
మహానంది లో ఆక్రమణల తొలగింపు
కర్నూలు : కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో అక్రమ కట్టడాలపై ఆలయ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆలయానికి చెందిన స్థలాల్లో కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. దీంతో ఆలయ అధికారులు శనివారం ఉదయం వాటి కూల్చివేత ప్రారంభించారు.
దాదాపు 60కిపైగా ఇళ్లను జేసీబీలతో తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కళ్ల ఎదుటే తమ ఇళ్లు కూలిపోతుండగా బాధితులు రోదించారు. ఆక్రమణల తొలగింపును ఆపాలని అధికారులను ప్రాధేయపడ్డారు.
(మహానంది)