ఖేడ్ ను అవమానించొద్దు: పొన్నం | ponnam prabhakar fire on hareesh rao | Sakshi
Sakshi News home page

ఖేడ్ ను అవమానించొద్దు: పొన్నం

Published Thu, Feb 11 2016 3:58 AM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

ఖేడ్ ను అవమానించొద్దు: పొన్నం - Sakshi

ఖేడ్ ను అవమానించొద్దు: పొన్నం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రమంత్రిగా ఉంటూ రెండేళ్లుగా నారాయణఖేడ్‌ను పట్టించుకోని హరీశ్‌రావు ఇప్పుడు దత్తత తీసుకుంటామంటూ అవమానిస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నారాయణఖేడ్ నీటి ఎద్దడికి మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిలే కారణమని ఆరోపించారు. సింగూరు జలాలను నిజాంసాగర్‌కు తరలించడం వల్ల నారాయణఖేడ్‌లో తాగునీటికి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. నారాయణఖేడ్ ప్రజలకు తాగునీరు కూడా లేకుండా చేసిన హరీశ్‌రావు, ఇప్పుడు దత్తత తీసుకుంటానని అనడం మోసమని పొన్నం విమర్శించారు. నారాయణఖేడ్‌ను దత్తత తీసుకుంటానని చెప్పడం ద్వారా అక్కడ ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి అసమర్థుడని చెప్పడమే అవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement