ryali
-
ద్విముఖ రూపుడు.. జగన్మోహనుడు
ఆత్రేయపురం(కోనసీమ జిల్లా): ముందు పురుష రూపం వెనుక భాగాన స్త్రీ రూపంతో ఏకశిలలో శివవిష్ణువులు సాక్షాత్కరించే అద్భుత నిలయం ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం. సృష్టికి ఆదిలోనే స్వయంభూ క్షేత్రంగా ఖ్యాతికెక్కిన ఈ పుణ్యక్షేత్రంలో ముందు భాగం కేశవ రూపం, వెనుక భాగం జగన్మోహినీ స్త్రీ రూపం ఆకారంలో స్వయంభువుగా అవతరించాడు. స్త్రీ, పురుష రూపధారణతో కొలువైన శివ, విష్ణు దేవతామూర్తులను దర్శించుకుంటే సర్వపాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో మరో విశేషమేమంటే భక్తులందరికీ గర్భాలయ ప్రవేశం ఉండటం. అంతేకాక ఈ ఆలయానికి ఎదురుగానే పడమర వైపు ఉమా కమండలేశ్వర స్వామి శివాలయం ఉండటం ఒక విశేషం. శివాలయంలో నీరు ఇంకిపోవడం, జగన్మోహునుడి ఆలయంలో స్వామి వారి పాదాల నుంచి నిరంతరం గంగ ఉద్భవించడం సృష్టి రహస్యాలుగా చరిత్ర చెబుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి ర్యాలి చేరుకునేందుకు గంట సమయం పడుతుంది. రావులపాలెం చేరుకున్న భక్తులు అక్కడ నుంచి ఊబలంక మీదుగా ర్యాలి చేరుకునేందుకు 6 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వుంటుంది. రావులపాలెం బస్టాండ్ నుంచి రెండు గంటలకోసారి ఆర్టీసీ బస్ సౌకర్యం ఉండడంతో పాటు ప్రైవేటు వాహనాల ద్వారా ర్యాలి దివ్య క్షేత్రానికి చేరుకోవచ్చు. కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు 10న ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం గరుడ వాహనసేవ, రాత్రి 9 గంటలకు స్వామి వారి కల్యాణం, 14న సదస్యం, 16న చక్రస్నానం, 17న శ్రీపుష్పోత్సవంతో కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయని ఆలయ ఈవో బి.కృష్ణ చైతన్య తెలిపారు. -
రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీమ జిల్లాలో రాజధానిని, హైకోర్టును ఏర్పాటు చేయకుండా పాలక ప్రభుత్వాలు వివక్ష చూపడం సరికాదని ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్. రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయలసీమ మహాసభల సందర్భంగా జిల్లా కేంద్రం కడపలో ర్యాలీ నిర్వహించారు.అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పాలక ప్రభుత్వాలు ప్రాజెక్టుల పురోగతికి ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. నేడు కోస్తా ప్రాంతానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటిని అందిస్తుండంతో దాదాపు 25 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతోందని తెలిపారు. రాయలసీమలో లక్ష ఎకకరాలకు నీటిని అందించే ప్రాజెక్టు లేకపోవడం బాధాకరమన్నారు. పంటలు పండక, చేసిన అప్పులు తీర్చలేక ఈ ఏడాది దాదాపు 240 మంది రైతులు అత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు సీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రత్యేక రాష్ట్రంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల జిల్లా అధ్యక్షుడు లెక్కల జోగిరామిరెడ్డి, ఆర్సీపీ నాయకులు శేఖర్, లింగమూర్తి, మగ్బూల్ భాష, విద్యార్దులు పాల్గొన్నారు. -
మళ్లీ మంటలు.. భద్రతా వలయంలో అయోధ్య!
అయోధ్య: లోక్‌సభ ఎన్నికల్లోపే ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఆలస్యం అవుతున్నందున కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా గుడి కట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆదివారం అయోధ్యలో ధర్మ సభ పేరుతో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. శివసేన పార్టీ కూడా ఆదివారమే అయోధ్యలో భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. దీంతో అయోధ్యలో 1992 నాటి ముస్లింలపై దాడి ఘటనలు మళ్లీ పునరావృతమవ్వొచ్చనే ఆందోళనతో అనేక మంది ముస్లింలు తమ ఇళ్లలోని ఆడవాళ్లను, పిల్లలను ఇతర ప్రాంతాలకు పంపించారు. కాగా, ఇవన్నీ బీజేపీ ఎన్నికల గిమ్మిక్కులనీ, లోక్‌సభ ఎన్నికలలోపు ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు రాదు కాబట్టి హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ అనుబంధ సంస్థలు ఇలాంటి చర్యలకు దిగుతున్నాయని కొందరు స్వామీజీలు సైతం విమర్శిస్తున్నారు. శారదా ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర మాట్లాడుతూ మతపరమైన కట్టడాల నిర్మాణం ప్రభుత్వాల బాధ్యత కాదనీ, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించి రాజకీయ లబ్ధి పొందడానికే ఇదంతా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ధర్మ సభ విషయంలో జోక్యం చేసుకోవాలనీ, అవసరమైతే ఆర్మీని రంగంలోకి దించి భద్రత కల్పించాలని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సుప్రీంకోర్టు ను కోరారు. అయోధ్యలో తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు పెంచుతున్న మూడో కార్యక్రమం ఇది. 1992లో కరసేవకులు బాబ్రీ మసీదు కూల్చినప్పుడు, ఆ తర్వాత 2002 మార్చిలో మందిర నిర్మాణం కోసం శిలాదాన్ జరిగినప్పుడు కూడా అయోధ్యలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ధర్మసభకు మూడు లక్షల మందికి పైగా ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలు హాజరవుతారని సమాచారం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ధర్మసభ తర్వాత కూడా ప్రభుత్వం ఆర్డినెన్స్ తేకుంటే జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో అలహాబాద్‌లో ధర్మ సంసద్‌ను నిర్వహించి మందిర నిర్మాణంపై కేంద్రంతో ఆరెస్సెస్ తాడోపేడో తేల్చుకోనుంది. కుంభకర్ణుడి నిద్ర నుంచి కేంద్రం లేవాలి: ఠాక్రే ధర్మసభ కోసం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ‘కలియుగ కుంభకర్ణుడు (ప్రధాని మోదీ లేదా ఆయన ప్రభుత్వం) నాలుగేళ్లుగా నిద్రపోతూనే ఉన్నాడు. నిద్ర నుంచి లేచి కేంద్రం వెంటనే రామాలయ నిర్మాణ తేదీలను ప్రకటించాలి. గుడి కట్టేందుకు చట్టమో, ఆర్డినెన్సో తేవాలి. అందుకు మా పార్టీ మద్దతు ఉంటుంది. ముందు తేదీ చెప్పిన తర్వాతే మిగతావి మాట్లాడాలి’ అని కోరారు. శివసే న మహారాష్ట్ర నుంచి దాదాపు 3,000 మంది కార్యకర్తలను అయోధ్యకు తీసుకొచ్చినట్లు సమాచారం. డ్రోన్లు, అదనపు బలగాలతో భద్రత ధర్మసభ నేపథ్యంలో అయోధ్య భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ఫైజాబాద్ జిల్లా యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లను చేసింది. అయోధ్యలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించింది. పట్టణంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. డ్రోన్ల సాయంతో నిరంతర గస్తీ నిర్వహిస్తారు. 10 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు, 42 కంపెనీల పీఏసీ, ఐదు కంపెనీల ఆర్ఏఎఫ్, ఏటీఎస్ బలగాలను మోహరించినట్టు అయోధ్య ఏఎస్పీ సంజయ్ కుమార్ వెల్లడించారు. ఒక అదనపు డీజీపీ, ఒక డీఐజీ, ముగ్గురు సీనియర్ ఎస్పీలు, 10 మంది అదనపు ఎస్పీలు, 21 మంది డెప్యూటీ ఎస్పీలు, 160 మంది ఇన్స్పెక్టర్లు, 700 మంది కానిస్టేబుళ్లు కూడా ప్రత్యేక విధుల్లో ఉన్నారు. సరయూ నది మీదుగా కూడా పరిస్థితుల్ని సమీక్షించడానికి బలగాల్ని మోహరించారు. ప్రశాంతంగా బతకనివ్వండి: ముస్లిం పిటిషనర్ ధర్మసభకోసం ప్రభుత్వం చేసిన భద్రతా ఏర్పాట్లు తనకు సంతృప్తినిస్తున్నాయని బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఇక్బాల్ అన్సారీ అన్నారు. అయితే, ఏమైనా సమస్యలుంటే వాటి పరిష్కారానికి లక్నోకో, ఢిల్లీకో వెళ్లాలి. అయోధ్యలో ఏం పని? ఇక్కడి ప్రజలను ప్రశాంతంగా బతకనివ్వండి’ అని అన్సారీ పేర్కొన్నారు. ‘అయోధ్యలోని 5 వేల మంది ముస్లింలలో 3,500 మంది ప్రాణభయంతో వెళ్లిపోయారు’ అని వెల్లడించారు. మరోవైపు రామాలయం అంశం ఇంకా కోర్టులో ఉన్నప్పటికీ వీహెచ్‌పీ ధర్మ సభ నిర్వహిస్తోందనీ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. ఆరెస్సెస్ నాలుగంచెల వ్యూహం లోక్‌సభ ఎన్నికల్లోపే రామాలయాన్ని నిర్మించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆరెస్సెస్ నాలుగు అంచెల వ్యూహాన్ని రచించింది. అవి.. మొదటి దశ: నవంబర్ 25న దేశవ్యాప్తంగా 153 ప్రాంతాల్లో సభలు. అయోధ్య, నాగపూర్, బెంగళూరులో ధర్మసభలు. రెండో దశ: ఆర్డినెన్స్ కోసం ఎంపీలపై ఒత్తిడి పెంచేందుకు పార్లమెంటు నియోజకవర్గాల్లో కార్యకర్తలు, సాధువులతో సభల ఏర్పాటు. మూడో దశ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు, డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ. నాలుగో దశ: డిసెంబర్ 18 నుంచి 27 వరకు మందిర నిర్మాణానికి దేశవ్యాప్త ఉద్యమం. యజ్ఞయాగాలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. అయోధ్య వీధుల్లో భద్రతా సిబ్బంది పహారా -
మంగపేటలో వైఎస్ఆర్సీపీ రైతు పోరుబాట
-
దేశ భక్తి పెంపొందించేందుకే ‘తిరంగా యాత్ర’
మహారాష్ట్ర ఫారెస్టు కార్పొరేషన్ చైర్మన్ చందన్ సింగ్ చందెలాజీ బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ఆసిఫాబాద్ : ప్రజల్లో దేశ భక్తి పెంపొందించేందుకే ప్రధాని నరేంద్ర మోదీ తిరంగా యాత్ర ప్రారంభించారని మహారాష్ట్ర ఫారెస్టు కార్పొరేషన్ చైర్మన్ చందన్ సింగ్ చందెలాజీ అన్నారు. గత నెల 15 నుంచి ఈ నెల 17 వరకు దేశ వ్యాప్తంగా చేపడుతున్న తిరంగా యాత్రను పట్టణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి గాంధీచౌక్, వివేకానందచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. శిశుమందిర్ విద్యార్థులు దేశ స్వాతంత్ర సమర యోధుల వేషధారణ, భగత్ సింగ్ వేష«ధారణతో గుర్రంపై ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చందన్ సింగ్, రాజూర ఎమ్మెల్యే సంజయ్ ధోటేజి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు దండనాయకుల గోపాల్ కిషన్ రావు, దండనాయకుల శ్రీనివాస రావులను శాలువలు, పూల దండలతో సన్మానించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో మతి చెందిన బీజేపీ నాయకుడు ఇరుకుల్ల కిషోర్ కుటుంబీకులకు ప్రధాన మంత్రి భీమాయోజన పథకం కింద రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోనగిరి సతీశ్ బాబు, సీనియర్ నాయకులు ఈదులవాడ మారుతి, మండల పార్టీ అధ్యక్షుడు ఖాండ్రే విశాల్, చంద్రకాంత్, కొలిపాక వేణుగోపాల్, విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు కర్నాగౌడ్, వార్డు సభ్యురాలు కోట సునిత, కోట వెంకన్న, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
జయహో సింధు..
అచ్యుతాపురం: డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం గురుకుల పాఠశాల విద్యార్థినులు జయహో సింధు.. ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి అచ్యుతాపురం కూడలి వరకూ ర్యాలీచేసి మానవహారం ఏర్పడ్డారు. ఒలింపిక్స్‌లో రజిత పథకం సాధించి సింధు హైదరాబాద్‌కు చేరుకున్న సందర్భంగా సామూహిక స్వాగతాంజలి సమర్పించారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఇకనైనా ప్రభుత్వాలు స్టేడియాల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. విద్యార్థుల్లో క్రీడాస్పూర్తి ఉన్నప్పటికీ మైదానం, క్రీడాసామగ్రి లేని కారణంగా వెనకబడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పాఠశాలల్లో ఆటలకు ప్రాధాన్యం కల్పించాలని, మండల కేంద్రాల్లో మినీ స్టేడియాల నిర్మాణం చేపట్టాలన్నారు. తెలుగుతేజం సింధు దేశానికి ఖ్యాతిని తీసుకురావడం గర్వకారణంగా ఉందని పలువురు వక్తలు కొనియాడారు. -
నిందితులను అరెస్టు చేయాలి
లోకేశ్వరం : అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపర్చిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌వాఘ్మారే అన్నారు. గురువారం మండలంలోని రాయపూర్‌కాండ్లీ గ్రామ పంచాయతీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 6న మండలంలోని రాయపూర్‌కాండ్లీలో గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి లోకేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వరకు మండలంలోని అన్ని గ్రామాల అంబేద్కర్ సంఘాల సభ్యులతో కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. మండలంలోని దళిత సంఘాల నాయకులు తరలి రావాలని కోరారు. అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిరిధర్ జాంగ్మే, ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్ జాడే, తాలూకా యూత్ అధ్యక్షుడు గౌతం పింగ్లే, అంబేద్కర్ మండల ప్రధాన కార్యదర్శి దండే రమేష్, నాయకులు సుదర్శన్‌రెడ్డి, రత్నయ్య పాల్గొన్నారు. -
అవమానానికి నిరసనగా రాస్తారోకో
భైంసారూరల్: లోకేశ్వరం మండలం రాయపూర్‌కాండ్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించడాన్ని నిరసిస్తూ సోమవారం భైంసాలో రాస్తారోకో నిర్వహించారు. బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు కలిసి రాస్తారోకోలో పాల్గొన్నారు. ఇలాంటి సంఘటనలు చేస్తున్న వారిపై ^è ట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంటపాటు రాస్తారోకో జరగడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఈ చర్యకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకునితీరాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్‌ను అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం నినాదాలు చేస్తూ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భీంచంద్రే, సదానందం, జితేంధర్, సునీల్ తదితరులు ఉన్నారు.