ఎట్టకేలకు రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తేలిపోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై పోటీకి దిగారు. మరి దినేష్.. రాహుల్‌కు తగిన పోటీని ఇవ్వగలరా? బీజేపీ అభ్యర్థి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి?
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీని గాంధీ కుటుంబానికి కంచుకోటగా పరిగణిస్తుంటారు. ఈసారి ఇక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా గాంధీ నిరాకరించారు. దీంతో ఆమె కుమారుడు రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీకి దిగారు. ఇదే స్థానం నుంచి బీజేపీ తన అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్‌ను బరిలో నిలిపింది.
2018లో దినేష్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆ మరుసటి ఏడాది ఆయనకు బీజేపీ లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీపై దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేశారు. అయితే సోనియా గాంధీ 1,67,178 ఓట్లతో విజయం సాధించారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ దినేష్ ప్రతాప్ సింగ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. రాయ్‌బరేలీ రాజకీయాలలో పంచవటి వర్గం ఆధిపత్యం చెలాయిస్తుంది. దినేష్ పంచవటి వర్గానికి చెందినవారు. ఆయన గుణవర్ కమంగల్పూర్ గ్రామ నివాసి.
రాయ్‌బరేలీ రాజకీయాలలో దినేష్ కుటుంబానికి ఆదరణ ఉంది. ఒకప్పుడు ఆయన సోనియా గాంధీకి అత్యంత సన్నిహితునిగా పేరొందారు. 2010లో తొలిసారిగా, 2016లో రెండోసారి కాంగ్రెస్ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ ఎమ్మెల్సీ అయ్యారు. 2018లో కాంగ్రెస్‌ను వీడి, బీజేపీలో చేరారు. మరి ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత దినేష్ కాంగ్రెస్‌కు ఎంతవరకూ పోటీనివ్వగలరో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment