‘స్మార్ట్‌’గా దోచేశారు! | smart phone fraud | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్‌’గా దోచేశారు!

Aug 17 2016 6:46 PM | Updated on Sep 4 2017 9:41 AM

పార్శిల్‌లో వస్తువులు చూపుతున్న రాజు

పార్శిల్‌లో వస్తువులు చూపుతున్న రాజు

ఆఫర్‌లో తక్కువ ధరకే మొబైల్‌ ఫోన్‌ ఇస్తామంటూ పనికి రాని వస్తువులు పంపించి తనను మోసం చేశారని మండలంలోని నమ్లిమేట్‌ గ్రామానికి చెందిన రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

నారాయణఖేడ్‌: ఆఫర్‌లో తక్కువ ధరకే మొబైల్‌ ఫోన్‌ ఇస్తామంటూ పనికి రాని వస్తువులు పంపించి తనను మోసం చేశారని మండలంలోని నమ్లిమేట్‌ గ్రామానికి చెందిన రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తన మొబైల్‌ ఫోన్‌కు ఇటీవల ఓ ఫోన్‌ వచ్చిందని, రూ. 18వేల విలువ చేసే టచ్‌ స్క్రీన్‌ ఫోన్‌ను రూ.3,500లకే అందజేస్తామంటూ వివరించారని అన్నారు.

దీంతో తాను నమ్మి ఫోన్‌లోనే ఆర్డర్‌ ఇచ్చి తన ఇంటి అడ్రస్‌ ఇచ్చినట్లు తెలిపారు. కాగా తన పేర హన్మంత్‌రావుపేట పోస్టాఫీస్‌కు పార్శిల్‌ వచ్చిందని, వారు కోరిన విధంగా రూ.3,500లు చెల్లించి పార్శిల్‌ను తీసుకున్నట్లు చెప్పారు. దాన్ని విప్పిచూడగా కుభేర యంత్రం, దేవుళ్ల ఫొటోలు ఉన్నాయన్నారు. ఇవన్నీ రూ.500ల విలువ కూడా చేయవని తెలిపారు. దీంతో తాను మోసపోయానని బాధితుడు రాజు ఆవేదన వ్యక్తంచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement