'హరీష్‌.. ఒళ్లు దగ్గర పెట్టుకో' | congress leader ponnam prabhakar slams minister harish rao | Sakshi
Sakshi News home page

'హరీష్‌.. ఒళ్లు దగ్గర పెట్టుకో'

Published Thu, Feb 9 2017 4:46 PM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM

'హరీష్‌.. ఒళ్లు దగ్గర పెట్టుకో'

'హరీష్‌.. ఒళ్లు దగ్గర పెట్టుకో'

హైదరాబాద్‌: తెలంగాణ భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌ రావు ఒళ్లు దగ్గర పెట్టుకుని నడుచుకోవాలని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి పదవి కాపాడుకోవడం కోసం ప్రతిపక్షాలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ పై హరీష్‌ రావు తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు రాళ్లతో కొడతారు జాగ్రత్తని హెచ్చరిక చేశారు.
 
కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత తూములు నిర్మించి మేమే ప్రాజెక్టులు కట్టామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాయన్నారు. ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు హరీష్‌రావు సిద్ధమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులు చివరిదశలో ఉన్నవి కూడా పూర్తి చేయకుండా కాంగ్రెస్‌ పార్టీకి మంచిపేరు వస్తుందని తాత్సారం చేస్తున్నాయన్నారు. రెండున్నరేళ్లలో ఏ ఒక్క ప్రాజక్టయినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శంకుస్థాపన చేసిందా? అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement