Nallah
-
నాలాపై స్పష్టత ఏదీ?
• నాలా చార్జీలను ఎత్తేస్తున్నాం: 2014లో సీఎం వెల్లడి • కానీ, వాస్తవ రూపం దాల్చని హామీ; చార్జీ తగ్గింపు తోనే సరి • 2006 కంటే ముందున్న వాటికి నో నాలా: హై కోర్టు తీర్పు • భేఖాతరంటోన్న హెచ్ఎండీఏ; పన్ను కడితేనే ప్లాన్ అంటూ ఒత్తిడి ఎవరి వాదన వారిదే.. బోడుప్పల్లో ఓ ఇంటి యజమాని తన 200 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరణ కోసం ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది 20 ఏళ్ల క్రితమే నివాస లే–అవుట్‌గా రిజిస్ట్రేషన్ అయింది. అయితే ఇప్పుడు హెచ్ఎండీఏ ఏమంటోందంటే.. ఈ లే–అవుట్ హెచ్ఎండీఏ పరిధిలో ఉంది కాబట్టి.. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం 3 శాతం నాలా పన్ను కట్టాల్సిందేనని మరి, యజమాని ఏమంటున్నారంటే.. 2006లో నాలా చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే అంతకుముందున్న లే–అవుట్లకు ఈ చట్టం వర్తించదు. ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకుంటే అప్పటి మార్కెట్ రేటు ప్రకారం కాకుండా ప్రస్తుతమున్న ధర ప్రకారం నాలా పన్నును చెల్లించమనడం సరైంది కాదు. గతంలో కె. సత్యానంద పట్నాయక్ పిటిషన్లోనూ హెకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని సాక్షి, హైదరాబాద్: ఈ వాదన అతనొక్కడిదే కాదు.. 2006 కంటే ముందున్న లే–అవుట్లను క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరిదీనూ! వాస్తవానికి 2014లో జరిగిన ఓ ప్రాపర్టీ షోలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ‘నాలా పన్నును ఎత్తేస్తున్నామని’ ప్రకటించారు. కానీ, అది నేటికీ వాస్తవరూపం దాల్చలేదు. 9 శాతంగా ఉన్న నాలా పన్నును కాస్త 3 శాతానికి తగ్గిస్తూ జీవో విడుదల చేశారు. దక్కిందే పుణ్యమని ఇక్కడికే సరిపెట్టుకున్నారు భాగ్యనగర డెవలపర్లు. అయితే ఇప్పుడొచ్చిన చిక్కేంటంటే.. 2006 కంటే ముందున్న లే–అవుట్లను క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటే నాలా పన్నును చెల్లించాల్సిందేనని హెచ్ఎండీఏ వాదిస్తోందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) అంటోంది. పైగా వాయిదాల రూపంలో కాకుండా ఒకేసారి చెల్లించాలని అప్పుడే ప్లాన్ విడుదల చేస్తామంటూ డెవలపర్లను వేధిస్తున్నారని టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ జే వెంకట్ రెడ్డి ఆరోపించారు. దీంతో గత్యంతరం లేక నిర్మాణ సంస్థలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకునే పనిలో నిమగ్నమవుతున్నాయి. గతంలోనూ నిర్మాణ సంస్థల వాదనలు విన్న న్యాయస్థానం నిరభ్యంతర ధృవీకరణ పత్రం విషయంలో నాలా చార్జీలను చెల్లింపుల గురించి ఒత్తిడి తేకూడదని వెల్లడించింది. అయినప్పటికీ హెచ్ఎండీఏ మొండి వైఖరి అవలంబిస్తోందంటూ నిర్మాణ రంగం వాపోతోంది. 2006 కంటే ముందుంటే.. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ (నాలా)ను తీసుకొచ్చింది. మార్కెట్ విలువలో 10 శాతం పన్నును చెల్లించాలని నిర్ణయించింది. అయితే నిర్మాణ సంస్థల కోరిక మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ పన్నును హెచ్ఎండీఏ పరిధిలో 9 శాతానికి, జీహెచ్ఎంసీ పరిధిలో 5 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం ఆ పన్నును కాస్త హెచ్ఎండీఏ పరిధిలో 3 శాతానికి, జీహెచ్ఎంసీ పరిధిలో 2 శాతానికి తగ్గించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే 2006 కంటే ముందున్న లే–అవుట్లకు మాత్రం ఈ చట్టం వర్తించదు. ⇔ 8330/పీ8/పాలసీ/హెచ్/2009 ప్రకారం హెచ్ఎండీఏ పరిధిలో డెవలప్మెంట్ చార్జీలను వాయిదా పద్ధతుల్లో చెల్లించే వీలుంది కూడా. హెచ్ఎండీఏ చట్టం 2008లోని 46(5) ప్రకారం డెవలప్మెంట్, క్యాపిటలైజేషన్ చార్జీలను 10 శాతం వడ్డీతో వాయిదా పద్ధతిలో చెల్లించే వీలు కల్పించారు అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ ప్రదీప్ చంద్ర. అంటే రూ.15– 75 లక్షల వరకు 4 సమాన వాయిదాల్లో, రూ.75 లక్షల కంటే అధిక మొత్తమైతే 8 వాయిదాల్లో 24 నెలల్లో చెల్లించవచ్చన్నమాట. డెవలపర్లను ప్రోత్సహించడం మానేసి.. నాలా పన్నును సాకుగా చూపుతూ ప్రాజెక్ట్‌ల అనుమతుల మంజూరులో జరుగుతున్న జాప్యాన్ని, అధికారుల అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు నగరం, పట్టణాల్లోని వ్యవసాయ భూమిని నాన్–అగ్రికల్చరల్ ల్యాండ్‌కు మార్పు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. దీంతో పంచాయతీ పరిధిలోనూ దేశ, విదేశీ నిర్మాణ సంస్థలు బడా ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి. ఫీజుల రూపంలో ప్రభుత్వానికీ ఆదాయం దండిగా వస్తోంది. కానీ, మన రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం రెసిడెన్షియల్ జోన్లో ఉన్న భూమికి సైతం నాలా పన్నును కట్టాల్సిందేనని ఒత్తిడి తీసుకురావటం అనైతికం. అది కూడా ప్రస్తుతమున్న మార్కెట్ విలువ ప్రకారం చెల్లించాల్సిందేనంటూ బలవంతం చేస్తున్నారని డెవలపర్లు వాపోతున్నారు. రాష్ట్రానికి అధిక ఆదాయం తెచ్చే సామర్థ్యమున్న నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడం మానేసి.. నీరుగార్చేలా చేస్తే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. హెచ్ఎండీఏ పనితీరుపై సీఎంకు వినతిప్రతం ఇచ్చేందుకు సిద్ధమయ్యామన్నారు. – జే వెంకట్ రెడ్డి టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ -
కూల్చివేత బాధితులకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: నగరంలోని నిర్మాణాల కూల్చివేత బాధితులకు హైకోర్టులో ఊరట లభించింది. నిజాంపేటలోని ధరణి వెల్ఫేర్ అసోసియేషన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారంటూ అసోసియేషన్‌కు చెందిన ఆరుగురు సభ్యులు గురువారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు... నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను తొలగించరాదని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది. -
మూడో రోజు కొనసాగుతున్నకూల్చివేతలు
హైదరాబాద్: నగరంలోని నాలాలపై గల అక్రమ కట్టడాల కూల్చివేతలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రామాంతపూర్, గచ్చబౌలి, కొండాపూర్, గోకుల్‌ప్లాట్స్, ఇందిరానగర్, మంజీరారోడ్, మాతృశ్రీనగర్, సురక్ష కాలనీలో గల అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. ఇప్పటికే రెండు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో అక్రమ కూల్చివేతలు కొనసాగుతుండగా.. ఈ రోజు మరిన్ని భవనాలు కూల్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు యత్నిస్తున్నారు. కుషాయి గూడలో జరుగుతున్న కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. అదేవిధంగా చర్లపల్లిలో కూల్చివేతలను కూడా స్థానికులు అడ్డుకుని, మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూకట్ పల్లి వివేకానంద నగర్ లో నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. కేపీహెచ్‌బీ రోడ్ నెం2 లో కూడా కూల్చివేతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈ భవనాలపై జీహెచ్ఎంసీకి పలు ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా పీవీ ఎక్స్ ప్రెస్ హైవేను ఆనుకుని ఉన్న అక్రమ కట్టడాలపై కూడా జీహెచ్ ఎంసీ దృష్టి సారించింది. మరో వైపు మూడు రోజు జరగుతున్న నిర్మాణాల తొలగింపుపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
రెండొందలకు పైగా నిర్మాణాలు తొలగించాం : కేటీఆర్
హైదరాబాద్ : నగరంలోని నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను జీహెచ్ఎంసీ అధికారులు వేగవంతం చేశారు. ఆక్రమణల తొలగింపు పనులు రెండో రోజు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, నీటి పారుదల, పోలీసు శాఖల అధికారులతో 24 బృందాలు కూల్చివేత పనులను కొనసాగిస్తున్నాయి. అక్కడక్కడా స్థానికులు అధికారులతో వాగ్వివాదానికి దిగుతున్నా సిబ్బంది మాత్రం తమ పని తాను చేసుకుంటూ పోతున్నారు. మంత్రి కేటీఆర్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై అధికారులతో ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారు. నిర్మాణాల కూల్చివేతలో భాగంగా రెండో రోజు దాదాపు 200 నిర్మాణాలను తొలగించినట్లు మంత్రి ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. తొలగింపు పనులను జీహెచ్ఎంసీ, ఇతర సిబ్బంది కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. సిబ్బంది ఇదే విధంగా తమ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసుకుంటూ వెళ్లాలన్నారు. జీహెచ్ఎంసీ ఇంజినీర్లకు అధనంగా ఇతర శాఖల నుంచి మరో 30 మంది ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లను రోడ్ల మరమ్మతులు, వాటికి సంబంధించిన పనుల కోసం ఏర్పాటుచేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అక్రమ భవనాల కూల్చివేతకు అడ్డుపడొద్దని ఎమ్మెల్యేలు, అధికారులకు ఇప్పటికే తెలంగాణ సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. Day 2 of clearing encroachments on storm water drains; more than 200 illegal structures razed. Keep up the effort @GHMCOnline pic.twitter.com/VSQduYOazT — KTR (@KTRTRS) 27 September 2016 For expediting road repairs in Hyderabad,we strengthened GHMC engineering team by adding 30 executive engineers from other engineering depts — KTR (@KTRTRS) 27 September 2016 -
ఊపందుకున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ : నగరంలోని నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను జీహెచ్ఎంసీ అధికారులు వేగవంతం చేశారు. నగరంలో పెద్ద ఎత్తున ఆక్రమణల తొలగింపు పనులు రెండో రోజు జరుగుతున్నాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ, రెవెన్యూ, నీటి పారుదల, పోలీసు శాఖల అధికారులతో 24 బృందాలు కూల్చివేత పనులను కొనసాగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల సాయంతో అక్రమణ కట్టడాలను తొలగిస్తున్నారు. మంత్రి కేటీఆర్ నగరంలో కూల్చివేతలపై అధికారులతో ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారు. అక్రమ భవనాల కూల్చివేతకు అడ్డుపడొద్దని ఎమ్మెల్యేలు, అధికారులకు ఇప్పటికే సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అక్రమ భవనాలు కూల్చడానికి వెళ్లే అధికారులు ముందస్తుగా పక్కా సమాచారంతో వెళ్లాలని సూచించింది. నిర్మాణ కూల్చివేతలను యజమానులు అడ్డుకుంటే అధికారులు డాక్యుమెంట్లను చూడడంతో పాటు వాటిని పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. గచ్చిబౌలి, మీర్ పేట్, రాజేంద్రనగర్, ఉప్పల్, రామంత పూర్, కాప్రా, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. శేరిలింగంపల్లిలో నాలాలపై ఉన్న నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. ఆదర్శనగర్, శాంతినగర్, దీప్తిశ్రీనగర్‌లో దాదాపు 2కి.మీ. మేర ఆక్రమణలు జరిగినట్లు గ్రేటర్ సిబ్బంది గుర్తించారు. మీర్ పేట్ హస్తిన పురంలో డీసీ పంకజం ఆధ్వర్యంలో, చాదర్ ఘాట్ మూసా నగర్ బస్తీలో డీసీ కృష్ణ శేఖర్ నేతృత్వంలో ముందస్తుగా నోటీసులు జారీ చేసారు. వాహెద్ నగర్, శంకర్ నగర్, పద్మ నగర్ బస్తీల్లో అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఆరంఘర్ చౌరస్తాలో పీవీ ఎక్స్ ప్రెస్ వే సమీపంలో అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు. మల్కాజిగిరిలోని షిరిడి నగర్లో, ఉప్పల్ పరిధిలోని హబ్సిగూడ, లక్ష్మీనగర్ లలో అక్రమ నిర్మాణాలను తొలగించారు. కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. కర్మన్ ఘాట్ లోని ఉదయ్ నగర్ కాలనీలో నాలాలపై ఆక్రమించిన ఇళ్లను డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. రామంతపుర్ పెద్ద చెరువు సమీపంలో నిర్మాణంలో ఉన్న కాంపౌడ్ వాల్‌ను అధికారులు కూల్చివేశారు. -
ఊపందుకున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
నాలాలో అర కిలోమీటర్ కొట్టుకుపోయి...
హైదరాబాద్: పొంగిపొర్లుతున్న ఓ నాలాలో ప్రమాదవశాత్తు పడిన ఓ వ్యక్తి అరకిలోమీటర్ కొట్టుకుపోగా స్థానికులు రక్షించారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రతాప్(45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయాడు. చుట్టుపక్కల వారు అతడిని గమనించి రక్షించేలోపల అరకిలోమీటర్ కొట్టుకుపోయాడు. అక్కడున్న వారంతా శ్రమించి అతడిని నీటి నుంచి బయటకు లాగారు. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. nallah, man fall, pratap, నాలా, ప్రతాప్, వ్యక్తికి గాయాలు -
నాలాల ఆక్రమణల తొలగింపు షురూ
-
నాలాల ఆక్రమణల తొలగింపు షురూ
హైదరాబాద్: నగరంలో ఎడతెగని వానలు సృష్టించిన విలయంపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. వర్షం తెరపి ఇవ్వటంతో సోమవారం అక్రమ నిర్మాణాలు, నాలాల ఆక్రమణలపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. శేరిలింగంపల్లి మండలం పరిధిలోని మురుగు కాల్వలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగింపు చేపట్టారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ, రెవెన్యూ, నీటి పారుదల, పోలీసు శాఖల అధికారులతో 24 బృందాలు ఏర్పాటయ్యాయి. ముందుగా మదీనగూడ రామకృష్ణ నగర్లో నాలాను ఆక్రమించి నిర్మించిన అపార్టుమెంట్ ప్లేగ్రౌండ్ ఏరియాను డిమాలిషన్ బృందం తొలగించింది. అదేవిధంగా గచ్చిబౌలి నుంచి కొత్తగూడ వరకు ఉన్ననాలాపై ఆక్రమణలను ధ్వంసం చేస్తోంది. అలాగే, కాప్రా, ఉప్పల్‌లో కూడా నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించే పనిలో అధికారులు ఉన్నారు.