company fraud
-
కూకట్పల్లి: క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం..
సాక్షి, హైదరాబాద్: క్రిప్టో కరెన్సీ పేరుతో నగరంలో కూకట్‌పల్లిలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. XCSPL కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసానికి పాల్పడింది. దీంతో బాధితులు కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. కూకట్పల్లిలోకని XCSPL కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో కోట్ల రూపాయలు దండుకుంది. రూ. లక్షకు నాలుగు లక్షలు రూపాయలు ఇస్తామని బాధితులకు ఆశ చూపించి వారిని మోసం చేసింది. ఏకంగా 90 రోజుల్లోనే వారు పెట్టిన పెట్టుబడికి నాలుగు రేట్లు ఎక్కువగా ఇస్తామని డబ్బులు వసూలు చేసింది. దీంతో, బాధితులు.. అప్పుచేసి, లోన్ తీసుకుని, క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. తీరా.. కంపెనీ వారికి డబ్బు చెల్లించకపోవడంతో అసలు మోసం బయట పడింది. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం, మంజీరా మాల్లోని ఆఫీసు ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
‘స్మార్ట్’గా దోచేశారు!
నారాయణఖేడ్: ఆఫర్లో తక్కువ ధరకే మొబైల్ ఫోన్ ఇస్తామంటూ పనికి రాని వస్తువులు పంపించి తనను మోసం చేశారని మండలంలోని నమ్లిమేట్ గ్రామానికి చెందిన రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తన మొబైల్ ఫోన్‌కు ఇటీవల ఓ ఫోన్ వచ్చిందని, రూ. 18వేల విలువ చేసే టచ్ స్క్రీన్ ఫోన్‌ను రూ.3,500లకే అందజేస్తామంటూ వివరించారని అన్నారు. దీంతో తాను నమ్మి ఫోన్లోనే ఆర్డర్ ఇచ్చి తన ఇంటి అడ్రస్ ఇచ్చినట్లు తెలిపారు. కాగా తన పేర హన్మంత్‌రావుపేట పోస్టాఫీస్‌కు పార్శిల్ వచ్చిందని, వారు కోరిన విధంగా రూ.3,500లు చెల్లించి పార్శిల్‌ను తీసుకున్నట్లు చెప్పారు. దాన్ని విప్పిచూడగా కుభేర యంత్రం, దేవుళ్ల ఫొటోలు ఉన్నాయన్నారు. ఇవన్నీ రూ.500ల విలువ కూడా చేయవని తెలిపారు. దీంతో తాను మోసపోయానని బాధితుడు రాజు ఆవేదన వ్యక్తంచేశారు. -
సెల్‌ఫోన్ పేరుతో ఘరానా మోసం
కొరుటూరు (ఇందుకూరుపేట) : తక్కువ ధరకే విలువైన సెల్‌ఫోన్ ఇస్తామని ఓ సంస్ధ ఒక యువకుడిని మోసం చేసింది. మండలంలోని కొరుటూరుకు చెందిన షేక్ దావూద్‌కు ఓ మహిళ ఫోన్ చేసి తాము ఎస్ఎస్ లైఫ్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని, కంపెనీ ఆఫర్ మీద రూ.3,500 చెల్లిస్తే రూ.15 వేల విలువ చేసే సెల్‌ఫోన్ మీ ఇంటికే పోస్టుద్వారా పంపుతామని నమ్మబలికింది. దీంతో నమ్మిన దావూద్ అందుకు అంగీకరించి సెల్‌ఫోన్ పంపాలని తన చిరునామా ఇచ్చి కోరారు. శుక్రవారం పోస్ట్‌లో ఇంటికి వచ్చిన పార్శిల్‌కు రూ.3,500 చెల్లించి తీసుకున్నాడు. తీరా పార్శిల్ బాక్సును విప్పి చూడగా అందులో సేవింగ్ రీజర్, లైట్ ఇండికేటర్, బాడీ క్రీం మాత్రమే ఉన్నాయి. కనీసం మూడు వందల రూపాయలు కూడా విలువ చేయని ఈ సామాన్లు చూసి నివ్వెర పోయాడు. ఇదేమిటని తనకు ఫోన్ వచ్చిన 88850 41759 నంబరు కాల్ చేయగా హేళనగా మాట్లాడంతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఆట పట్టించారని వాపోయాడు. తనకు వచ్చిన పార్శిల్ అడ్రస్ చూడగా ఎస్ఎస్ లైఫ్‌కేర్, నం 300 కాంజేయ్నల్లూరు రోడ్, గాంధీనగర్, వెల్లూరు-632006, కాట్పాడి, తమిళనాడు అని ఉందని, తాము మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలిపారు.