మాట్లాడుతున్న భరత్ వాఘ్మారే
లోకేశ్వరం : అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపర్చిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌వాఘ్మారే అన్నారు. గురువారం మండలంలోని రాయపూర్‌కాండ్లీ గ్రామ పంచాయతీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 6న మండలంలోని రాయపూర్‌కాండ్లీలో గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి లోకేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వరకు మండలంలోని అన్ని గ్రామాల అంబేద్కర్ సంఘాల సభ్యులతో కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. మండలంలోని దళిత సంఘాల నాయకులు తరలి రావాలని కోరారు. అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిరిధర్ జాంగ్మే, ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్ జాడే, తాలూకా యూత్ అధ్యక్షుడు గౌతం పింగ్లే, అంబేద్కర్ మండల ప్రధాన కార్యదర్శి దండే రమేష్, నాయకులు సుదర్శన్‌రెడ్డి, రత్నయ్య పాల్గొన్నారు.