కూల్చివేత బాధితులకు హైకోర్టులో ఊరట
Published Thu, Sep 29 2016 4:18 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
హైదరాబాద్: నగరంలోని నిర్మాణాల కూల్చివేత బాధితులకు హైకోర్టులో ఊరట లభించింది. నిజాంపేటలోని ధరణి వెల్ఫేర్ అసోసియేషన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ భవనాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారంటూ అసోసియేషన్‌కు చెందిన ఆరుగురు సభ్యులు గురువారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు... నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను తొలగించరాదని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది.
Advertisement
Advertisement