దేశభక్తిని చాటిన తిరంగా యాత్ర
దేశభక్తిని చాటిన తిరంగా యాత్ర
Published Mon, Aug 15 2016 1:19 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
అనంతపురం కల్చరల్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన తిరంగా యాత్ర ఆద్యంతం దేశభక్తిని చాటింది. యువకేంద్ర యూత్ కోఆర్డినేటర్ శివకుమార్ నేతృత్వంలో యాద్ కరో ఖుర్బాని పేరిట త్రివర్ణ పతాకంతో కార్యక్రమం జరిగింది. వందలాది మంది యువతీ యువకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, కార్పోరేషన్ కార్యాలయం, ఎలే్కపి మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, మేయర్ స్వరూప, డిప్యూటీ మేయర్ గంపన్న తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యులు కావాలని, తమ తెలివితేటలను, శక్తియుక్తులను దేశ ప్రగతి కోసం ఉపయోగించాలని వక్తలు పిలుపునిచ్చారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు కల్లూరు సుబ్బారావు వారసుడైన కల్లూరి ఆదినారాయణను ఘనంగా సత్కరించారు. అంతకు ముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర డీడీఓ శ్రీనివాసులు, సాయి సంస్థ అధ్యక్షులు విజయ్‌సాయికుమార్, యోగా గురువులు సాయి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement