Removal of encroachment
-
రెండొందలకు పైగా నిర్మాణాలు తొలగించాం : కేటీఆర్
హైదరాబాద్ : నగరంలోని నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను జీహెచ్ఎంసీ అధికారులు వేగవంతం చేశారు. ఆక్రమణల తొలగింపు పనులు రెండో రోజు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, నీటి పారుదల, పోలీసు శాఖల అధికారులతో 24 బృందాలు కూల్చివేత పనులను కొనసాగిస్తున్నాయి. అక్కడక్కడా స్థానికులు అధికారులతో వాగ్వివాదానికి దిగుతున్నా సిబ్బంది మాత్రం తమ పని తాను చేసుకుంటూ పోతున్నారు. మంత్రి కేటీఆర్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై అధికారులతో ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారు. నిర్మాణాల కూల్చివేతలో భాగంగా రెండో రోజు దాదాపు 200 నిర్మాణాలను తొలగించినట్లు మంత్రి ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. తొలగింపు పనులను జీహెచ్ఎంసీ, ఇతర సిబ్బంది కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. సిబ్బంది ఇదే విధంగా తమ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసుకుంటూ వెళ్లాలన్నారు. జీహెచ్ఎంసీ ఇంజినీర్లకు అధనంగా ఇతర శాఖల నుంచి మరో 30 మంది ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లను రోడ్ల మరమ్మతులు, వాటికి సంబంధించిన పనుల కోసం ఏర్పాటుచేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అక్రమ భవనాల కూల్చివేతకు అడ్డుపడొద్దని ఎమ్మెల్యేలు, అధికారులకు ఇప్పటికే తెలంగాణ సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. Day 2 of clearing encroachments on storm water drains; more than 200 illegal structures razed. Keep up the effort @GHMCOnline pic.twitter.com/VSQduYOazT — KTR (@KTRTRS) 27 September 2016 For expediting road repairs in Hyderabad,we strengthened GHMC engineering team by adding 30 executive engineers from other engineering depts — KTR (@KTRTRS) 27 September 2016 -
ఊపందుకున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ : నగరంలోని నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను జీహెచ్ఎంసీ అధికారులు వేగవంతం చేశారు. నగరంలో పెద్ద ఎత్తున ఆక్రమణల తొలగింపు పనులు రెండో రోజు జరుగుతున్నాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ, రెవెన్యూ, నీటి పారుదల, పోలీసు శాఖల అధికారులతో 24 బృందాలు కూల్చివేత పనులను కొనసాగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల సాయంతో అక్రమణ కట్టడాలను తొలగిస్తున్నారు. మంత్రి కేటీఆర్ నగరంలో కూల్చివేతలపై అధికారులతో ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారు. అక్రమ భవనాల కూల్చివేతకు అడ్డుపడొద్దని ఎమ్మెల్యేలు, అధికారులకు ఇప్పటికే సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అక్రమ భవనాలు కూల్చడానికి వెళ్లే అధికారులు ముందస్తుగా పక్కా సమాచారంతో వెళ్లాలని సూచించింది. నిర్మాణ కూల్చివేతలను యజమానులు అడ్డుకుంటే అధికారులు డాక్యుమెంట్లను చూడడంతో పాటు వాటిని పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. గచ్చిబౌలి, మీర్ పేట్, రాజేంద్రనగర్, ఉప్పల్, రామంత పూర్, కాప్రా, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. శేరిలింగంపల్లిలో నాలాలపై ఉన్న నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. ఆదర్శనగర్, శాంతినగర్, దీప్తిశ్రీనగర్‌లో దాదాపు 2కి.మీ. మేర ఆక్రమణలు జరిగినట్లు గ్రేటర్ సిబ్బంది గుర్తించారు. మీర్ పేట్ హస్తిన పురంలో డీసీ పంకజం ఆధ్వర్యంలో, చాదర్ ఘాట్ మూసా నగర్ బస్తీలో డీసీ కృష్ణ శేఖర్ నేతృత్వంలో ముందస్తుగా నోటీసులు జారీ చేసారు. వాహెద్ నగర్, శంకర్ నగర్, పద్మ నగర్ బస్తీల్లో అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఆరంఘర్ చౌరస్తాలో పీవీ ఎక్స్ ప్రెస్ వే సమీపంలో అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు. మల్కాజిగిరిలోని షిరిడి నగర్లో, ఉప్పల్ పరిధిలోని హబ్సిగూడ, లక్ష్మీనగర్ లలో అక్రమ నిర్మాణాలను తొలగించారు. కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. కర్మన్ ఘాట్ లోని ఉదయ్ నగర్ కాలనీలో నాలాలపై ఆక్రమించిన ఇళ్లను డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. రామంతపుర్ పెద్ద చెరువు సమీపంలో నిర్మాణంలో ఉన్న కాంపౌడ్ వాల్‌ను అధికారులు కూల్చివేశారు. -
ఊపందుకున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
నాలాల ఆక్రమణల తొలగింపు షురూ
-
మహానంది లో ఆక్రమణల తొలగింపు
కర్నూలు : కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో అక్రమ కట్టడాలపై ఆలయ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆలయానికి చెందిన స్థలాల్లో కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. దీంతో ఆలయ అధికారులు శనివారం ఉదయం వాటి కూల్చివేత ప్రారంభించారు. దాదాపు 60కిపైగా ఇళ్లను జేసీబీలతో తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కళ్ల ఎదుటే తమ ఇళ్లు కూలిపోతుండగా బాధితులు రోదించారు. ఆక్రమణల తొలగింపును ఆపాలని అధికారులను ప్రాధేయపడ్డారు. (మహానంది) -
ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
కర్నూలు: కర్నూలు పట్టణంలోని సీ క్యాంపు రైతు బజార్ పక్క వీధిలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఏర్పాటైన షాపులను రెవెన్యూ అధికారులు బుధవారం ఉదయం తొలిగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 60 షాపులను తొలగించేందుకు మంగళవారం సాయంత్రమే అధికారులు ప్రయత్నించగా వ్యాపారులు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు బుధవారం పోలీసు భద్రత నడుమ తిరిగి అక్రమ షాపుల తొలగింపుకు చర్యలు చేపట్టారు. దీనిపై వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా తాము వ్యాపారాలను చేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు షాపులను తొలగిస్తే తాము రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆక్రమణల తొలగింపుపై ఉద్రిక్తత
కాగజ్‌నగర్/కాగజ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : కాగజ్‌నగర్‌లో ఆక్రమణల తొలగింపు పర్వం శుక్రవారం కూడా కొనసాగింది. గురువారం సాయంత్రం ప్రారంభమైన తొలగింపు కార్యక్రమం రాత్రి 3 గంటల వరకు కొనసాగింది. తిరిగి శుక్రవారం ఉదయం 7 గంటలకే తొలగింపు కార్యక్రమం ప్రారంభించారు. శుక్రవారం అంబేద్కర్ చౌరస్తా నుంచి మొదలుకుని పీహెచ్సీ రోడ్డు, ఇందిరామార్కెట్, రైల్వేస్టేషన్ ఏరియా, మెయిన్మార్కెట్, బస్టాండ్ ఏరియా, ఎన్టీఆర్ చౌక్, ఈఎస్ఐ ఆస్పత్రి, వెంకటరమణ థియేటర్ ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలను తొలగించారు. ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ బాలాజీ దిగంబర్ నేతృత్వంలో తొలగింపు కార్యక్రమం చేపడుతున్నారు. పట్టణంలో ఐదు జేసీబీలు ఏర్పాటు చేసి వ్యాపారస్తులకు గడువు ఇవ్వకుండా అక్రమ కట్టడాలను తొలగిస్తుండడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. తహశీల్దార్ మల్లేశ్, ఎంపీడీఓ సత్యనారాయణసింగ్, మున్సిపల్ డీఈ కృష్ణలాల్, సిర్పూర్(టి) తహశీల్దార్ రమేశ్‌గౌడ్‌లను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జేసీబీల వద్ద ఇన్‌చార్జీలుగా నియమించారు. గతంలో ఎన్నడూలేని విధంగా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సమయం ఇవ్వకుండా అధికారులు జేసీబీలతో కూలుస్తుండంపై వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీసం సమయం ఇవ్వాలని కోరుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడంలేదు. గాంధీచౌక్ గుండా కొత్తరోడ్డు పట్టణంలో కొందరు ఆక్రమణదారుల వల్ల ఉన్న రోడ్లు కూడా కనిపించకుండా పోయాయి. అధికారుల ఆక్రమణల తొలగింపుతో గాంధీచౌక్ ముందు భాగం నుంచి సరోజినీదేవి రోడ్డు వరకు ఉన్న రోడ్డు వెలుగులోకి వచ్చింది. ఇన్నా ళ్లు అక్రమ కట్టడం ఉండడంతో రోడ్డు మూసివేతకు గురైంది. అక్రమణలు తొలగించేందుకు అధికారులు రాగా స్థానికులు జేసీబీని అడ్డుకున్నారు. సబ్‌కలెక్టర్ అక్కడికి చేరుకుని మున్సిప ల్ ప్లాన్‌ను పరిశీలించారు. గల్లిరోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టారని, నిర్మాణాన్ని తొల గించారు. ప్రస్తుతం రోడ్డు ఏర్పాటు కావడంతో పట్టణవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ బందోబస్తు అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ సురేశ్‌బాబు ఆధ్వర్యంలో పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐలు పృథ్వీధర్‌రావు, రహ్మాన్, ఎస్సైలు సాదిక్అహ్మద్, తిరుపతితోపాటూ ఏఎస్సైలు బందోబస్తు నిర్వహించారు. మంత్రికి ఫిర్యాదు చేస్తా.. - కావేటి సమ్మయ్య, ఎమ్మెల్యే ఆక్రమణల తొలగింపుపై మున్సిపల్ మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తెలపారు. ఆయన ఫోన్లో విలేకరులతో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వారికి అధికారుల ఏకపక్ష నిర్ణయంతో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. బాధితులను ఆదుకోవాలి.. - కోనప్ప, మాజీ ఎమ్మెల్యే పట్టణంలోని రోడ్ల వెడల్పు వల్ల జీవనోపాధి కోల్పోతున్న బాధితులను ఆదుకోవాలని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఎన్టీయార్ చౌరస్తా వద్ద సబ్‌కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. కొన్ని అక్రమ కట్టడాలను చూసిచూడనట్లు వదిలివేసి అమాయకుల కట్టడాలను కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనల మేరకు అన్ని అక్రమకట్టడాలను తొలగిస్తానని సబ్‌కలెక్టర్ హామీ ఇచ్చారు.