కర్నూలు: కర్నూలు పట్టణంలోని సీ క్యాంపు రైతు బజార్ పక్క వీధిలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఏర్పాటైన షాపులను రెవెన్యూ అధికారులు బుధవారం ఉదయం తొలిగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 60 షాపులను తొలగించేందుకు మంగళవారం సాయంత్రమే అధికారులు ప్రయత్నించగా వ్యాపారులు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు బుధవారం పోలీసు భద్రత నడుమ తిరిగి అక్రమ షాపుల తొలగింపుకు చర్యలు చేపట్టారు.
దీనిపై వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా తాము వ్యాపారాలను చేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు షాపులను తొలగిస్తే తాము రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు.