nallah, man fall, pratap, నాలా, ప్రతాప్, వ్యక్తికి గాయాలు
నాలాలో అర కిలోమీటర్ కొట్టుకుపోయి...
Published Mon, Sep 26 2016 3:17 PM | Last Updated on Mon, Oct 8 2018 3:07 PM
హైదరాబాద్: పొంగిపొర్లుతున్న ఓ నాలాలో ప్రమాదవశాత్తు పడిన ఓ వ్యక్తి అరకిలోమీటర్ కొట్టుకుపోగా స్థానికులు రక్షించారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రతాప్(45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయాడు. చుట్టుపక్కల వారు అతడిని గమనించి రక్షించేలోపల అరకిలోమీటర్ కొట్టుకుపోయాడు. అక్కడున్న వారంతా శ్రమించి అతడిని నీటి నుంచి బయటకు లాగారు. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
Advertisement
Advertisement