
రెండొందలకు పైగా నిర్మాణాలు తొలగించాం : కేటీఆర్
హైదరాబాద్ : నగరంలోని నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను జీహెచ్ఎంసీ అధికారులు వేగవంతం చేశారు. ఆక్రమణల తొలగింపు పనులు రెండో రోజు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, నీటి పారుదల, పోలీసు శాఖల అధికారులతో 24 బృందాలు కూల్చివేత పనులను కొనసాగిస్తున్నాయి. అక్కడక్కడా స్థానికులు అధికారులతో వాగ్వివాదానికి దిగుతున్నా సిబ్బంది మాత్రం తమ పని తాను చేసుకుంటూ పోతున్నారు. మంత్రి కేటీఆర్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై అధికారులతో ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారు.
నిర్మాణాల కూల్చివేతలో భాగంగా రెండో రోజు దాదాపు 200 నిర్మాణాలను తొలగించినట్లు మంత్రి ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. తొలగింపు పనులను జీహెచ్ఎంసీ, ఇతర సిబ్బంది కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. సిబ్బంది ఇదే విధంగా తమ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసుకుంటూ వెళ్లాలన్నారు. జీహెచ్ఎంసీ ఇంజినీర్లకు అధనంగా ఇతర శాఖల నుంచి మరో 30 మంది ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లను రోడ్ల మరమ్మతులు, వాటికి సంబంధించిన పనుల కోసం ఏర్పాటుచేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అక్రమ భవనాల కూల్చివేతకు అడ్డుపడొద్దని ఎమ్మెల్యేలు, అధికారులకు ఇప్పటికే తెలంగాణ సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Day 2 of clearing encroachments on storm water drains; more than 200 illegal structures razed. Keep up the effort @GHMCOnline pic.twitter.com/VSQduYOazT
— KTR (@KTRTRS) 27 September 2016
For expediting road repairs in Hyderabad,we strengthened GHMC engineering team by adding 30 executive engineers from other engineering depts
— KTR (@KTRTRS) 27 September 2016