అవమానానికి నిరసనగా రాస్తారోకో | agitation against blame | Sakshi
Sakshi News home page

అవమానానికి నిరసనగా రాస్తారోకో

Published Mon, Aug 1 2016 7:05 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

agitation against blame

భైంసారూరల్‌: లోకేశ్వరం మండలం రాయపూర్‌కాండ్లి గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని అవమానించడాన్ని నిరసిస్తూ సోమవారం భైంసాలో రాస్తారోకో నిర్వహించారు. బస్టాండ్‌ వద్ద ప్రధాన రహదారిపై దళిత సంఘాలు, అంబేద్కర్‌ యువజన సంఘాలు కలిసి రాస్తారోకోలో పాల్గొన్నారు. ఇలాంటి సంఘటనలు చేస్తున్న వారిపై ^è ట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గంటపాటు రాస్తారోకో జరగడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఈ చర్యకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకునితీరాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం నినాదాలు చేస్తూ బస్టాండ్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భీంచంద్రే, సదానందం, జితేంధర్, సునీల్‌ తదితరులు ఉన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement