ghmc officers
-
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
-
‘కార్లలో తిరిగితే బాగానే కనిపిస్తుంది.. మోటార్ సైకిళ్లపై తిరగండి’
సాక్షి, హైదరాబాద్: ‘కార్లలో తిరిగితే బాగానే కనిపిస్తుంది. కార్లలో మెయిన్ రోడ్లమీదే తిరుగుతాం. గల్లీల్లో, బస్తీల్లో ప్రజల బాధలు తెలియాలంటే మోటార్‌సైకిళ్లపై వెళ్లండి. క్షేత్రస్థాయిలో వర్షాల వల్ల ఎన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి.. ఎక్కడ ఎన్ని గుంతలు పడ్డాయి.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్నది క్లియర్‌గా తెలుస్తుంది’ అని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. తగిన చర్యలు తీసుకోవాలి: మేయర్ నగరంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి ఇబ్బందులు, తదితర సమస్యలు తెలుసుకునేందుకు జోనల్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లు క్షేతస్థ్రాయిలో మోటార్ సైకిళ్లపై పర్యటించాలని ఆమె ఆదేశించారు. రోడ్లపై గుంతలు తదితరమైన వాటికి తక్షణం మరమ్మతులు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల్లో నిల్వనీటిని తొలగించడంతోపాటు సదరు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణచర్యలు చేపట్టాలన్నారు. వరద ప్రభావ ప్రాంతాల్లో అందుతున్న సహాయ చర్యలను పరిశీలించేందుకు బుధవారం మేయర్ అంబర్‌పేట, నారాయణగూడ, హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఆదేశాలు జారీచేశారు. పేరుకుపోయిన చెత్తకుప్పలను వెంటనే తొలగించాలని వైద్యాధికారులను ఆదేశించారు. విరిగిన చెట్లను, వీధిదీపాలకు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలన్నారు. అనంతరం తన చాంబర్లో జోనల్ కమిషనర్లతో వర్షబాధితులకు పునరావాస కార్యక్రమాలతోపాటు వినాయకచివితి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మండపాల వద్ద చెత్తకుండీలు వినాయక మండపాల వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కమిటీ సభ్యులకు తగిన సహకారం అందజేయాలని, ప్రతి మండపం వద్ద ఒక చెత్తకుండీ ఏర్పాటు చేయాలని సూచించారు. మరో రెండు రోజులు వర్షాలు తీవ్రంగా కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సమీక్ష సమావేశంలో అడిషనల్ కమిషనర్ (శానిటేషన్) బి.సంతోష్, జోనల్ కమిషనర్లు రవికిరణ్, అశోక్ సామ్రాట్, ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మమత, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, డిప్యూటి కమిషనర్లు పాల్గొన్నారు. చదవండి: మొదట తక్కువ ధరకు అమ్ముతారు.. బానిసగా మారిన తర్వాత.. -
పోలీసుల ‘పోస్టర్’ వర్సెస్ గ్రేటర్ ‘చలాన్’
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ కమిషనర్ వినియోగించే వాహనం పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడంతో ట్రాఫిక్ పోలీసులు రూ.6,210 జరిమానా విధించారు. బోనాలకు వస్తున్న భక్తులకు స్వాగతం పలుకుతూ గోల్కొండ ప్రాంతంలోని ప్రభుత్వ గోడలపై పోస్టర్లు అంటించిన పోలీసులకు ‘గ్రేటర్’ రూ.10 వేల ఫైన్ వేసింది. సరిగ్గా వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండూ వ్యవహారాలు దెబ్బకు దెబ్బ అన్నట్లు ఉన్నాయని కొందరు పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. జరిమానా విధించడంలో జీహెచ్ఎంసీ వ్యవహారశైలి కూడా ‘నిబంధనల్ని ఉల్లంఘిచినట్లే’ ఉందని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ వినియోగించే వాహనం సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిఘా కెమెరాలకు చిక్కింది. దీంతో గత ఏడాది ఆగస్టు 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 30 మధ్య ఆరు ఈ–చలాన్లు జారీ అయ్యాయి. దీనికి సంబంధించిన జరిమానా మొత్తం రూ.6,210 పెండింగ్‌లో ఉన్నట్లు గత గురువారం మొహిత్ పటేల్ అనే నెటిజనుడు ట్వీట్ చేశాడు. ఇది సోషల్‌మీడియాతో పాటు మీడియాలోనూ హల్చల్ చేయడంతో జీహెచ్ఎంసీ స్పందించింది. కమిషనర్ దాన కిషోర్ వినియోగించే కారుపై (టీఎస్ 09 ఎఫ్ఏ 4248) ఉన్న ఆరు చలాన్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించింది.ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ వాహనాన్ని నడిపిన డ్రైవర్లను కమిషనర్ దానకిషోర్ తీవ్రంగా మందలించారనీ ప్రకటించింది. ఇది జరిగిన వారం రోజులకు జీహెచ్ఎంసీ అధికారులు తమ ‘కక్ష’ తీర్చుకున్నారు. తమకు రూ.6210 జరిమానా విధించిన పోలీసులకు రూ.10 వేల ఫైన్ వేశారు. గోల్కొండ బోనాల నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేసిన పోలీసు విభాగం ఆ భక్తులకు స్వాగతం పలకాలని భావించింది. దీనికోసం రాష్ట్ర డీజీపీ నుంచి స్థానిక గోల్కొండ అదనపు ఇన్స్పెక్టర్ వరకు ఆరుగురి ఫొటోలతో పోస్టర్లను ముద్రించారు. గోల్కొండ పోలీసుస్టేషన్ పేరుతో ముద్రించిన వీటి ద్వారా బోనాలకు వస్తున్న భక్తులకు స్వాగతం పలుకుతూ అనేకచోట్ల అతికించారు. వీటిని చూసిన జీహెచ్ఎంసీ అధికారులు..సదరు పోస్టర్లు తమ అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటయ్యాయంటూ గురువారం రూ.10 వేల చలాన్ జారీ చేశారు. ప్రభుత్వ విభాగమైన పోలీసు శాఖ ఇలాంటి అతిక్రమణలకు పాల్పడకూడదని జీహెచ్ఎంసీ అధికారులు అంటుండగా... ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోస్టర్లు ఏర్పాటు చేశామని, సదరు పోస్టర్ అంటించిన గోడ జీహెచ్ఎంసీకి చెందిన కాదని పేర్కొంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులో, వాణిజ్య అవసరాల కోసమే ఇలా చేస్తే జరిమానా విధించాలి తప్ప ప్రభుత్వం విభాగం, ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా అంటిస్తే ఎలా విధిస్తారని ప్రశ్నిస్తున్నారు. సదరు గోడపై పోస్టర్ అతికించి పోలీసు విభాగం తప్పు చేస్తే... దానిపై తీసుకున్న చర్య ద్వారా జీహెచ్ఎంసీ కూడా తప్పు చేసిందని అధికారులు అంటున్నారు. ఆ పోస్టర్లు గోల్కొండ పోలీసులు ముద్రించినట్లు వాటిని చూస్తేనే అర్థం అవుతోంది. జీహెచ్ఎంసీ చెబుతున్నట్లు అవి నిబంధనలకు విరుద్ధమైతే నేరుగా ఠాణాకు వెళ్ళి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయిన ఇన్స్పెక్టర్కు చలాన్ అందించవచ్చని, అయితే అలా చేయని జీహెచ్ఎంసీ అధికారులు ఆ పోస్టర్ పక్కనే చలాన్ అతికించారని చెబుతున్నారు. పోలీసులు పోస్టర్ అతికించడం తప్పయితే... చలాన్ అతికించడం ఒప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ విభాగంలో ఈ–చలాన్ల జారీ మొత్తం సాంకేతికంగా వాహనం నెంబర్ ఆధారంగా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా సదరు వాహనం ఎవరిది అనేది ట్రాఫిక్ పోలీసులకు తెలిసే అవకాశం లేదు. జీహెచ్ఎంసీ కమిషనర్ వాడుతున్న వాహనంపై ఈ–చలాన్లు ఉన్న విషయం ఓ నెటిజనుడు ట్వీట్ చేయడంతో బయటకు వచ్చిందని, దీనికి సంబంధించి పోలీసులపై జీహెచ్ఎంసీ ‘కక్ష’ కట్టడం సాధ్యం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. -
నగరంలో కూల్చివేతలు.. ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నగరంలో నాలాల విస్తరణ పనుల్లో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు పలు ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో నాలాలపై అక్రమంగా వెలిచిన కట్టడాలను శనివారం అధికారులు కూల్చివేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగే అవకాశం ఉండటంతో.. పెద్ద ఎత్తున పోలీసుల బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు చేపడుతున్నారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించిన అనంతరమే కూల్చివేస్తున్నామని అధికారులు తెలిపారు. ఉప్పుగూడ నుంచి డబీర్‌పురా మీదుగా చాదర్‌ఘాట్ వరకు ఓపెన్ నాలాపై అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది. ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత మరోవైపు శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలిలో నాలాల అక్రమణ తొలగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతలను అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి బాధితులకు నచ్చజెప్పి కూల్చివేతలను కొనసాగించారు. నష్టపరిహారం ఇప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు. -
పలు రోడ్లను బంద్ చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు
సాక్షి, హైదరాబాద్ : మహానగరం మహా సంద్రాన్ని తలపిస్తోంది. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరవాసుల జీవనం అస్థవ్యస్తమైంది. మధ్యాహ్నం నుంచే ఎడతెరిపి లేకుండా పలు ప్రాంతాల్లో వర్షం పడుతుండటం తీవ్రం ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ భారీ వర్షాలతో బాలపూర్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ వేళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివాజీ చౌక్, సాయినగర్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళే ప్రధాన రహదారి వర్షం నీటితో నిండి చెరువును తలపిస్తోంది. భారీ వర్షానికి నాగోల్ ఆదర్శ్ రోడ్లు నీట మునిగాయి. చాలా కాలనీ రోడ్లు నదిని తలపిస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు కొన్ని రోడ్లను బంద్ చేస్తున్నారు. కర్మన్ ఘాట్ ప్రధాన రహదారికిపైకి వరద నీరు వచ్చి చేరింది. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ పెరిగిపోయింది. ట్రాఫిక్ చిక్కుకొని నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగరాన్ని వర్షం వదలడం లేదు. ఆదివారం వరుణుడు మరోసారి హైదరాబాద్ వాసులపై దాదాపు దాడి చేసినంత పనిచేశాడు. ఇప్పటికే భారీ వర్షం కురుస్తుండటంలో నగర ప్రజలు ఆందోళన చెందుతుండగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్డీకాపూల్, బేగంపేటతోపాటు పలు ప్రాంతాల్లో వాన నీటితో నిండిపోయాయి. ముషీరబాగ్, నారాయణగుడా, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. బస్తీల్లోకి వరదనీరు భారీగా వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షం దెబ్బ నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ వచ్చి పడ్డ వర్షంతో జనజీవనం స్తంభించింది. ఇప్పటికే కురిసిన వర్షాలకు పలు చోట్ల రోడ్లు దెబ్బతినడంతో.. వాటిని పునరుద్ధరిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. నీట మునిగిన కాలనీలను పరిశీలిస్తూ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆక్రమణకు గురైన నాలాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. -
దారి తప్పుతున్న హోటల్స్ తనిఖీలు
-
హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల తనిఖీలు
-
తాడ్బన్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మేయర్
హైదరాబాద్ : నగరంలో కలకలం రేపిన తాడ్బన్ రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని మేయర్ పరిశీలించారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్బన్ వద్ద ఉన్న ప్రమాదకర మలుపును బుధవారం మేయర్ బొంతు రామ్మోహన్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో పాటు పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. తాడ్బన్ మూలమలుపు వద్ద చెట్ల కొమ్మలు తొలగించడంతో పాటు, సమీపంలోని నాలాను వెంటనే తొలగించాలని మేయర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. -
ఉల్లంఘనులే!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో యధేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. అధికారులు, సిబ్బంది అండదండలు పుష్కలంగా ఉండడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరకు కోర్టు ఆదేశాలనూ పట్టించుకోవడం లేదు. ఒక్కోసారి అధికారులే కోర్టుకు ఎలా వెళ్లాలి.. నిబంధనలు ఎలా తుంగలో తొక్కాలో సదరు అక్రమార్కులకు తెలియచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఉన్నతాధికారుల ఉదాసీనత కారణంగా అక్రమ కట్టడాలు ఇప్పుడు అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి. కోర్టు కేసుల కారణంగా వేలాది అక్రమ కట్టడాలు కూల్చివేయలేని పరిస్థితి ఏర్పడింది. కోర్టు కేసుల విషయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులే అక్రమార్కులకు గాడ్ ఫాదర్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. గత సెప్టెంబర్‌లో భారీ వర్షాలతో నగరం నీటమునిగినప్పుడు పర్యటించిన మంత్రులకు నాలాలపైనే వెలసిన ఎన్నో భవనాలు కనిపించాయి. నగరంలో ఓ చోట నాలాను పూడ్చివేసి, పైన నిర్మించిన ఓ బహుళ అంతస్తుల భవనం ఫొటోను ట్విట్టర్ ద్వారా నగర పౌరుడొకరు మునిసిపల్ మంత్రి కేటీఆర్‌కు పంపారు. ఇలా నగరంలో నాలాలపై, చెరువుల్లోనే కాక ఎక్కడ పడితే అక్కడ అడ్డదిడ్డంగా బహుళ అంతస్తుల భవనాలున్నాయి. భవనానికి తగిన సెట్‌బ్యాక్‌లుండవు. ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ తిరిగే దారుండదు. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు ఉండవు. అంతిమంగా అసలు ఆ భవనానికి అనుమతే ఉండదు. అయినప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇందుకు కారణం వాటికి సంబంధించిన కోర్టు కేసులు. అక్రమంగా భవనాల్ని నిర్మించడం.. వాటిని కూల్చివేయకుండా ఉండేందుకు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం గ్రేటర్లో అలవాటుగా మారింది. ఇందుకు కారకులు టౌన్‌ప్లానింగ్ అధికారులేనని చెప్పక తప్పదు. ఎక్కడైనా అక్రమ నిర్మాణం జరుగుతుంటే దిగువస్థాయి ఉద్యోగుల నుంచి వారి దృష్టికి రాక మానదు. ఇక బేరసారాలు మొదలవుతాయి. నిర్మాణం సాఫీగా చేసుకునేందుకు తమకివ్వాల్సిన మొత్తాన్ని మాట్లాడుకుంటారు. బీఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరిస్తామంటారు. ఉన్నతాధికారులు, కమిషనర్ సైతం కూల్చివేతలకు ఆదేశాలివ్వకుండా కోర్టుల నుంచి స్టే తెచ్చుకునే వెసులుబాటు గురించీ చెబుతారు. అందుకు ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తారు. ఎటొచ్చీ జేబులు నింపుకునే కార్యక్రమంలో ఎన్ని రకాలుగా అక్రమాలకు పాల్పడి దర్జాగా ఉండవచ్చో నేర్పుతారు. ఆ ధీమాతోనే నగరంలోని అక్రమార్కులు రెచ్చిపోయి విచ్చలవిడి నిర్మాణాలు జరుపుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అమాయకులు బలవుతున్నారు. నోటీసు ఇవ్వగానే.. అక్రమాలకు పాల్పడినవారి భవనాలను కూల్చివేయాలన్నా ముందస్తు నోటీసులు ఇవ్వాల్సి ఉండటంతో , ఒక నోటీసు జారీ కాగానే కోర్టులకు వెళ్లి ఎలా స్టే తెచ్చుకోవాలో చెబుతారు. ఉన్నతాధికారుల నుంచి కూల్చివేతలకు ఆదేశాలు వచ్చినా చర్యలు తీసుకునేలోగా స్టేలు తెచ్చుకోవడంతో పలు అక్రమ భవనాలను కూల్చకుండా వదిలేశారు. మరోవైపు కోర్టు కేసులు లేని వాటికి సైతం కోర్టు కేసులున్నాయని ప్రచారం చేస్తూ వాటి జోలికి వెళ్లరు. తాము కోరిన విధంగా ముడుపులు అందుతుండటంతో టౌన్‌ప్లానింగ్ అధికారులే అక్రమార్కులకు గాడ్ఫాదర్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు పదినెలల్లోనే అక్రమ నిర్మాణాలు జరిపిన 128 భవనాల యజమానులు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నారంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. సివిల్కోర్టుల్లోనే కాక హైకోర్డు స్థాయిలోనూ పలు కేసులు పరిష్కారానికి నోచుకోకుండా మగ్గుతున్నాయి. ఎవరైనా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా, వాటిని వెంటనే వెకేట్ చేయించి, చర్యలు తీసుకోవాల్సి ఉండగా, జీహెచ్ఎంసీ అధికారులు ఆ పని చేయడం లేరు. జీహెచ్ఎంసీ తరపున కోర్టు కేసుల్లో వాదించాల్సిన స్టాండింగ్ కౌన్సెళ్లు సైతం లంచాల మత్తులో మునిగి అక్రమార్కులకే అనుకూలంగా వ్యవహరిస్తుండటాన్ని జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాల్లోనూ సభ్యులు ఎండగట్టినా పరిస్థితిలో మార్పులేదు. స్టాండింగ్ కౌన్సిళ్లూ అంతే.. టౌన్‌ప్లానింగ్ అధికారులతోపాటు ఆ విభాగం తరపున పనిచేసే స్టాండింగ్ కౌన్సిళ్లకూ అక్రమార్కులిచ్చే ముడుపులపైనే మోజు. అందుకే వారు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. స్టాండింగ్ కౌన్సిళ్లకు గౌరవ వేతనాలిచ్చేది జీహెచ్ఎంసీ తరపున పనిచేయడానికా.. లేక అక్రమార్కులకు అండగా నిలవడానికా..? అని గత సమావేశాల్లో సభ్యులు ప్రశ్నించారంటే వారి పనితీరు అర్థం చేసుకోవచ్చు. ఇలా అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన జీహెచ్ఎంసీలోని అధికారులు, స్టాండింగ్ కౌన్సిళ్లు, రాజకీయ నేతలూ తదితరులందరూ అక్రమార్కులకే అండగా ఉంటుండటంతో అక్రమ నిర్మాణాలు ఆకాశాన్నంటుతున్నాయి. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన.. 29 అక్రమ భవనాలను కూల్చివేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించినా చర్యలు తీసుకోలేదంటే అక్రమార్కులపై టౌన్‌ప్లానింగ్ అధికారులకున్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు. హైకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయని కంటెంప్ట్ కేసులు 144 ఉన్నాయంటే జీహెచ్ఎంసీ సిబ్బంది తీరును అంచనా వేసుకోవచ్చు. -
జీహెచ్ఎంసీ అధికారులపై కేటీఆర్ అసంతృప్తి?
-
రెండొందలకు పైగా నిర్మాణాలు తొలగించాం : కేటీఆర్
హైదరాబాద్ : నగరంలోని నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను జీహెచ్ఎంసీ అధికారులు వేగవంతం చేశారు. ఆక్రమణల తొలగింపు పనులు రెండో రోజు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, నీటి పారుదల, పోలీసు శాఖల అధికారులతో 24 బృందాలు కూల్చివేత పనులను కొనసాగిస్తున్నాయి. అక్కడక్కడా స్థానికులు అధికారులతో వాగ్వివాదానికి దిగుతున్నా సిబ్బంది మాత్రం తమ పని తాను చేసుకుంటూ పోతున్నారు. మంత్రి కేటీఆర్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై అధికారులతో ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారు. నిర్మాణాల కూల్చివేతలో భాగంగా రెండో రోజు దాదాపు 200 నిర్మాణాలను తొలగించినట్లు మంత్రి ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. తొలగింపు పనులను జీహెచ్ఎంసీ, ఇతర సిబ్బంది కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. సిబ్బంది ఇదే విధంగా తమ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసుకుంటూ వెళ్లాలన్నారు. జీహెచ్ఎంసీ ఇంజినీర్లకు అధనంగా ఇతర శాఖల నుంచి మరో 30 మంది ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లను రోడ్ల మరమ్మతులు, వాటికి సంబంధించిన పనుల కోసం ఏర్పాటుచేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అక్రమ భవనాల కూల్చివేతకు అడ్డుపడొద్దని ఎమ్మెల్యేలు, అధికారులకు ఇప్పటికే తెలంగాణ సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. Day 2 of clearing encroachments on storm water drains; more than 200 illegal structures razed. Keep up the effort @GHMCOnline pic.twitter.com/VSQduYOazT — KTR (@KTRTRS) 27 September 2016 For expediting road repairs in Hyderabad,we strengthened GHMC engineering team by adding 30 executive engineers from other engineering depts — KTR (@KTRTRS) 27 September 2016 -
ఊపందుకున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ : నగరంలోని నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను జీహెచ్ఎంసీ అధికారులు వేగవంతం చేశారు. నగరంలో పెద్ద ఎత్తున ఆక్రమణల తొలగింపు పనులు రెండో రోజు జరుగుతున్నాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ, రెవెన్యూ, నీటి పారుదల, పోలీసు శాఖల అధికారులతో 24 బృందాలు కూల్చివేత పనులను కొనసాగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల సాయంతో అక్రమణ కట్టడాలను తొలగిస్తున్నారు. మంత్రి కేటీఆర్ నగరంలో కూల్చివేతలపై అధికారులతో ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారు. అక్రమ భవనాల కూల్చివేతకు అడ్డుపడొద్దని ఎమ్మెల్యేలు, అధికారులకు ఇప్పటికే సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అక్రమ భవనాలు కూల్చడానికి వెళ్లే అధికారులు ముందస్తుగా పక్కా సమాచారంతో వెళ్లాలని సూచించింది. నిర్మాణ కూల్చివేతలను యజమానులు అడ్డుకుంటే అధికారులు డాక్యుమెంట్లను చూడడంతో పాటు వాటిని పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. గచ్చిబౌలి, మీర్ పేట్, రాజేంద్రనగర్, ఉప్పల్, రామంత పూర్, కాప్రా, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. శేరిలింగంపల్లిలో నాలాలపై ఉన్న నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. ఆదర్శనగర్, శాంతినగర్, దీప్తిశ్రీనగర్‌లో దాదాపు 2కి.మీ. మేర ఆక్రమణలు జరిగినట్లు గ్రేటర్ సిబ్బంది గుర్తించారు. మీర్ పేట్ హస్తిన పురంలో డీసీ పంకజం ఆధ్వర్యంలో, చాదర్ ఘాట్ మూసా నగర్ బస్తీలో డీసీ కృష్ణ శేఖర్ నేతృత్వంలో ముందస్తుగా నోటీసులు జారీ చేసారు. వాహెద్ నగర్, శంకర్ నగర్, పద్మ నగర్ బస్తీల్లో అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఆరంఘర్ చౌరస్తాలో పీవీ ఎక్స్ ప్రెస్ వే సమీపంలో అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు. మల్కాజిగిరిలోని షిరిడి నగర్లో, ఉప్పల్ పరిధిలోని హబ్సిగూడ, లక్ష్మీనగర్ లలో అక్రమ నిర్మాణాలను తొలగించారు. కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. కర్మన్ ఘాట్ లోని ఉదయ్ నగర్ కాలనీలో నాలాలపై ఆక్రమించిన ఇళ్లను డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. రామంతపుర్ పెద్ద చెరువు సమీపంలో నిర్మాణంలో ఉన్న కాంపౌడ్ వాల్‌ను అధికారులు కూల్చివేశారు. -
ఊపందుకున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఆరా
న్యూఢిల్లీ : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలపై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఆరా తీశారు. జీహెచ్ఎంసీ అధికారులతో బుధవారం ఉదయం ఆయన ఫోన్లో మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, అన్ని శాఖల సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అంటురోగాలు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. -
జయశంకర్ విగ్రహాన్ని తొలగించిన GHMC అధికారులు
-
తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన ఆక్రమణల తొలగింపు
నల్లకుంట(హైదరాబాద్): ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. లోకాయుక్త ఆదేశాల మేరకు బుధవారం విద్యానగర్ డివిజన్ డీడీ కాలనీలోని ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపునకు జీహెచ్ఎంసీ అధికారులు పూనుకున్నారు. ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా నుంచి వాటర్ వర్క్స్ కార్యాలయం వరకు రోడ్డుకు రెండు వైపులా ఉన్న ఆక్రమణలను తీసివేశారు. వ్యాపారులు తేరుకునే లోగానే జీహెచ్ఎంసీ సిబ్బంది దుకాణాలను పూర్తిగా నేల మట్టం చేశారు. వారంతా వచ్చి జీఎంహెచ్‌సీ వ్యాన్‌ను అడ్డుకోవటం, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు, సిబ్బంది మెల్లగా జారుకున్నారు. దీంతో వ్యాపారులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అంబర్‌పేట ఇన్స్పెక్టర్ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ఆక్రమణలు తొలగిస్తున్నట్లు తమకు కనీసం సమాచారం లేదన్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని వ్యాపారులకు సూచించారు. వారు ఆందోళన విరమించక పోవడంతో అందరినీ వాహనంలో స్టేషన్‌కు తరలించారు. -
అవతరణ కళ
రసూల్‌పురా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ భద్రత చర్యలు చేపట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన పరేడ్ మైదానాన్ని పరిశీలించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, నార్త్‌జోన్ డీసీపీ సుధీర్‌బాబు, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలసి భద్రతా చర్యలపై చర్చించారు. భద్రత కోసం మూడువేల మంది పోలీసులు, అధికారులను వినియోగిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు ఇప్పటికే మైదానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని తెలిపారు.అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలనిప్రజలకు సూచించారు. వీవీఐపీ, వీఐపీల రాకపోకలను పురస్కరించుకుని ట్రాఫిక్ మళ్లించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయలో... నాంపల్లి: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించేఈ ఉత్సవాలు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా తెలంగాణ తేజోమూర్తులు అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేయనున్నారు. 3వ తేదీ ఉదయం 10.30 గంటలకు తెలంగాణ నృత్య రీతులపై సదస్సు, సాయంత్రం 5గంటలకు డాక్టర్ జి.ఎం.రామశర్మ అష్టావధానం ఉంటుంది. 4న ఉదయం 10.30గంటలకు ‘తెలంగాణ చరిత్ర-సంస్కృతి-వినూత్నాంశాలు’పై సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. 5న ఉదయం 10.30 గంటలకు ‘తెలంగాణ పత్రికలు-గోలకొండ పత్రిక విశిష్టత’పై సదస్సు జరుగుతుంది. ప్రముఖ పత్రికా సంపాదకులు ఈ సదస్సులో పాల్గొంటారు. 6వ తేదీ ఉదయం ‘తెలంగాణ సాహిత్యం-అనువాద ఆవశ్యకత’పై సదస్సు నిర్వహిస్తారని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తెలిపారు. గన్పార్క ముస్తాబు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు గన్‌పార్క్ ముస్తాబవుతోంది. జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా నాంపల్లి అసెంబ్లీ ఎదురుగా ఉండే అమరవీరుల స్థూపాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏర్పాట్లు ఆదివారం ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. స్థూపాన్ని రంగురంగుల పూలతో అలంకరిస్తున్నారు. గన్‌పార్క్ చుట్టూ కాంతులు విరజిమ్మేలా విద్యుద్దీపాలను అమర్చారు. ఇక్కడ వారం రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. రాజకీయ నాయకులు, విద్యార్థి, ఉపాధ్యాయ, జర్నలిస్టు, ఉద్యోగ సంఘాల నాయకులు ఇక్కడకు రానున్నారు. -
బాబోయ్ మార్చురీ!
♦ ఉస్మానియాలో పనిచేయని ఫ్రీజర్లు ♦ గుట్టలుగా పేరుకుపోతున్న మృతదేహాలు ♦ పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు ♦ ఆందోళనలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అప్జల్‌గంజ్ : ఉస్మానియా ఆసుపత్రి శవాల కంపు కొడుతోంది. మార్చురీలోని ఫ్రీజర్లు పని చేయడంలేదు. దీనికి తోడు అనాథ శవాలు గుట్టుగుట్టలుగా పేరుకుపోతున్నాయి. వీటిని బయట పెట్టడంతో ఎండల తీవ్రత కారణంగా త్వరగా కుళ్లిపోయి కిలో మీటరు మేర దుర్వాసన వెదజల్లుతోంది. కొంతకాలం క్రితం మార్చురీని ఆధునీకరించి 38 వరకు శవాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 3 మాత్రమే పని చేస్తున్నాయి. ఎండ తీవ్రత పెరగడంతో నగరంలో మృతుల సంఖ్య పెరిగింది. పుట్‌పాత్‌లు, ప్రధాన కూడళ్ల వద్ద ఉండే యాచకులు, వృద్ధులు వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్నారు. ఇలా మార్చురీకి రోజు 3 నుంచి 4 వరకు అనాథ శవాలు చేరుతున్నాయి. పోస్టుమార్టం నిర్వహించాక మార్చురీలో భద్రపరుస్తున్నారు. మృతదేహాల వద్ద లభించిన సమాచారాన్ని బట్టి కొన్నింటిని వారి బంధువులకు అప్పగిస్తున్నారు. మిగితా వాటిని కొన్ని రోజుల తర్వాత మార్చురీలో ఉన్న ఓ గదిలో పడేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఆ గది పూర్తిగా శవాల గుట్టగా మారిపోయింది. అనాథ శవాల విషయంలో అటు ఆసుపత్రి యాజమాన్యంగాని, ఇటు జీహెచ్ఎంసీ అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. దీంతో రోజుల తరబడి శవాలు మార్చురీలోనే కుళ్లిపోతున్నాయి. వెదజల్లుతున్న దుర్వాసన ఉస్మానియా మార్చురీలో ప్రస్తుతం 80కి పైగా మృతదేహాలు కుళ్లిపోయే దశలో ఉన్నాయి. వీటన్నింటినీ ఫ్రీజర్ల నుంచి తీసి ఓ గదిలో పడేశారు. వీటి నుంచి ముక్కుపుటాలు అదిరే దుర్వాసన వస్తోంది. కుళ్లిపోయిన శవాలపైన వాలిన ఈగలు, దోమల పలు రకాల వ్యాధులను వ్యాపింప చేస్తున్నాయి. ఉస్మానియా మార్చురీ వెనుక భాగంలో ప్రధాన రహదారి ఉంది. ఈ మార్గంలో నిత్యం వందలాది మంది వాహనదారులు ప్రయాణిస్తుంటారు.ఉస్మానియా మార్చురీకి దగ్గరలోనే పీజీ విద్యార్థుల క్వార్టర్స్, ఆసుపత్రి పరిపాలనా విభాగం, మార్చురీ ప్రహరీ ఆనుకొని విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్నాయి. మార్చురీ నుంచి వస్తున్న దుర్వాసనతో ఆసుపత్రి సిబ్బంది,రోగులు ఇబ్బందిపడుతున్నారు. పట్టించుకోని జీహెచ్ఎంసీ... గతంలో అనాథ శవాలను సత్యహరిశ్ఛద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పురానాపూల్, అంబర్‌పేట, నల్లకుంట, బన్సీలాల్‌పేట్ శ్మశాన వాటికల్లో మూకుమ్ముడిగా దహనం చేసేవారు. ఆయ ప్రాంతాల వారి నుంచి తీవ్ర అభ్యంతరం రావడంతో నిలిపివేశారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను జీహెచ్ఎంసీ చూస్తోంది. కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు. మార్చురీలోని ఫ్రీజర్ల మరమ్మతులకు కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి పేరుకుపోయిన మృతదేహాలను జీహెచ్ఎంసీ అధికారులు తరలించి ఖననం చేయాలని ఆసుపత్రి సిబ్బంది కోరుతున్నారు. లేదంటే పరిస్థితి విషమించి పలు రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కొత్త రూట్లో...
సమస్యలు స్వయంగా గుర్తించనున్న జీహెచ్ఎంసీ అధికారులు నూతన సాంకేతిక విధానంతో చెక్ వాహనాలకు హైడెఫినిషన్ కెమెరాలు.. ప్రత్యేక సాఫ్ట్వేర్ రోజుకు 2000 కి.మీ. పరిధిలో పరిశీలన సాక్షి, సిటీబ్యూరో: గుంతలతో నిండిన రోడ్లు.. ఎక్కడి కక్కడ రోడ్లపై గుట్టలుగా చెత్త.. రహదారులపై పొంగిపొర్లే డ్రైనేజీలు... వేలాడుతున్న కేబుల్‌వైర్లు.. మరమ్మతులకు నోచుకోని వీధి దీపాలు... మూతలు లేని మ్యాన్‌హోళ్లు.. ఇవన్నీ నగర ప్రజల నిత్య సమస్యలు. ఇవే కాదు వివిధ ప్రాంతాల్లో అనుమతిలేనిహోర్డింగులు.. అక్రమంగా వెలుస్తున్న భవనాలు... ఫుట్‌పాత్‌ల ఆక్రమణ.. ట్రాఫిక్ ఇబ్బందులపై జీహెచ్ఎంసీకి క్రమం తప్పకుండా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. పరిష్కారం అంతంతమాత్రమే. వారం వారం జరిగే ప్రజావాణిలో మొర పెట్టుకున్నా.. కాల్‌సెంటర్‌కు తెలిపినా చర్యలు శూన్యమని ప్రజల నుంచి పదేపదే ఫిర్యాదులు.. అధికారులపై విమర్శలు. ఇదీ ప్రస్తుత పరిస్థితి. త్వరలో దీనికి స్వస్తి చెప్పబోతున్నారు. భవిష్యత్‌లో తమంతటతాముగా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరిస్తామంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా అధునాతన కెమెరాలను అమర్చిన వాహనాలను నగరంలో తిప్పుతూ సమస్యలను గుర్తిస్తామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే వాటిని పరిష్కరించే లా ఏర్పాట్లు చేస్తామంటున్నారు. దీని కోసం హైడెఫినిషన్ కెమెరాలను సంబంధిత వాహనం పైభాగంలో నాలుగు వైపులా అమరుస్తారు. వీటి ద్వారా సమస్యలను గుర్తించి... సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తారు. జీపీఎస్ విధానంతో సమస్య ఎక్కడుందో సంబంధిత అధికారికి తెలుస్తుంది. దాంతో వెంటనే సిబ్బందిని రంగంలోకి దింపి.. పరిష్కరిస్తారని చెబుతున్నారు. ‘అడ్వాన్స్డ్ సిటిజెన్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్’గా వ్యవహరించే ఈ విధానంతో ప్రజలు ఫిర్యాదు చేసేంతదాకా ఆగకుండా తామే పరిష్కరిస్తామని అంటున్నారు. తొలిదశలో 12 వాహనాలను వినియోగించనున్నారు. వీటిలో రెండింటిని అత్యవసర సమయాల్లో వాడేందుకు విడిగా ఉంచుతారు. మిగతా పది వాహనాలు ఒక్కొక్కటి రోజుకు దాదాపు 200 కి.మీ. చొప్పున నగరంలో 2000 కి.మీ. పరిధిలో తిరుగుతాయి. ప్రత్యేక సాఫ్ట్వేర్.. కోడ్ నెంబర్‌తో... వీధుల్లో గుర్తించిన సమస్యలను వాహనంలోనే ఏర్పాటు చేసే ప్రత్యేక సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా ఫొటోలు/వీడియోల రూపంలో కోడ్ నెంబరు ద్వారా సంబంధిత అధికారులు, డిప్యూటీ కమిషనర్లకు అందే అవకాశం ఉంటుంది. కేంద్ర కార్యాలయంలోని సెంట్రల్ కమాండ్ సిస్టమ్ ద్వారా ఏ సమస్య ఎంత వ్యవధిలో పరిష్కారమైందీ తెలుసుకునే వీలుంటుంది. దీనిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, తమ పరిధిలో అవసరమైన చర్యలు చేపడతారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం అనేక విభాగాల మధ్య సమన్వయం లేదు. కొత్త విధానంతో పూర్తి స్థాయి సమన్వయానికి వీలుంటుందని భావిస్తున్నారు. దీని అమలుకు సోమవారం జీహెచ్ఎంసీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, దీన్ని అమలు చేయనున్న కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. కొత్త యాప్.. ప్రజలు తాము గుర్తించిన సమస్యలను ఫొటోల రూపంలో పంపిం చేందుకు స్మార్ట్ఫోన్లు ఉన్న వారు వినియోగించేలా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చే యోచన ఉందని సోమేశ్‌కుమార్ తెలిపారు. -
జీహెచ్ఎంసీ అధికారులపై ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వాన్ని వీడాలనీ అంబర్‌పేట నియోజక వర్గం ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను హెచ్చరించారు. నియోజక వర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా నత్త నడకన సాగుతున్నాయని... వెంటనే వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదివారం పాత నల్లకుంట ప్రాంతంలో కిషన్‌రెడ్డి జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలసి పాదయాత్ర చేశారు. బస్తీలు, కాలనీల్లో ఎక్కడ చూసినా తవ్విన రోడ్లే దర్శనమివ్వడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లకు ప్యాచ్‌వర్క్స్ చేపట్టడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. కలుషిత నీటిపై ప్రజలు ఫిర్యాదు చేయగా తక్షణమే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, పరిశుద్ధమైన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాదయాత్రలో ఎమ్మెల్యేతో పాటు బీజేపీ స్థానిక నేతలు పలువురు కూడా ఉన్నారు. -
కాసుల పంట
రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు ఖజానాకు చేరిన అదనపు ఆదాయం గత ఏడాది వసూలైంది రూ.93 కోట్లు ఈసారి వచ్చింది రూ.261 కోట్లు అదనంగా సమకూరింది రూ.168 కోట్లు ఆనందంలో అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని కమిషనర్ సూచన సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ఆదాయం ఒక్కసారిగా పెరిగింది. పైసా పెంచకపోయినా కాసులు కురిసాయి. ఒక్క ఆస్తి పన్ను రూపేణా రూ.168 కోట్ల ఆదాయం అదనంగా సమకూరింది. ఈ పరిణామంతో జీహెచ్ఎంసీ అధికారులు తబ్బిబ్బవుతున్నారు. ఇంకాస్త చొరవ తీసుకుని ఉంటే మరింత మొత్తం వసూలయ్యేదని అధికారులు భావిస్తున్నారు. ఇదే స్ఫూర్తిని ప్రదర్శించి ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని యోచిస్తున్నారు. జీహెచ్ఎంసీకి గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి ఆస్తిపన్ను రూపేణా రూ.168 కోట్లు అదనంగా వసూలైంది. సోమవారం (జూన్ 30) ఒక్కరోజే 42 వేల మంది రూ.62 కోట్లు ఆస్తిపన్నుగా చెల్లించారు. మొదటి విడత పన్ను చెల్లిం చేందుకు జరిమానా లేకుండా జూన్ 30 వరకు అధికారులు గడువు ఇవ్వడంతోపాటు ఆదివారం(జూన్ 29) సైతం పౌరసేవా కేంద్రాలను తెరిచి ఉంచడంతో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దీంతో జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో గణనీయంగా పెరిగింది. ప్రజలు తమ ఆస్తిపన్నును రెండు విడతల్లో చెల్లించే అవకాశం ఉంది. తొలివిడత పన్నును జూన్ నెలాఖరులోగా, రెండో విడతగా డిసెంబర్ నెలాఖరులోగా చెల్లిస్తే ఎలాంటి జరిమానా ఉండదు. గడచిన సంవత్సరాల తో పోలిస్తే పెనాల్టీ లేకుండా ఆస్తిపన్ను చెల్లించేందుకు ప్రజలు మొగ్గు చూపారు. జీహెచ్ఎంసీలో దాదాపు 13 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులుండగా, వీరిలో 4 లక్షల మంది పన్ను చెల్లించారు. మరోవైపు బకాయిదారులతో అధికారులు జరిపిన సంప్రదింపులు, తీసుకున్న చర్యలు సైతం మంచి ఫలితానిచ్చింది. గత ఏడాది జూన్ నెలాఖరు వరకు కేవలం రూ.93 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది రూ.261 కోట్లకు పెరిగింది. పన్ను విషయమై అవగాహన కల్పించడం వల్లే మెరుగైన ఫలితాలు ఇచ్చినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఆగస్టు 31 వరకు గడువు పెంపు.. జరిమానా లేకుండా ఆస్తిపన్ను చెల్లించేందుకు జూన్ నెలాఖరు వరకున్న గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున తగిన ప్రచారం నిర్వహించలేకపోయామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రభుత్వానికి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆస్తిపన్ను చెల్లింపు గడువును పొడిగించాల్సిందిగా కోరారు. అందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సుముఖత వ్యక్తం చేయడంతో గడువును ఆగస్టు 31 వరకు పెంచినట్టు కమిషనర్ మంగళవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
కాఫీ షాపుల పై GHMC అధికారుల దాడులు
-
రంగారెడ్ది జిల్లాలో అక్రమకట్టడాల కూల్చివేత
-
GHMC అధికారుల నిర్బంధం