విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న వెంకయ్య
శివ్వంపేట: డివిజన్ పరిదిలోని చెరువుల్లో 2కోట్ల25లక్షల చేప పిల్లలను పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నట్టు మెదక్ డివిజన్ మత్స్యకార అదికారి ఎం.వెంకయ్య అన్నారు. సోమవారం శివ్వంపేటలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతు వర్షాలు సమృద్దిగా కురిసినందున గ్రామాల్లోని చెరువుల్లో జలకల సంతరించుకుందని చేపలపై జీవనోపాది పొందుతున్న మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం చేప పిల్లలను ప్రతి చెరువులో వేయడం జరుగుతుందన్నారు.
మెదక్ డివిజన్ పరిదిలోని 300 చెరువుల్లో 2కోట్ల 25లక్షల బొచ్చ, రౌ, మిర్గ రకాల చేప పిల్లలను వదులుతున్నట్లు చెప్పారు. సోమవారం నుంచి గ్రామాల్లోని చెరువుల్లో చేప పిల్లలను వేయడం ప్రారంబించడం జరిగిందని చెప్పారు. డివిజన్ పరిదిలో తూప్రాన్ పెద్దచెరువు, పోచారం ప్రాజెక్టుల్లో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌యాదవ్ చేతుల మీదుగా చేపలను వదిలే కార్యక్రమం జరుగనుందన్నారు. చేపలను పెంచుకొని ఆర్థిక అభివృద్ది చెందాలని మత్స్యకారులకు ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో ఎంపిపి హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.