Pingali
-
ఫలితాలకు షార్ట్‌కట్స్ ఉండవు!
‘పనిలో షార్ట్ కట్స్ ఉండచ్చు. కానీ, ఫలితాలు అందుకోవాలంటే దీర్ఘకాలం ప్రయత్నించాల్సిందే’ అంటారు డాక్టర్ పింగళి ఉషారాణి. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ ఫార్మకాలజీలో డీఎమ్‌గా ఉన్న డాక్టర్ పింగళి ఉషారాణి చేసిన పరిశోధనలకు గాను ఇండియన్ సొసైటీ ఫర్ క్లినికల్ రీసెర్చ్ (ఐఎస్‌సీఆర్) నుంచి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా పాతికేళ్లుగా క్లినికల్ ఫార్మకాలజీలో తాను చేస్తున్న కృషి గురించి వివరించారామె ...‘మా వర్క్‌లో పేషెంట్ కేర్, రీసెర్చ్ రెండూ ఉంటాయి. గాంధీ, నిమ్స్ ఫార్మాస్యుటికల్ విభాగాలలో ఎలాంటి వర్క్ జరుగుతుందో బయటి వారికి తెలియదు. అకడమిక్ విభాగంలో విద్యార్థులకు పాఠాలు చెప్పి, పంపుతారు అనే ఆలోచనలో ఉంటారు. కానీ, దీని వెనకాల ప్రతిరోజూ పరిశోధన ఉంటుంది. విద్యార్థులకుప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి నిరంతర ప్రయత్నం ఉంటుంది.మందుల పనితీరుపై పరిశోధనలుకార్డియో, లివర్ చికిత్సలకు, నొప్పులకు వేసుకునే మందులు పేషంట్ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి... అనే అంశంపై పీహెచ్‌డి స్టూడెంట్స్‌తో కలిసి పరిశోధన చేశాం. దేశవ్యాప్తం గా ఉన్న ఫార్మకాలజీ స్టూడెంట్స్‌కి ప్రతియేటా ట్రైనింగ్ ఇస్తుంటాం. పరిశోధనలు చేయడానికి అన్ని మెడికల్ కాలేజీలకు సరైన పరికరాలు ఉండకపోవచ్చు. అందుకని అందరికీ అర్ధమయ్యే విధంగా మా పరిశోధనల ఫలితాలు తీసుకువస్తున్నాం. పాతికేళ్ల ప్రయాణంఈ రంగంలో నా వర్క్ మొదలు పెట్టినప్పుడు ఏదీ సులువుగా లేదు. ఒక్కోసారి 15–18 గంటలు వర్క్‌లో ఉండాల్సిన రోజులు ఉన్నాయి. పనికి షార్ట్‌కట్స్ ఉండచ్చు, ఫలితాలకు మాత్రం షార్ట్ కట్స్ ఉండవు అనేది తెలుసుకున్నాను. ప్రతి నిమిషమూ విలువైనదేఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ, సవాళ్లు ఉంటేనే మరింత బాగా పనిచేయగలం. ప్రస్తుతం ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పేషెంట్స్‌కు బ్లడ్ లెవల్స్‌లో మందుల వాడకం పైన వర్క్ చేస్తున్నాం. మన వర్క్‌ని ఎలా ప్రూవ్ చేసుకోవాలో ఒక ప్రణాళిక వేసుకుని, ఆపైన కృషి చేస్తూ పోతే మంచి గుర్తింపు వస్తుంది. మన వర్క్‌ని మనం బాగా ఇచ్చాం అనే సంతృప్తి కూడా దానికి తోడవుతుంది. నేర్చుకోవాలనే తపన ఏ వయసులోనైనా ఉండాలి’ అని వివరించారు ఉషారాణి. క్లినికల్ ఫార్మకాలజీలో డిఎమ్ అంటే ‘డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ లేదా డిఎమ్ ఇన్ క్లినికల్ ఫార్మకాలజీ’ అని కూడా పిలుస్తారు. ఈ రంగంలో పేషంట్ కేర్ – రీసెర్చ్ డెవలప్మెంట్ లో చేసిన ఇన్నేళ్ల కృషికి ఫలితంగా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ లభించింది. ఐఎస్‌సిఆర్ ప్రెసిడెంట్ పురస్కారంతో పాటు క్లినికల్ రీసెర్చ్‌లో భాగంగా అవార్డులు, ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. దేశీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లలో పాల్గొనే అవకాశాలూ లభించాయి. – డాక్టర్ పింగళి ఉషారాణి – నిర్మలారెడ్డి -
పింగళి వెంకయ్యకు నివాళి
నడిగూడెం: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 140వ జయంతి కార్యక్రమాన్ని లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని రాజావారి కోటలో ఘన ంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు మాట్లాడారు. జాతీయ జెండాను పింగళి వెంకయ్య నాటి మునగాల పరగణాకు పాలనా కేంద్రమైన నడిగూడెం రాజావారి కోటలో రూపొందించారన్నారు. ఇక్కడ జాతీయ జెండా రూపొందడం మనం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జె.యల్లేశ్వరావు, రామ్‌తేజ, జె.నాగరాజు, గోపి, రంజిత్, అంజయ్య, దున్నా సురేష్, గంటెపంగు నడిపి తదితరులు పాల్గొన్నారు. -
ఊగించే తూగించే పాట
నా పాట నాతో మాట్లాడుతుంది కేవలం 28 సినిమాలలో 300 పాటలు రాసి వాసికెక్కిన పదమాంత్రికుడు నా తండ్రి పింగళి. పింగళి ‘హలా’ పదంపై ఒక అపోహ ఉంది. ‘హలో’ ఆంగ్లపదాన్ని ‘హలా’గ మార్చి జగదేకవీరుని కథ సంభాషణల్లో కూర్చాడని. అది సరికాదు. శబ్దార్థ నిఘంటువులో ‘హలా’ అంటే అనుంగు చెలికత్తెను పిలిచే పిలుపు! తెలంగాణలో త్వరగా రా అనే సందర్భంలో ‘ఎల్లెం రా’ అంటారు. ఎల్లెం ఏ పదం నుండి మాండలికంగా పురుడుపోసుకుందని గవేషిస్తే ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో సుభద్ర పాడే పింగళి పాట పల్లవి ఇలా ఉంటుంది. ‘‘స్వాముల సేవకు వేళాయే/ వైళమ రారే చెలులారా’’ వైళమ అంటే వేగముగా అని అపుడనుకున్నాను. వైళం - పల్లీయుల గుండె గొంతుకలో నుండి ఎల్లెంగా పల్లవించింది. ‘దేవదాసు’లో సముద్రాల ‘కుడి ఎడమైతే’ పాటలో ‘‘లాహిరీ నడి సంద్రములోన లంగరుతో పనిలేదోయ్’’- ఇక్కడ లాహిరి అంటే హైస్కూల్ రోజుల్లో పడవ, నావ- అనుకునేవాణ్ణి. లహరి అంటే తరంగం అనీ, లాహిరి అంటే మత్తు అనీ మత్తు సంద్రంలో ఉన్న వాడికి లంగరెందుకనే అర్థం అని మా ‘అమ్మ’ చెప్పింది తర్వాత. గుణసుందరి మాట - పాటలతో గుర్తింపు పొంది ‘పాతాళభైరవి’ స్టార్ రైటర్‌గా మారి ‘మాయాబజార్’తో లెజెండ్ అయ్యాడు పింగళి. ఇంతకీ నాతో మాటాడుతున్న పాట ‘మాయాబజార్’లోని ‘లాహిరి-లాహిరి-లాహిరి’లో. సంగీతం ఘంటసాల. అభిమన్యు ఏయన్నార్, శశిరేఖ సావిత్రి. సన్నివేశం ఒకే పాటలో అర్జునుడు - శశిరేఖ, శ్రీకృష్ణుడు- రుక్మిణి, బలరాముడు - రేవతి నౌకావిహారం చేయాలి. ఇక్కడ మధువు మత్తు కాకుండ - వధువు మత్తు వలపు మత్తును లాహిరిగా మలుచుకున్నాడు పింగళి. మత్తులో ఉన్నవారు ఊగాలి - తూగాలి. కాని వలపు లాహిరిలో ఉన్నవారిని చూసి జగమునే ఊగించి తూగించారు పింగళి. ఆ జగము ఊగేది తూగేది తారాచంద్రుల విలాసాల పరవడిలో వరవడిలోనట. చంద్రుని వెన్నెలకు నీటి పరవళ్లకు సైంటిఫిక్ రీజన్ ఉంది. అదీ తెలుసు శాస్త్రీయ పింగళికి. ముల్లును ముద్దాడినా రక్తం కళ్ల చూస్తుంది. పూవును కాలితో నలిపినా సుగంధాన్ని అద్దుతుంది. కనుకనే... పూలవలపుతో పుట్టుకతో ఏ సువాసన కూడా తెలియని పిల్లవాయువుకు ఘుమఘుమ సొంతమైంది. అందుకే పూలవలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో.... అన్నాడు. సచిన్ మాంచి ‘ఊపులో’ ఉన్నాడంటాం. అలల ‘ఊపు’ తియ్యని తలపులను చెలరేగిస్తుంది. ఆ కలకలలో మిలమిలలో ప్రేమ నౌకావినోదం సాగుతుంది. ఇలాగ వెన్నెల్లో సెలయేరులో ఉత్తినౌకకు అభిమన్యు శశిరేఖల ప్రేమను అంటించి ప్రేమనౌకను చేశాడు పింగళి. తరువాతి చరణాల్లో శ్రీకృష్ణ రుక్మిణులు ఈ నౌకలో చేరుతారు. అభిమన్యు శశిరేఖలు వలపులూరుతున్న చిగురు యువప్రాయులు. శృంగార రసవత్క్రీడ ఫలరుచి తెలియని అస్కలిత ప్రణయమూర్తులు. రుక్మిణీ శ్రీకృష్ణులు- దంపతులు- రాసక్రీడారుచి రాత్రులకొద్దీ - కౌగిళ్లకొద్దీ అనుభవించిన వారు. ప్రౌఢానంద పరవశతలెరిగిన పరిణత మనస్సుకలవారు. కనుక రెండో చరణాన్ని మరింతగా ఉసిగొలుపుతూ రాశాడు పింగళి. రసమయమైన జగాన్ని రాసక్రీడకు ఈ మధురిమ ఉసిగొలిపిందట. ఏకాంతంగా ఉన్న ఆలుమగలు ఆరంభించే ప్రతి సంభాషణ కొసమెరుపు శృంగారపు అల్లరింపుకు దారితీస్తుందన్న రహస్యం ఈ ఆజన్మాంత ‘కవిబ్రహ్మ’చారికి ఎలా తెలిసిందో! ఇక్కడో విషయం చెప్పాలి. ‘మిస్సమ్మ’లో ఒక పాట ‘ఏమిటో ఈ మాయ’... అందులో పింగళి ‘వినుటయె కాని వెన్నెల మహిమలు అనుభవించి నేనెరుగనయా’ అని రాస్తే, అందరు అద్భుతం అంటే ‘చక్రపాణి’ రచయిత, నిర్మాత, పర్యవేక్షకులు ‘‘బ్రహ్మచారికి ఏముంటుందయ్య అనుభవం. అందుకే అలా రాశాడు’’ అన్నాట్ట. అల్లరి మనములు ఝల్లుమనిపించే చల్లని దేవుని అల్లరిలో... వాయుదేవుడిని ‘చల్లని దేవుడిగా’ తెలుగించిన ఈ తెల్లవారు వెలుగంత చల్లని తెలుగింటి పాట దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అశోక్ తేజా అంటూ పింగళి రచనా లాహిరీలోకి లాహిరి లాహిరి లాహిరిలో అంటూ తల్లీనమైపోయింది. మోహన్‌బాబు ‘పోస్ట్‌మెన్’ చిత్రం కోసం పింగళి స్ఫూర్తిగా లాహిరిని ముమ్మారు ప్రయోగిస్తూ ‘లాహిరి లాహిరి లాహిరి నన్ను అల్లుకుంది చెలి మాధురి’ పాట రాశారు అశోక్‌తేజ. డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత