పింగళి వెంకయ్యకు నివాళి | Tribute to pingali venkaiah | Sakshi
Sakshi News home page

పింగళి వెంకయ్యకు నివాళి

Published Tue, Aug 2 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

పింగళి వెంకయ్యకు నివాళి

పింగళి వెంకయ్యకు నివాళి

నడిగూడెం: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 140వ జయంతి కార్యక్రమాన్ని లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని రాజావారి కోటలో ఘన ంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు మాట్లాడారు. జాతీయ జెండాను పింగళి వెంకయ్య నాటి మునగాల పరగణాకు పాలనా కేంద్రమైన  నడిగూడెం రాజావారి కోటలో  రూపొందించారన్నారు. ఇక్కడ జాతీయ జెండా రూపొందడం మనం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జె.యల్లేశ్వరావు, రామ్‌తేజ, జె.నాగరాజు, గోపి, రంజిత్, అంజయ్య, దున్నా సురేష్, గంటెపంగు నడిపి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement