీరికి కొంతకాలంగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తమ నలుగురు యుద్ధవిమాన పైలెట్లు గగన్‌యాన్‌లో భాగస్వాములు కావడం తమకెంతో గర్వకారణమని భారత వాయుసేన పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ‘సూపర్ ఫోర్’ గురించి... ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ భారత వాయుసేనలో యుద్ధవిమానాన్ని సుదీర్ఘకాలంపాటు నడిపిన అనుభవం ఉన్న పైలెట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఈ నలుగురిలో ఒక్కడిగా ఎంపికయ్యారు. కేరళలోని తిరువజియాడ్‌లో 1976 ఆగస్ట్ 26న జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో శిక్షణ పూర్తిచేసుకుని అక్కడే ‘స్క్వాడ్ ఆఫ్ హానర్’ను సాధించారు. తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్విసెస్ స్టాఫ్ కాలేజీలో, తాంబరం ఎఫ్‌ఐఎస్‌లో చదువుకున్నారు. తర్వాత ఈయన 1998 డిసెంబర్19న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో యుద్ధవిమాన పైలెట్‌గా విధుల్లో చేరారు. సుఖోయ్30ఎంకేఐ, మిగ్–21, మిగ్–29 ఇలా పలు రకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన దిట్ట. మొత్తంగా 3,000 గంటలకుపైగా యుద్ధవిమానాలను నడిపారు. కీలకమైన సుఖోయ్–30 స్క్వాడ్రాన్‌కు కమాండింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ‘ఎ’ కేటగిరీ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా, టెస్ట్ పైలెట్‌గా అనుభవం గడించారు. గగన్‌యాన్‌లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. నాయర్ భార్య లీనా మలయాళ సినీపరిశ్రమలో నటిగా పేరొందారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. గత నెల 17వ తేదీన వీరి వివాహం జరిగింది. ‘ మా ఆయనకు తొలి ఇండియన్ ఆస్ట్రోనాట్ వింగ్స్ దక్కడం కేరళ రాష్ట్రానికే గర్వకారణం’ అని ఆమె ఆనందం వ్యక్తంచేశారు. వీళ్ల కుటుంబం కేరళలోని పాలక్కడ్ జిల్లా నెన్‌మరలో నివసిస్తోంది. నాయర్‌ను ఆస్ట్రోనాట్‌గా ప్రధాని ప్రకటించగానే నెన్‌మరలో పండగ వాతావరణం నెలకొంది. అజిత్ కృష్ణన్ అజిత్ కృష్ణన్ 1982లో చెన్నైలో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏలో శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకుని స్వోర్డ్ ఆఫ్ ఆనర్ పొందారు. రాష్ట్రపతి బంగారు పతకాన్ని సాధించారు. ఈయన తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డీఎస్‌ఎస్‌సీలోనూ చదువుకున్నారు. 2003 జూన్‌లో భారత వాయుసేనలో పైలెట్‌గా చేరారు. ఫ్లయింగ్ ఇన్‌స్టక్టర్‌గా, టెస్ట్ పైలెట్‌గా ఉంటూ 2,900 గంటలపాటు యుద్ధ విమానాలను నడిపారు. సుఖోయ్, మిగ్, జాగ్వర్, డోర్నియర్, ఏఎన్–32 రకం విమానాలను నడిపారు. ఈ మిషన్‌లో అవసరం మేరకు గ్రూప్ కెప్టెన్ గా ఉంటారు. అంగద్ ప్రతాప్ అంగద్ ప్రతాప్ 1982లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏ పూర్వ విద్యార్ధే. 2004 డిసెంబర్లో భారత వాయుసేన దళాల్లో చేరారు. టెస్ట్ పైలెట్‌గా, ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా సేవలందించారు. దాదాపు 2,000 గంటలపాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. సుఖోయ్ 30 ఎంకేఐ, మిగ్–21, మిగ్–29, హాక్, డోర్నియర్, ఏఎన్–32సహా ఎన్నో రకాల విమానాలను సమర్థవంతంగా నడిపారు. గగన్‌యాన్ మిషన్‌లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. శుభాన్షు శుక్లా వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 1985లో జన్మించారు. ఎన్డీఏలో శిక్షణ పూర్తిచేసుకుని 2006 జూన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలెట్‌గా చేరారు. ఫైటర్ కంబాట్ లీడర్‌గా, టెస్ట్ పైలెట్‌గా 2,000 గంటలపాటు యుద్ధవిమనాలు నడిపారు. భారత వాయుసేనలోని దాదాపు అన్నిరకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన నైపుణ్యం సాధించారు. ఈ నలుగురికి రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ సంస్థలో సమగ్రమైన శిక్షణ ఇచ్చారు. గగన్‌యాన్‌లో ఈయన వింగ్ కమాండర్‌గా వ్యవహరిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రతాప్ సింగ్‌కు పసిడి పతకం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌ను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. పోటీల చివరిరోజు బుధవారం భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ వ్యక్తిగత విభాగంలో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ పసిడి పతకం గెలిచాడు. ఫైనల్లో ప్రతాప్ సింగ్ 463.5 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఐశ్వరీ ప్రతాప్ సింగ్, అఖిల్ షెరాన్, స్వప్నిల్ కుసాలేలతో కూడిన భారత బృందం ఇదే విభాగంలో టీమ్ ఈవెంట్లో 1764 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో ప్రదీప్ సింగ్ షెఖావత్ 582 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత బృందం 8 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 22 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. -
ఆపరేషన్ ముగిసింది
ఆపరేషన్ వాలెంటైన్ ముగిసింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ద్విభాషా (తెలుగు–హిందీ) చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటించారు వరుణ్ తేజ్. ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న హీరోయిన్ మానుషీ చిల్లర్ రేడార్ ఆఫీసర్‌గా నటించగా, నవదీప్ ఓ కీలక పాత్ర చేశారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘‘వైమానిక దాడుల్లో మన దేశ వైమానిక దళం హీరోలు, వారు ఎదుర్కొన్న సవాళ్లను చూపించే ప్రయత్నంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమా పోస్ట్‌ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ప్రోడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్‌పై సందీప్ ముద్దా నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 8న రిలీజ్ కానుంది. -
కుమారులే.. కాడ్డెదులుగా..
మహబూబ్‌నగర్: పుడమితల్లిని నమ్ముకున్న ఓ రైతు చివరికి కన్న కొడుకులను కాడెద్దులుగా మార్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని గోకులపాడుకు చెందిన అయ్యన్న ఉల్లిపంట సాగుచేశాడు. ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు కలుపు ఏపుగా పెరిగింది. దీంతో కలుపుతీతకు ఇటు కూలీలు దొరకక.. అటు కాడెద్దులు లేకపోవడంతో తన ఇద్దరు కుమారులు యశ్వంత్, రుద్రప్రతాప్‌లను కాడెద్దుల మాదిరిగా గుంటుక కట్టి కలుపు తీశారు. ఆదివారం చంద్రశేఖర్‌నగర్ శివారులో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. – మానవపాడు -
వరద నీటిలో తండ్రీకూతుళ్లు గల్లంతు
సాక్షి, చిత్తూరు : వరద నీటిలో తండ్రీకూతుళ్లు గల్లంతు అయిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పెనుమురులో వరద నీటిలో గల్లంతు అయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కొండయ్య వాగులో గల్లంతు అయిన ప్రతాప్ అతని కుమార్తె సాయి వీణ ఆచూకీ 11 గంటలు గడుస్తున్నా లభించక పోవడంతో బంధువులు కుటుంబీకుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నిన్న పెనుమురు మండలం వడ్డేర్ల పల్లి కి చెందిన ప్రతాప్ తన భార్య శ్యామల, కుమార్తె సాయి వీణ మరో ముగ్గురితో కలసి ఓ వివాహ కార్యక్రమానికి కారులో వెళ్లారు. తిరిగి రాత్రి 12 గంటల ప్రాంతంలో వెనుతిరిగారు. అప్పటికే కొండయ్య వాగు విపరీతంగా ప్రవహిస్తోంది. అయినా వాగు దాటే ప్రయత్నం చేసి మధ్యలో చిక్కుకుపోయారు. మొదట సాయి వీణ వరద నీటిలోకి జారుకొంది. దీంతో ప్రతాప్ కుమార్తెను కాపాడే ప్రయత్నం చేస్తూ అతను గల్లంతు అయ్యాడు. కారులోని ప్రతాప్ భార్య శ్యామల, డ్రైవర్ తోపాటు మరొకరు బయటపడ్డారు. గల్లంతు అయిన వారికోసం ఉదయం నుంచి పెద్ద ఎత్తున గాలింపు జరుగుతోంది. చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు దగ్గరుండి గాలింపు చర్యలను పర్య వేక్షిస్తున్నారు. స్వయంగా బోటులో చేరువులోకి వెళ్లి పరిశీలించారు. కాగా ఇప్పుడే సాయి వీణ మృత దేహం లభించింది. ప్రతాప్ కోసం గాలింపు కొనసాగుతోంది. -
కత్తిలా బతికి వెళ్లిపోయారు...
ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు తెలుగు సినిమాకు రెండు కళ్లు. కాని కాంతారావు ఆ మెడలో మెరిసే చంద్రహారం. కత్తి వీరుడు కాంతారావుగా జానపద చిత్రాలు చేసి సగటు ప్రేక్షకుడికి ఆయన చేరువయ్యారు. సాంఘిక చిత్రాలలో బలమైన పాత్రలు చేసి పెద్ద హీరోలను ఢీకొట్టారు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా ఇంటిని, ఇల్లాలి చేతి వంటని, పిల్లల బాల్యాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఆయన కనుమరుగై దాదాపు దశాబ్దం పైగానే గడిచింది. అయితేనేం చెన్నైలో ఉండే పెద్ద కుమారుడు ప్రతాప్, హైదరాబాద్ లో ఉండే నాలుగో కుమారుడు రాజా తండ్రి జ్ఞాపకాల పరిమళాలను ఎంతో సంతోషంగా సాక్షితో పంచుకున్నారు. రాజా: నాన్నగారికి మేం నలుగురు మగ పిల్లలం, ఒక ఆడపిల్ల. ప్రతాప్ పెద్దన్నయ్య, రెండో అన్నయ్య కేశవరావు, ఆ తరవాత అక్క సుశీల, నేను, నా తరవాత తమ్ముడు సత్యం. నాకు నాలుVó ళ్లు వచ్చేవరకు మాటలు రాలేదు. కుర్తాళంలో ఉన్న జలపాతం నీటికి ఔషధ గుణాలు, మహిమలు ఉన్నాయని తెలిసినవారు చెప్పటంతో నన్ను అక్కడకు తీసుకువెళ్లారు. జలపాతం నీళ్లు నా మీద పడేలా తన భుజాల మీద ఎక్కించుకున్నారు. నీటి మహిమో, యాదృచ్ఛి కమో గానీ, వారు చెప్పినట్టుగానే నాకు మాటలు రావడంతో నాన్నగారి ఆనందానికి అవధులు లేవు. ఆ సంఘటన తరచుగా చెబుతుండేవారు. నాకు చిన్నప్పటి నుంచి ఆయనతో అనుబంధం పెనవేసుకుంది. ఆయనతో మాకు ఎన్నో తీపి అనుభవాలు ఉన్నాయి. పుట్టినరోజులు బాగా జరిపేవారు. పార్టీలకు, ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లటంలాంటి అలవాట్లు ఆయనకు లేవు. అవకాశం వచ్చినప్పుడల్లా మాతో క్యారమ్స్, షటిల్ ఆడేవారు. వినాయకచవితికి మాతో పూజ చేయించేవారు. నాన్న ఊరు వెళ్తుంటే ఏడ్చేవాళ్లం. అప్పుడప్పుడు ఔట్‌డోర్ షూటింగ్‌కి తీసుకువెళ్లేవారు. మేం షూటింగ్ చూసిన మొట్టమొదటి సినిమా సతీ సులోచన. కోదాడ వెళ్లినప్పుడు అక్కడి పొలాలకు తీసుకువెళ్లేవారు. అక్కడ మమ్మల్ని చూసి ‘కాంతారావుగారి అబ్బాయి’ అని అందరూ అంటుంటే మాకు భలే సరదాగా ఉండేది. నాన్నగారు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేశాక ఆయన బ్యాంకు పనులు చూడటం అలవాటు చేసుకున్నాను. హైదరాబాద్ వచ్చాక ఒకసారి నన్ను షూటింగ్‌కి తీసుకువెళ్లారు. వాళ్లు నన్ను ప్రొడక్షన్ బాయ్ అనుకుని, నేను అన్నం దగ్గర కూర్చున్న చోట నుంచి లేపి, మరోచోట కూర్చోమన్నారు. నాన్నగారు కోపంగా, ‘నాకు కూడా అక్కడే అన్నం పెట్టండి’ అన్నారు. ఏం జరుగుతోందో వాళ్లకు అర్థం కాలేదు. ‘వాడు మా అబ్బాయి, మీ పని నాకు అవమానంగా ఉంది’ అన్నారు. మద్రాసులో వారికి నేనెవరో తెలుసు. కాని హైదరాబాద్‌లో ఎవ్వరికీ తెలియకపోవటం వల్ల ఈ సంఘటన జరిగింది. మేం పెద్దగా చదువుకోకపోయినా, నాన్న ప్రేమను పరిపూర్ణంగా అందుకున్నాం. ‘సుడిగుండాలు’ చిత్రానికిగాను 1968లో అవార్డు అందుకున్నాను. అవార్డు వచ్చినందుకు సంతోషపడ్డారు కానీ, అటువంటి పాత్రలు ఎన్నడూ వేయద్దు, నా కొడుకు నా కళ్ల ముందరే ఉండాలి’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఆ చిత్రంలో నేను వేసిన పాత్రలో చనిపోతాను. సినిమా రంగానికి దూరంగా ఉండమని చెప్పేవారు. హేమ ఫిలిమ్స్ పేరున మేం తీసిన ‘సప్తస్వరాలు’ చిత్రం ఫ్లాప్ కావటంతో, నాన్నగారికి గుండెపోటు వచ్చింది. ‘మీ ప్రేమే నన్ను కాపాడుతుంది. అమ్మని బాగా చూసుకో రాజా’ అన్నారు. 1971 దాకా హీరోగా చేశారు. ‘గుండెలు తీసిన మొనగాడు’ నాన్న హీరోగా చేసిన ఆఖరి సినిమా. ‘నేరము – శిక్ష’ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. నవంబరు 16వ తేదీన నాన్నగారి పుట్టినరోజు. ఆ రోజు నాన్నగారు ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటికే నాన్న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతు న్నారు. అక్కడ కొద్దిసేపు ఉండి, ఇంటికి బయలుదేరుతూ, అందరి ఎదుట, ‘నాన్నా రాజా! ఇంక నాకు ఈ కర్ర అవసరం లేదు. నువ్వే నా కుడిభుజం. అమ్మని జాగ్రత్తగా చూసుకో’ అని చెప్పారు. చివరికి అదే నిజం చేస్తూ ఏడాదికల్లా నాన్న కన్ను మూశారు. ప్రతాప్: నాన్నగారి స్వస్థలం తెలంగాణలోని కోదాడ. రజాకార్ మూవ్మెంట్ టైమ్‌లో అక్కడనుంచి చెన్నై మకాం మార్చేశారు. నాన్నగారిది ప్రేమ వివాహం. అమ్మది జగ్గయ్యపేట. అమ్మ మీద నాన్నకు విపరీతమైన అభిమానం. అమ్మ చేతి కాఫీతోనే నాన్న నిద్ర నుంచి లేచేవారు. ఇంటి వ్యవహారమంతా అమ్మే చూసుకునేది. అమ్మ సింపుల్‌గా ఉండటమే కాదు, మమ్మల్ని కూడా అలాగే పెంచింది. ఇంట్లో రెండు కార్లు ఉన్నా రిక్షాలోనే వెళ్లేది. మేం కూడా సైకిల్ లేదా బస్సుల్లో ప్రయాణించేవాళ్లం. నాన్న చాలా బిజీగా ఉండేవారు. ఒకసారి షూటింగ్‌కి వెళ్లిపోతే వారం పదిరోజుల దాకా ఆయనను చూడటానికి కుదిరేది కాదు. ప్రతి రోజూ మూడు షిఫ్టులు పనిచేసేవారు. సంవత్సరానికి పన్నెండు సినిమాలు చేయాలనుకునేవారు. 1960 – 1971 మధ్యకాలంలో ఆయన ఎంత బిజీగా ఉన్నారంటే ఆయన కాల్షీట్లు చూడటానికి ఇద్దరు సెక్రటరీలను పెట్టుకునేంత! రోజుకి మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవారు. మా చిన్నతనంలో తిరుపతి వెళ్లినప్పుడు నాకు గుండు కొట్టించారు. నేను కుదురుగా ఉండకపోవటంతో కొలనులోకి దొర్లిపోయాను. నాన్నగారు వెంటనే చూడటంతో బతికి బయటపడ్డాను. మద్రాసులో సినిమా వాళ్ల పిల్లలంతా కేసరయ్య స్కూల్లోనే చదివేవారు. మేం కూడా అక్కడే చదువుకున్నాం. ఆ తరవాత రామకృష్ణ మిషన్‌లో చదివాం. కాలేజీలో నా అంతట నేనే చేరాను. తమ్ముళ్లని మాత్రం నాన్న చేర్పించారు. 1957లో అనుకుంటాను. పెళ్లికి వెళ్లి, తిరుపతి నుంచి తిరిగి వస్తున్నాం. అప్పుడు నాకు ఏడేళ్లు. ముందు సీట్లో నాన్న ఒళ్లో పడుకున్నాను. ఆయన నా మెడ మీద చేయి వేసి పడుకోబెట్టుకున్నారు. బాగా వాన పడుతుండటంతో రాణీ పేట దగ్గర కారు చక్రం స్కిడ్ కావటంతో యాక్సిడెంట్ అయ్యింది. కుడివైపు చెట్టుకి కొట్టుకుని వెనక్కి వచ్చి మళ్లీ కొట్టుకుంది. అద్దాల ముక్కలు తలలో పడ్డాయి. సరిగ్గా అప్పుడు నాన్న నన్ను కిందకి తోసేసి, తను కూడా దూకేశారు. డ్రైవర్ జంప్ చేశాడు. చెట్టు కొట్టుకోవటం వల్ల, ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాం. కారు నుజ్జునుజ్జు అయిపోయింది. కారు కండిషన్ చూసినవారంతా మేం ఎలా బతికి బయటపడ్డామా అనుకున్నారు. ఆ ఏడుకొండల వాడి దయ వల్ల బతికాం అని నాన్న చెప్పేవారు. 1968లో సప్తస్వరాలు సినిమా స్వయంగా నిర్మించి అందులో నటించారు. ఆ సినిమాకి కావలసిన వస్తువులు కొంటూ నాకు 150 రూపాయలు పెట్టి సీకో వాచీ కొన్నారు. ఆ వాచీ చాలా సంవత్సరాలు వాడాను, అది పాడైపోయాక మళ్లీ చాలాకాలం వాచీ కొనుక్కోలేదు. 1974లో సింగపూరు వెళ్లినప్పుడు వాచీ కొని తెచ్చుకున్నాను. గడియారం కాలాన్ని ఎంత ముందుకు తోస్తున్నా మేము మాత్రం ఎప్పుడూ నాన్న జ్ఞాపకాల్లోనే ఉంటాం. – సంభాషణ: వైజయంతి పురాణపండ అప్పటి నుంచి మాతోనే... నేను మొదటి నుంచి నాన్నగారి ప్రొడక్షన్స్ చూసుకునేవాడిని. ఎక్కడా ఉద్యోగం చేయలేదు. చెన్నైలో ఉన్నన్ని రోజులు నాన్నగారు మా దగ్గరే ఉండేవారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేవారు. నాకు ముగ్గురు అబ్బాయిలు. సాయికిరణ్, కార్తిక్, గుణరంజన్. ముగ్గురూ ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నా భార్య లక్ష్మి. మా అత్తవారు మేము ఇరుగుపొరుగు వారం. నాన్నగారితో వియ్యమందుకున్నాక, మా మావగారు పి. చంద్రశేఖర్ మా ప్రొడక్షన్లో భాగస్వాములయ్యారు. – ప్రతాప్ నా దగ్గరే... నేను ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. అమ్మ హైమవతి నా దగ్గరే ఉంది. నా భార్య ఉషశ్రీ. వాళ్లది తణుకు. మా అబ్బాయి సాయి ఈశ్వర్ బిటెక్ చదువుతున్నాడు. అమ్మాయి ప్రియాంకకు వివాహం అయ్యింది. అల్లుడు మెరైన్‌లో పనిచేస్తున్నాడు. – రాజా -
మాదిరెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) వైస్ చైర్మన్ మాదిరెడ్డి ప్రతాప్‌నకు తృటిలో ప్రమాదం తప్పింది. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం నగరం నుంచి అచ్యుతపురం వరకు ఆయన సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో ర్యాలీ కొనసాగుతుండగా.. వడ్లపూడి వంతెనపై ప్రతాప్ సైకిల్‌ను ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన చేతికి బలమైన గాయమైంది. దీంతో పోలీసులు ఆయనను గాజువాక లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం వైద్యులు విమ్స్‌కు తీసుకువెళ్లాల్సిందిగా సూచించారు. -
డోన్ రాజు ఎవరో?
మహాభారతంలో పాండవుల గురువైన ద్రోణాచార్యుడుఈ ప్రాంతంలోని ఒక కొండపై తపస్సు చేయడంతో ద్రోణాచలమనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధి. కాలక్రమంలో ఆ పేరు కాస్తా డోన్‌గా స్థిరపడింది. కర్నూలు జిల్లాలోని అతిపెద్ద మున్సిపాలిటీల్లో ఒకటైన డోన్ జిల్లాలో పేరొందిన రైల్వే జంక్షన్. రాజకీయంగాను, చారిత్రకంగాను ఎంతో ప్రాధాన్యమున్న నియోజకవర్గంలో ఈ ఐదేళ్లూ అరాచకాలు, భూ ఆక్రమణలతో అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారు. స్వయానా డిప్యూటీ సీఎం సోదరుడే ఈ దందాలకు లీడరు. అత్యంత నాణ్యమైన సున్నపురాయికి, మైనింగ్ పరిశ్రమలకు డోన్ పెట్టింది పేరు. ఆ పరిశ్రమలు కాస్తా చంద్రబాబు సర్కారు కరెంటు షాక్‌తో కుదేలయ్యాయి. వరుసగా నాలుగేళ్లు పెరిగిన విద్యుత్ చార్జీల దెబ్బతో పాటు రాయల్టీ పెంపు తదితర కారణాలతో 1500 గ్రానైట్ పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వైఎస్సార్సీపీ నుంచి బుగ్గన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై 11,152 ఓట్ల మెజార్టీతో బుగ్గన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచాక తన సొంత నిధులతో బేతంచర్లలో షాదీఖానా, డోన్ హైస్కూల్లో అదనపు తరగతులు నిర్మించారు. ప్యాపిలిలో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు పనుల్ని ప్రారంభించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ హోదాలో రాష్ట్రంలో వివిధ నౌకాశ్రయాల్లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై అధికారులను నిలదీశారు. వివిధ పథకాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ఎండగట్టారు. సౌమ్యుడిగా పేరొందడంతో పాటు సమస్యలపై అవగాహన ఉన్న మేథావిగా బుగ్గనకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. నియోజకవర్గంలో అధికార పార్టీ అక్రమాల్ని ఎదిరిస్తూ.. ప్రజా సమస్యలపై నిలదీస్తూ ముందుకు సాగుతున్నారు. టీడీపీ నుంచి మళ్లీ కేఈ ప్రతాపే! తెలుగుదేశం పార్టీ నుంచి మరోసారి కేఈ ప్రతాప్ పోటీలో ఉన్నారు. వాస్తవానికి కోట్ల కుటుంబం టీడీపీలో చేరాక డోన్ టికెట్ ఇవ్వాలని కేఈ సుజాతమ్మ పట్టుబట్టారు. అయితే ప్రతాప్‌కే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. డిప్యూటీ సీఎం సోదరుడి హోదాలో రెవెన్యూ విభాగంలో ఖాళీగా ఉన్న అనేక స్థలాల్ని ఆక్రమించారనే పేరుంది. అధికారుల్ని బెదిరించి ప్రోటోకాల్ పాటించేలా చేసుకున్నారన్న తీవ్ర విమర్శలున్నాయి. డోన్ నియోజకవర్గంలో జరిగిన మరుగుదొడ్ల కుంభకోణంలో ఒక ఎంపీడీవో సస్పెండయ్యారు. ఒక్క మరుగుదొడ్డి కూడా నిర్మించకుండానే రూ.కోట్ల నిధుల్ని అధికారపార్టీ నేతలు కాజేశారు. జాగా కనిపిస్తే కబ్జా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్.. ఖాళీ స్థలం కనబడితే చాలు ఆక్రమణలకు తెరదీశారు. డోన్ పట్టణ నడిబొడ్డున ఉన్న వక్ఫ్‌భూమిని ఆక్రమించారు. ఏకంగా గ్రామాల్లో పొలాలకు సాగునీరందించే వాగు స్థలం కబ్జాకు ప్రయత్నించారు. మున్సిపాలిటీలో ఇతరులు టెండర్లో పాల్గొంటే ఏకంగా భౌతిక దాడులకు దిగారు. విద్యుత్, రాయల్టీ చార్జీలు తగ్గిస్తామని జగన్ హామీ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గ్రానైట్ పరిశ్రమలకు కరెంటు చార్జీల్ని యూనిట్‌కు రూపాయి మేర తగ్గించగా.. చంద్రబాబు సీఎం అయ్యాక అమాంతం పెంచేశారు. 2014 వరకూ టన్నుకు రూ.280 ఉన్న రాయల్టీ చంద్రబాబు హయాం లో బ్లాక్ గ్రానైట్‌పై రూ.600, కలర్ గ్రానైట్‌పై రూ.560కు పెంచారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ఎఫెక్ట్‌తో బ్లాక్ గ్రానైట్‌పై రాయల్టీని టన్నుకు రూ.300కు తగ్గించారు. గ్రానైట్ పరిశ్రమకు విద్యుత్, రాయల్టీ చార్జీలు తగ్గించడంతో పాటు డోన్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. డోన్ పట్టణంతో పాటు మరికొన్ని గ్రామాలకు గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి మంచినీటి సరఫరా పథకాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కేవలం ప్రారంభోత్సవంతో సరిపెట్టింది. ప్రధాన సమస్యలు : నియోజకవర్గపు పరిధిలో ఖనిజ సంపద అపారంగా ఉంది. సున్నపురాయి, గ్రానైట్, మొజాయిక్ చిప్స్, కలర్ స్టోన్స్ ఆధారిత పరిశ్రమలున్నాయి. ఇక్కడ లభించే ఖనిజానికి సరైన మార్కెట్ లేకపోవడం, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమలకు విద్యుత్ చార్జీలు పెంచడం, రాయల్టీ చార్జీలు పెరగడం, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం లేకపోవడంతో అనేక చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. 45 వేల మంది ఉపాధి కోల్పోయారు. గత ఎన్నికల సమయంలో పరిశ్రమల్ని ఆదుకునేందుకు డెహ్రడూన్ తరహాలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని చంద్రబాబు విస్మరించారు. డోన్ నియోజకవర్గంలోని చెరువులు నీరు లేక నోరెళ్లబెట్టాయి. చెరువులకు హంద్రీ–నీవా ద్వారా నీటిని తరలించాలి. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రసుత్తం డోన్‌లో ఉన్న 30 పడకలున్న ప్రభుత్వ ఆస్పత్రి స్థాయిని 100 పడకలకు పెంచాలి. బాలికలు ఉన్నత చదువులు చదివేందుకు మహిళా, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు అవసరం. ప్యాపిలిలో 10 పడకల ఆస్పత్రిని 30 పడకలకు పెంచాలి. బేతంచర్లకు అవుకు రిజర్వాయర్ నుంచి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీనీ చంద్రబాబు విస్మరించారు. – కె.జి. రాఘవేంద్రరెడ్డి, సాక్షి ప్రతినిధి, కర్నూలు -
ఎమ్మెల్యేను తిరగనీయం అంటే సామాన్యుల సంగతేంటి?
సాక్షి, కర్నూలు : ఓ ఎమ్మెల్యేను డోన్ పట్టణంలో తిరగనీయం అంటూ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేత కేఈ ప్రతాప్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేనే తిరగనీయం అంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని నిలదీశారు. జిల్లాలోని ప్యాపిలిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆదివారం ఆయన మాట్లాడారు. అర్హత కలిగిన ప్రజలకు లోన్లు, పింఛన్లు, ఇళ్ల కోసం ప్రభుత్వ సొమ్మును ఇవ్వడానికి కూడా తెలుగుదేశం నాయకులు కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా వారి సొంత సొమ్మును ప్రజలకు ఏమైనా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. డోన్‌లో తిరగనీయం అంటున్న కేఈ ప్రతాప్ 2009 నుంచి 2014 వరకూ ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా, అప్పుడు తుంగభద్రను దాటి ఇవతలకి ఎందుకు రాలేదని నిలదీశారు. అధికారం ఉందనే కండకావరంతో టీడీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. -
కారు బీభత్సం
►ఆగిఉన్న వారిపైకి దూసుకొచ్చిన వాహనం ►ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు మహేశ్వరం: రోడ్డుపై అగి ఉన్న వారిపైకి కారు దూసుకు రావడంతో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం శ్రీశైలం ప్రధాన రహదారిపైనున్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు పంచాయతీ రాచులూర్ గేటు వద్ద చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన కొందరు పార్చునర్ కారులో శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. కారు రాచులూరు గేటు వద్దకు రాగానే అక్కడ రోడ్డు పక్కన ఆగి ఉన్న కర్ణాటక రాష్ట్రం రాయిచూర్‌కు చెందిన ప్రతాప్‌పైకి దూసుకు వచ్చింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదానికి ముందు అదే కారు పక్కనే బైక్‌పై ఆగి ఉన్న యాచారం మండలం కుర్మిద్దకు చెందిన అనెమోని కృష్ణను ఢీకొట్టింది. దీంతో అతడికి గాయాలయ్యాయి. అనంతరం కారు పల్టీలు కొట్టడంతో కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన కృష్ణను బాలపూర్ చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఇద్దరు పరారయ్యారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పట్టుకొని స్థానికులు పోలీసులకు అప్పగించారు. దుర్మరణం చెందిన ప్రతాప్ మంఖాల్ పారిశ్రామికవాడలో పని చేయడానికి వారం రోజుల క్రితం రాయిచూర్ నుండి వచ్చాడు. గాయాలైన మరో వ్యక్తి తుమ్మలూరు గ్రామంలో ఉన్న అత్తగారింటికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని గుంటూరుకు చెందిన డ్రైవర్ రతన్‌బాబును అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రచయితల వేదిక అధ్యక్షుడిగా కత్తిమండ
సఖినేటిపల్లి : వర్థమాన రచయితల వేదిక తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా సఖినేటిపల్లికి చెందిన రచయిత కత్తిమండ ప్రతాప్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 మంది సభ్యులతో కమిటీ కూడా ఏర్పాటు అయినట్టు ఆయన తెలిపారు. ఆకు పచ్చ కవిత్వం పేరుతో పర్యావరణంపై అవగాహన కల్పించడం , వర్థమాన రచయితలకు వర్క్ షాప్‌లను నిర్వహించనున్నట్టు తెలిపారు. -
నాలాలో అర కిలోమీటర్ కొట్టుకుపోయి...
హైదరాబాద్: పొంగిపొర్లుతున్న ఓ నాలాలో ప్రమాదవశాత్తు పడిన ఓ వ్యక్తి అరకిలోమీటర్ కొట్టుకుపోగా స్థానికులు రక్షించారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రతాప్(45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయాడు. చుట్టుపక్కల వారు అతడిని గమనించి రక్షించేలోపల అరకిలోమీటర్ కొట్టుకుపోయాడు. అక్కడున్న వారంతా శ్రమించి అతడిని నీటి నుంచి బయటకు లాగారు. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. nallah, man fall, pratap, నాలా, ప్రతాప్, వ్యక్తికి గాయాలు -
నలుగురు నయీం అనుచరులు అరెస్ట్
గ్యాంగ్‌స్టర్ నయీం గ్యాంగ్‌కు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 40 ఎకరాల స్థలాన్ని కాజేయడానికి యత్నించిన నలుగురు ముఠాను మెదక్ జిల్లా పటాన్చెరు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరికి చెందిన 40 ఎకరాల భూమిని తమ పెరు పైకి మార్చాలని నయీం అనుచరులు ప్రతాప్, నరేందర్, మహేష్, అశోక్ ఉద్యోగ సంఘం నేత రవీందర్‌గౌడ్‌ను బెదిరించారు. దీంతో అతను పోలీసులను ఆశ్రయించగా.. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. -
వయసు 21.. ఏడాది వేతనం రూ. 2 కోట్లు
ఫేస్బుక్కులో ఉన్నత ఉద్యోగం మదనపల్లె కుర్రోడికి ఉన్నత ఉద్యోగం చిత్తూరు జిల్లా మదనపల్లె కుర్రోడికి బంపర్ ఆఫర్ వచ్చింది. 21 ఏళ్లకే సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్లో ఉద్యోగం కొట్టేశాడు మదనపల్లెకు చెందిన కే.వినిల్ ప్రతాప్. బోనస్ ఇతర అలవెన్సులతో కలిపి ఏడాదికి రూ.2 కోట్ల భారీ వేతనాన్ని కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం నియామకపత్రం వచ్చింది. తొలి నుంచి ప్రతిభావంతుడే.. వినిల్ ప్రతాప్ వయస్సు 21. తొలి నుంచి చదువులో ప్రతిభావంతుడు. నెల్లూరు నారాయణ కళాశాలలో ఇంటర్, ముంబైలోని ఐఐటీలో బీటెక్ చదివాడు. ఆలిండియా స్థాయిలో ఐఐటీ ఎంట్రన్స్ టెస్టులో 67వ ర్యాంకు సాధించాడు. ఎంసెట్‌లో 82వ ర్యాంకు, జాతీయ స్థాయిలో ఏఐ ఈఈఈ ఎంట్రన్స్ టెస్టులో 87వ ర్యాంకు సాధించి ప్రతిభచాటాడు. ఫేస్‌బుక్కుకు ఎంపికైంది ఇలా.. ప్రస్తుతం అతను కాలిఫోర్నియాలో ఫైనల్ ఇయర్ ఎంఎస్ చేస్తున్నాడు. అక్కడ జరిగిన ఫెస్బుక్ క్యాంపస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇతని స్కిల్స్ నచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఎంపికయ్యాడు. బోనస్, ఇతర అలవెన్సులతో కలిపి ఏడాదికి రూ.2 కోట్ల (మూడు లక్షల 30 వేల డాలర్లు) వేతనంతో కూడిన ప్యాకేజీని ప్రకటించారు. ప్లానింగ్‌తో సాధ్యం.. ఉన్నత ఉద్యోగాలు ఒక్కసారిగా రావు. ముందు నుంచి ప్లాన్‌గా సిద్ధపడాలి. కంపెనీల అవసరాలు, ఆలోచనా విధానం గమనించాలి. ఆపై విషయంపై పట్టు ఉండాలి. అప్పుడే మంచి ప్యాకేజీ గల ఉద్యోగాలు సాధ్యం. తన తండ్రి కే.శ్రీనివాసరెడ్డి ప్రోత్సాహంతోనే తాను ఇంతటి స్థాయికి చేరుకున్నానని వినిల్ ప్రతాప్ తెలిపారు. ఎస్‌వీటీఎం, విశ్వంలో సంబరాలు మదనపల్లె సమీపంలోని అంగళ్లు మార్గంలో గల ఎస్‌వీటీఎం ఇంజనీరింగ్ కళాశాల, విశ్వం విద్యా సంస్థల్లో శనివారం సాయంత్రం కోలాహలం నెలకొంది. ఫేస్బుక్ కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగానికి ఎంపికైన వినిల్ ప్రతాప్ తండ్రి కె.శ్రీనివాసరెడ్డి ఈ విద్యా సంస్థలకు ైడె రెక్టరుగా ఉన్నారు. ఇక్కడ సహ అధ్యాపకులతో పాటు కరస్పాండెం ట్ విశ్వం ప్రభాకర్‌రెడ్డి, ఎం.అమరావతమ్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్, వైస్ ప్రిన్సిపాల్ వెంకట్రమణారెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రఘునాథరెడ్డి, ఏవో శ్రీనివాసులరెడ్డి, క్యాంపస్ మేనేజర్ ముట్ర దామోదర్‌రెడ్డి ఆయన్ను అభినందించారు. విద్యార్థులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. సంతోషంగా ఉంది ఫేస్బుక్లో మంచి వేతనంతో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. మా స్వస్థలం నెల్లూరు. తండ్రి ఉద్యోగరీత్యా కొన్నేళ్లుగా మదనపల్లెలో స్థిరపడ్డాం. ఇంతకు ముందు కూడా ఇ-బే, గూగుల్‌లో కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యా. అయితే ఫేస్బుక్ పనితనం నాకు నచ్చింది. వారికి నా పనితీరు నచ్చింది. అన్నీ కలిపి ఏడాదికి రూ.2 కోట్లు ప్యాకేజీ ఇస్తున్నామని జాయినింగ్ లెటర్ ఇచ్చారు. ఏప్రిల్‌లో యూఎస్‌లో డ్యూటీలో జాయిన్ అవుతా. -కే.వినిల్ ప్రతాప్, మదనపల్లె -
ఇసుక లారీల సీజ్ : రూ. 8లక్షల జరిమానా
పటాన్చెరు రూరల్ : మండల పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 21 లారీలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు. వాటికి రూ.8 లక్షల జరిమానాను విధించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ నిజామాబాద్ మెదక్ రేంజ్ డీఎస్పీ ప్రతాప్ మాట్లాడుతూ అక్ర మంగా ఇసుకను తయారు చేసి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించామన్నారు. దీంతో 19 ఇసుక లారీలను సీజ్ చేశామన్నారు. రెండు ధాన్యం లారీలను కూడా సీజ్ చేసి అన్ని లారీలకు రూ.8 లక్షల జరిమానా విధించామని తెలిపారు. అక్రమంగా ఏ వ్యాపారం చేసిన అలాంటి వాటిపై దాడులు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక లారీలు తిరిగి అక్రమంగా రవాణా చేస్తే జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ వాహనాల తనిఖీలో సీఐలు జాన్ విక్టర్, శ్రీనివాస్‌రావు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు రఘునాథ్‌బాబు, సంతోష్‌కుమార్, వ్యవసాయశాఖ అధికారి విద్యాకర్‌రెడ్డి, అసిస్టెంట్ రిజిస్టార్ రమేష్‌కుమార్, అటవీశాఖ అధికారి రాఘవేందర్ రావు, విజిలెన్స్ ఎస్ఐ సదాత్‌మియ్యా, సిబ్బంది పాల్గొన్నారు. -
తొలి సాంఘిక తెలుగు కావ్యం బసవ పురాణం
పూర్వ సాహిత్యం తెలుగువారి సాంస్కృతిక చరిత్రలో పాల్కురికి సోమనాథుడు సాధించ ప్రయత్నించిన సంస్కరణ చాలా ప్రభావపూరితమైనది. శక్తిమంతమైనది. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించిన ప్రథమాంధ్ర వీరశైవ కవిగా మాత్రమే కాక సామాజిక స్పృహతో సాహిత్యాన్ని సృష్టించిన భక్తి ఉద్యమకవిగా తెలంగాణ కవిగా కూడా అతడి స్థానం విశిష్టమైనది. పాల్కురికి (1160-1240) ‘శివకవి త్రయం’ అనబడే ముగ్గురు కవుల్లో మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడుల కంటే కూడా ప్రధానమైనవాడు. వీరశైవాన్ని ప్రచారం చేసిన కవుల్లో ప్రథముడు. పాల్కురికి కాలానికి సాంస్కృతికంగా బౌద్ధం, జైనం బలహీన స్థితిలో ఉన్నాయి. జైనులు, బౌద్ధులు రంగం నుంచి తప్పుకున్న తర్వాత బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదిరించే కర్తవ్యాన్ని అందుకొని వీరశైవం ముందుకు వచ్చింది. ఇందుకు కర్నాటకలో కూడలి సంగమ క్షేత్రాన్ని స్థావరంగా చేసుకొని వీరశైవాన్ని ప్రచారం చేసిన బసవేశ్వరుడు (1134-1196) మూలపురుషుడిగా నిలిచాడు. బ్రాహ్మణుల ఇంట జన్మించిన బసవేశ్వరుడు బాల్యంలోనే వైదిక క్రతువులను, పుట్టుక ఆధారంగా మనుషులకు సిద్ధం చేసి పెట్టిన వివక్షను ఏవగించుకున్నాడు. ‘మనుషులంతా ఒక్కటే. కులాలు ఉపకులాలు లేవు’ అని ఆయన చేసిన తిరుగుబాటు ప్రజల గుండెలను తాకి ప్రతిధ్వనించడమే కాక తెలుగు నేలకి కూడా చేరి వరంగల్లు ప్రాంతంలో ఉన్న పాల్కురికి సోమనాథుడిని ప్రభావితం చేసింది. ఆయన బసవేశ్వరుడ్ని రెండవ శంకరుడన్నాడు. ఆ ఆరాధనతో బసవన్న కథను బసవపురాణం పేరుతో తెలుగులో మొట్టమొదటి దేశిపురాణంగా లిఖించాడు. బసవపురాణం- పురాణం మాత్రమేకాక ఏడు అశ్వాసాల స్వతంత్ర చారిత్రక కావ్యం కూడా. భక్తిరసం, వీరరసం ఇందులో ప్రధానమైనవి. బసవని అవతరణం, సంస్కారోత్సవాలు, ప్రబోధాలు, లింగైక్యం అనే ముఖ్య అశ్వాసాల్లో మనం తెలుసుకోవాల్సిన చరిత్ర కనిపిస్తుంది. నడుమ భక్తజన కథలు ఉంటాయి. పాల్కురికి వర్ణించిన భక్తుల్లో శిశుభక్తులు, స్త్రీ భక్తులు, ముగ్ధభక్తులు, మొండి భక్తులు, ప్రౌఢభక్తులు ఉన్నారు. వీరిలో వివిధ వర్ణాలకు చెందిన వారు ఉన్నారు. బసవనికి సమకాలికులైన అల్లమ ప్రభు, మడివాలు మాచయ్య, సిద్ధరామయ్య వంటి అనేకులున్నారు. రుద్ర పశుపతి, గొడగూచి, బెజ్జ మహాదేవి వంటి ముగ్ధభక్తులు ఉన్నారు. వీరశైవం ప్రబోధించి ఆచరించిన స్త్రీ పురుష సమానత్వాన్ని, కులరాహిత్యాన్ని పాల్కురికి తన రచనలో తీక్షణంగా చిత్రిక పట్టి ఆ దిశలో సంస్కరణ కోసం గట్టిగా కృషి చేశాడు. పాల్కురికి సామాజిక దృక్పథంలో ద్యోతకమయ్యే సంఘ సంస్కరణాభిలాష బసవేశ్వరుడు చెప్పిందే. బసవేశ్వరుడు ప్రతిపాదించిన విధుల్లో ముఖ్యమైనవి- వర్ణాశ్రమ ధర్మాల మీద తిరుగుబాటు; జంగమాపూజకు ప్రాధాన్యం; స్త్రీలకి పురుషులతో సమానంగా మోక్షసాధన మార్గాన్ని ఎన్నుకొనే స్వేచ్ఛ; స్థావర మూర్తుల పూజపట్ల వైముఖ్యం... జంగమ పూజకు ప్రాధాన్యం; పుట్టుక కారణంగా సంక్రమించిన అస్పృశ్యతని ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించడం; సమానత్వాన్ని పాటించడం; పంచవిధ సూతకాలలో నాలుగింటిని కూడా తిరస్కరించడం (ఇవి పురుడు, ఉచ్చిష్టం, బహిష్టూ, చావు సందర్భాలలో పాటించే అశౌచాలు); ఉపనయన సంస్కారాన్ని తిరస్కరించడం; మరణించినవారికి చేసే శ్రాద్ధ కర్మల నిరసన; మద్యమాంసాల విసర్జన.... పాల్కురికి తన కావ్యంలో ఈ విధివిధానాలకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు. ఉదాహరణకి సిరియాళుడి కథలో శివుడు హలాయుధునితో సంవాదం చేస్తూ సుతుని చంపి ఆ మాంసంతో విందు చేశానని అంటే హలాయుధుడు వెటకారంగా- ‘శివ! శివ! యిది యేమి చెప్పెదవయ్య శివుడేమి నరుల భక్షింప రక్కసుడె? శిశువు సద్భక్తుని సిరియాళునంబి పశువరింపగ జంపభక్తి హీనుండె?!’ ఇది మాంసాహార విసర్జన అనే నిబంధనని గాఢంగా ప్రజల్లో నాటడానికి చెప్పిన విషయమని అర్థమవుతూనే ఉంది. బసవేశ్వరుడి ప్రబోధాలకు అనుగుణంగా ‘ఎట్టి దుర్గతిని బుట్టిననేమి యెట్లును శివభక్తుడిల పవిత్రుండు’ అన్నాడు. మత ప్రచారానికి సంస్కృత భాష వాడాలనే ఆచారాన్ని సోమనాథుడు బద్దలు కొట్టాడు. నన్నయ భారతాంధ్రీకరణలో అధిక శాతం సంస్కృత పదాలు కనిపిస్తే అందుకు పూర్తి విరుద్ధంగా పాల్కురికి బసవపురాణంలో దేశీ ఛందస్సు, నానుడులు, జాతీయాలు, పలుకుబళ్లు ప్రాధాన్యం వహిస్తాయి. ద్విపద, రగడలే కాకుండా సోమనాథుడు ఇంకా సీసం, త్రిభంగి, తరువోజ, క్రౌంచ పదం, మయూరం, చతుర్విధ కందం, తిపాస కందం వంటి స్థానిక ఛందోరీతుల ప్రయోగం చేశాడు. ‘రగడ’ అనే ఛందోరీతిని సోమనాథుడే ప్రారంభించాడు. సీస పద్యాల్లో సోమన ప్రయోగం చేశాడు. శ్రీనాథుడికి సీస పద్య రచనలో మార్గదర్శనం చేసింది సోమన సీస పద్యాలే. అలాగే బద్దెన సుమతీ శతకం కంద పద్యాలకు మార్గం చూపింది సోమనాథుడి కంద పద్యాలే. భాషలో, పద ప్రయోగాల్లో సోమనాథుడు స్వేచ్ఛగా ప్రయోగాలు చేశాడు. వైరి సమాసాలు విరివిగా వాడాడు. వస్తువు మారినప్పుడు శైలి విధానాలు కూడా మారుతాయని చెప్పడానికి బసవపురాణం మంచి ఉదాహరణ. అయితే సోమనాథుడి బసవపురాణానికి ముందు ఛందశ్శాస్త్రం ఏదీ లేదని, అతని రచన తర్వాత వచ్చిన ఛందశ్శాస్త్రాలతో దాన్ని బేరీజు వేయడం తగదని అంటారు. పాల్కురికి వాడిన మాటలు గమనించదగ్గవి. గ్రూపులు కట్టడాన్ని గుంపిడటం, తక్కువగా గౌరవించటాన్ని సోల, చాలాకొద్ది సమయాన్ని గోరంతపొద్దు అన్నాడు. ఇక అసాధ్యం అనడానికి ‘కుంచాలతో మంచు కొలవటం’ అనే చక్కని జాతీయాన్ని ప్రయోగిస్తాడు. పుష్పవిల్లు, భూమితీరు, వేడి పయోధార వంటి ప్రయోగాలు అలవోకగా చేసినట్టుగా కనిపిస్తాయి. ప్రజలకు సూటిగా తన భావాలను ప్రసరింపజేయడానికి అనువైన శైలి, అభివ్యక్తి తీరుతెన్నులను సోమనాథుడు ఎంచుకున్నాడు. అదే సమయంలో సృజనాత్మకతకు పట్టం కట్టాడు. ఆ రకంగా పాల్కురికి సోమనాథుడు కావ్యగౌరవం కలిగిన బసవపురాణాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా రచించి ప్రజాకవిగా నిలిచాడు. తెలంగాణలోని ఎక్కువ శూద్రకులాలు శైవ మతాన్ని ఆలింగనం చేసుకున్నారని చెప్పడానికి అనువైన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. ఆ రకంగా సామాజిక విప్లవకారుడిగా సోమనాథుడు కనిపిస్తాడు. బసవపురాణం తెలుగు సమాజంలో సంఘసంస్కరణోద్యమ గ్రంథంగా నిలిచిపోతుంది. - కాసుల ప్రతాపరెడ్డి (ఇటీవల మెదక్ జిల్లా జోగిపేట డిగ్రీ కళాశాలలో పాల్కురికి సోమనాథుడిపై జరిగిన సదస్సులో సమర్పించిన పత్రంలో కొంత భాగం) -
బెంగళూరులో భారీ గృహ సముదాయం
50 అంతస్తులతో 151 మీటర్ల ఎత్తు దక్షిణాదిలో అతి పొడవైన టవర్! సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రియల్ ఎస్టేట్ రంగంలోని గోల్డెన్ గేట్ ప్రాపర్టీస్ లిమిటెడ్ నగరంలోని యశ్వంతపురలో ‘ప్రెసిడెన్షియల్ టవర్’ పేరిట 50 అంతస్తుల గృహ సముదాయాన్ని నిర్మించనుంది. ఈ టవర్ ఎత్తు 151 మీటర్లు ఉంటుంది. బెంగళూరులో, బహుశా దక్షిణాదిలో కూడా ఇదే అతి ఎత్తైన టవర్ అని సంస్థ వ్యవస్థాపకుడు కే ప్రతాప్ ఒక ప్రకటనలో తెలిపారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఓరియన్ మాల్, స్టార్ హోటల్స్, ఆస్పత్రుల సమీపంలోని నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో అనేక అధునాతన సదుపాయాలుంటాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నగరంలో పెద్దదైన క్లబ్ హౌస్‌ను కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టును చేపట్టిన 36 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మొత్తమ్మీద 40 నెలల వ్యవధిలో అపార్ట్మెంట్లను సంబంధిత యజమానులకు అప్పగించలేని పక్షంలో వారి పెట్టుబడిపై ఏడాదికి పది శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తామని వెల్లడించారు. ఈ హామీని తొలుతే బాండు రూపంలో ఇస్తామని తెలిపారు. నగరంలో పది వేల మందికి పైగా అత్యంత శ్రీమంతులున్నారని, కనుక విలాసవంతమైన నివాస అపార్ట్మెంట్లకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
ప్రజల వద్దకే ‘అపోలో అట్ హోం’
అపోలో సంస్థల యజమాని ప్రతాప్ సీ రెడ్డి తిరుమల, న్యూస్‌లైన్ : ప్రజల వద్దకే చికిత్సను తీసుకువెళ్లేందుకు ‘అపోలో అట్ హోం’ అనే కార్యక్రమానికి త్వరలో శ్రీకా రం చుట్టనున్నట్లు ఆ సంస్థ యజమాని ప్రతాప్ సీ రెడ్డి వె ల్లడించారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ సమేతంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు దగ్గరుండి స్వామి దర్శనాన్ని కల్పించారు. అనంత రం ప్రతాప్ సీ రెడ్డి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో అపోలో ఆస్పత్రులు విజయవంతంగా ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాయన్నారు. చిత్తూరు జిల్లా అరగొండకు సమీపంలో ఉన్న అపోలో ఆస్పత్రిలో సుమారు 70 వేల మందికి అన్ని రకాల వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. నాన్ కమ్యునికబుల్ డిసీస్(ఎన్సీడీ), డయాబెటిస్, హార్ట్ ఎటాక్, క్యాన్సర్ వంటి ప్రధానమైన నాలుగు సమస్యలతో ఏడాదికి 36 మిలియన్ల మంది మృతి చెందుతున్నారన్నారు. ఈ సమస్యలకు ముందుగానే పరిష్కారాన్ని కనుగొనాలనే లక్ష్యం తో ‘టోటల్ హెల్త్ ప్రాజెక్ట్’ రూపొందిస్తున్నామని చెప్పారు. అలాగే అప్పుడే పుట్టిన బిడ్డ పెరిగి పెద్దయ్యే వరకు ఎటువంటి రోగాలు సోకకుండా ఎలా సంరక్షించాలి అనే విషయాలపై కూడా పూర్తి ప్రణాళికను రూపొందిస్తున్నామని వెల్లడించారు. తిరుమలలో ఏర్పాటు చేసిన అపోలో హృదయ అత్యవసర చికిత్స కేంద్రంలో అనేక మంది శ్రీవారి భక్తులు ఉచితంగా చికిత్స పొందుతున్నారని చె ప్పారు. శబరిమళై, పూరిలో కూడా ఉచిత హృదయ అత్యవసర చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
చిట్టీలన్నాడు... పత్తా లేకుండా పోయాడు
-
ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా..
కాజీపేట, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలు చేసి తక్షణమే తనకు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు రాజారపు ప్రతాప్ హెచ్చరించారు. కాజీపేట 36వ డివిజన్ సిద్ధార్థనగర్‌లోని ఆయన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతాప్ మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం శ్రమిస్తున్న తనను అధిష్టానం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. అధికార పద వుల కోసం నిన్న, మొన్న పా ర్టీలో చేరిన వ్యక్తులకు ఎమ్మెల్యే టి కెట్లు కేటాయిం చడం విచారకరమన్నారు. 24 గంటల్లోగా తనకు పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని తెలిపారు. అలాగే జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థు ల ఓట మికి కృషి చేస్తామని హెచ్చరించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు బుధవారం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ యాదగిరి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కె.నర్సింహరెడ్డి, నాయకులు దండం చంద్రమౌళి, జైపాల్‌రెడ్డి, అంజయ్య, స్వప్న, జగదీష్‌చందర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రతాప్ ఇంటిలో సిరిసిల్ల రాజయ్యకు పరాభవం.. స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన రాజార పు ప్రతాప్‌ను బుజ్జగించేందుకు వరంగల్ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సిద్ధార్థనగర్‌లోని ప్రతాప్ ఇంటికి రాజయ్య మంగళవారం తన అనుచరులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ప్రతాప్ అనుచరులు రాజయ్యను అడ్డుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. రాజయ్య.. గోబ్యాక్.. అంటూ నిన దిస్తూ కాం గ్రెస్ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలను దహనం చేసి ఆందోళనకు దిగారు. పనిచేసే కార్యకర్తలకు కాం గ్రెస్‌లో స్థానం లేదని నిన్న, మొన్న వచ్చిన వ్యక్తులకు టిక్కెట్ ఎలా ఇస్తారంటూ ఒక దశలో బూతుపురాణం అందుకున్నారు. అయితే ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ఎంపీ అభ్యర్థి రాజ య్య ఎంత ప్రయత్నించినా వారు వినలేదు. దీం తో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. -
నేటినుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి మార్చి 4 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు జంట జిల్లాల నుంచి సుమారు లక్షమంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. హైదరాబాద్ జిల్లాలో 194, రంగారెడ్డి జిల్లాలో 290 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. లక్షమందికి పైనే... జంట జిల్లాల నుంచి ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య లక్ష దాటింది. ైెహ దరాబాద్ జిల్లాలో 30,055 మంది జనరల్, 6,265 మంది ఒకేషనల్ పరీక్షలకు హాజరవుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి 61,473 మంది జనరల్, 5,061 మంది ఒకేషనల్ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఒకేషనల్ అభ్యర్థులకు 19 నాన్-పారామెడికల్ కోర్సులకు సంబంధించి ప్రశ్నాపత్రాలను ఇంటర్‌బోర్డు అందజేస్తుంది. పారామెడికల్ కోర్సుల విద్యార్థులకు మాత్రం ఎగ్జామినర్లే ప్రశ్నాపత్రాలను తయారు చేసి ఇస్తారు. అరగంట ముందే చేరుకోవాలి: ప్రతాప్, రంగారెడ్డి జిల్లా ఆర్ఐవో ప్రాక్టికల్ పరీక్షలకు విద్యార్థులు నిర్దేశిత సమయానికంటే అరగంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షకు వెళ్లేపుడు హాల్‌టికెట్, ప్రాక్టికల్ రికార్డ్ బుక్, కాంపాస్ బాక్స్ వెంట తీసికెళ్లాలి. ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను అనుమతించేది లేదు. బోర్డు నిబంధనలను ఉల్లంఘిస్తే ఆయా పరీక్షా కేంద్రాల యాజమాన్యాలు, విద్యార్థులపై ఏపీ పబ్లిక్ పరీక్షల చట్టం 1997 ప్రకారం చర్యలు తీసుకుంటాం. -
సినిమాకి ‘మార్కెట్’ పెరిగింది
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో సినిమా రంగంలో మార్కెటింగ్ వనరులు కూడా విస్తృతంగా పెరిగాయని ప్రముఖ సినీ దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్ అన్నారు. అంగరలో శిల్ప కళాకారుడు పెద్దింశెట్టి సూర్యనారాయణమూర్తి కుమారుడు నాయుడు నివాసంలో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు సుకుమార్ సోమవారం సతీసమేతంగా వచ్చారు. ‘కరెంట్’ చిత్ర దర్శకుడు ప్రతాప్ కూడా సుకుమార్‌తో ఉన్నారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో సుకుమార్ ముచ్చటించారు. వన్ చిత్రం విజయంపై మీ కామెంట్? ఈ సినిమా ద్వారా ఏది చెప్పాలనుకున్నానో అది చెప్పానన్న సంతృప్తి పొందాను. నా అన్ని సినిమాల్లోకెల్లా వన్‌కి ఇండియాతో పాటు యూఎస్ నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. సినీ రంగం పరిస్థితి ఎలా ఉంది? సినిమా మార్కెటింగ్ రంగం బాగా అభివృద్ది చెందింది. గతంలో సినిమా అంటే థియేటర్‌కు వెళ్లి చూడటమే అన్నట్టుండేది. టెక్నాలజీ పెరగడంతో మల్టీ ప్లెక్స్‌లు వచ్చాయి. ఇతర దేశాల్లోనూ తెలుగు సినిమా విడుదల చేసే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. మీ సినిమాలు ఆలస్యం అవుతాయనే విమర్శ ఉంది కదా..? వన్ సినిమాను 2013లోనే ప్రారంభించాం. సమంత మూడు నెలలు పాటు సిక్ కావడం, మహేష్‌బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో బిజీగా ఉండటంతో ఆలస్యమైంది. ప్రతి సినిమా ఆలస్యానికీ ఏదో ఒక కారణం ఉంటుంది. మీరు నిర్మాణ రంగంపై దృష్టి పెట్టారేమిటి? తక్కువ బడ్జెట్‌తో మంచి సినిమాలు నిర్మించడం ద్వారా కొత్త దర్శకులకు అవకాశం కల్పించడం నా ఉద్దేశం. అందుకే ‘సుకుమార్ ఎంటర్టైన్మెంట్’ సంస్థను స్థాపించాను. మీ బ్యానర్‌పై తీసే సినిమాల వివరాలు? మూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. నా దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన ప్రతాప్ (కరెంట్ ఫేం) దర్శకత్వంలో ఫిబ్రవరిలో ఒక సినిమా ప్రారంభమవుతుంది. తదుపరి ప్రాజెక్టుల కోసం కథలు ఆలోచిస్తున్నాం. మీ సినీ ప్రస్థానం గురించి చెబుతారా? మాది మల్కిపురం మట్టపర్రు. చిన్నప్పుడు అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం, బుర్రకథలు ప్రదర్శించేవాడిని. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ సినిమాలుఆసక్తిగా చూసేవాడిని. ఆ ఆసక్తే సినిమా రంగంలోకి నన్ను పురిగొల్పింది. ఒడిదుడుకులు ఎదుర్కొన్నారంటారు కదా.. 1999లో సినిమా రంగంలోకి వచ్చాను. అమ్మ, నాన్న సపోర్టు ఇచ్చారు. ఎడిటర్ మోహన్, వీవీ వినాయక్ వద్ద పనిచేశాను. దిల్ సినిమాకు అసిస్టెంటు డైరక్టర్‌గా పనిచేశాను. కష్టాలు అనుభవించిన వ్యక్తిగా మా నాన్న, అన్నయ్యలు, కుటుంబ సభ్యులు నాకు తోడ్పాటునిచ్చారు. ఇబ్బం దులు ఉన్నప్పుడు ఆదిత్య క ళాశాలలో లెక్చరర్‌గా పనిచేసి మళ్లీ సినిమా రంగంలోకి వెళ్లాను. మీరు తీసిన సినిమాల్లో మీకు బాగా పేరుతెచ్చిన సినిమా ఏదంటే ఏం చెబుతారు? పనిచేసిన వ్యక్తిగా అన్ని సినిమాలు సంతృప్తిని ఇచ్చాయి. మహేష్‌బాబు సినిమా వన్ కు ఎక్కువ ప్రశంసలు వచ్చాయి. ఎన్టీఆర్‌తో యాక్షన్ ప్రేమకథ మట్టపర్రు (మలికిపురం) : జూనియర్ ఎన్టీఆర్‌తో యాక్షన్ ప్రేమకథాచిత్రం తీస్తున్నట్టు దర్శకుడు బి.సుకుమార్ తెలిపారు. స్వగ్రామం మట్టపర్రు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ మే నెలలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుందన్నారు. ‘వన్ చిత్రం సక్సెస్ అయింది. హీరో మహేష్‌బాబు తనయుడు గౌతమ్ కూడా ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. -
ఈసారీ జంబ్లింగ్ లేకుండానే..
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ నిర్వహణ నుంచి డిపార్ట్మెంటల్ అధికారులను తొలగించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇంటర్ విద్య ప్రాంతీయ పర్యవేక్షకుడు (ఆర్ఐఓ) ప్రతాప్ పేర్కొన్నారు. బుధవారం ఆయన తాండూరులోని జూనియర్ కళాశాలలను తనిఖీచేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ప్రాక్టికల్స్‌కు డిపార్ట్మెంట్ అధికారులను కేటాయించకపోవడంపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రాక్టికల్స్ నిర్వహణ నుంచి డిపార్ట్మెంట్ అధికారులను తొలగిస్తారని వస్తున్న వార్తలపై ఆయన పైవిధంగా స్పందించారు. గతేడాది మాదిరిగానే ప్రాక్టికల్స్ జంబ్లింగ్ లేకుండానే జరుగుతాయన్నారు. జిల్లాలో మొత్తం 530 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉండగా త్వరలో జరుగనున్న పరీక్షలకు 308 కేంద్రాలను కేటాయించామన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. థియరీ పరీక్షలు పూర్తయ్యేనాటికే పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. గతేడాది మాదిరిగానే సమాధానపత్రాలు రాష్ర్టంలోని ఏ జిల్లాకైనా వెళ్లవచ్చన్నారు. ఒకవేళ అప్పటిలోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ ప్రాంతానికి చెందిన పేపర్లు ఆయా ప్రాంతాల్లోనే వాల్యుయేషన్ చేస్తారన్నారు. అంతకుముందు ఆర్ఐఓ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిద్ధార్థ, అంబేద్కర్, సింధు, చైతన్య, విజ్ఞాన్ కళాశాలలను తనిఖీచేశారు. ముఖ్యంగా ప్రాక్టికల్స్ నిర్వహణకు కావాల్సిన ప్రయోగశాలలను పరిశీలించారు. ఆయన వెంట డెక్ సభ్యుడు బాలకృష్ణ ఉన్నారు.