లఢక్: భూతల స్వర్గం కశ్మీర్.. అక్కడి లఢక్ పీఠభూమి అందాలు ఎంత చూసిన తనివితీరనివి. అలాంటి ప్రాంతాలను పర్యాటకుల నిర్లక్ష‍్యం కారణంగా మురికిగా మారుతున్నాయి. లఢక్‌ను పరిరక్షించుకోవాలని భావించి ఈ ప్రాంతాన్ని రామ్‌సర్ సైట్‌లో కూడా చేర్చారు. అయినప్పటికీ ఇటీవల ఓ యాత్రికుడు చేసిన పని చూస్తే చివాట్లు పెట్టకుండా ఉండలేరు. దీనికి సంబంధించిన దృశ్యాలను అటవీ అధికారి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
రామ్‌సైట్ అయినటువంటి త్సో కర్, త్సో మోరిరి సరస్సుల ప్రాంగణం ప్రశాంతతకు పెట్టింది పేరు. వలస పక్షుల కిలకిలరావాలతో అలరారుతుంది. అలాంటి ప్రాంతంలో ఓ యాత్రికుడు ఎస్‌యూవీతో భీబత్సం సృష్టించాడు. వేగంగా చక్కర్లు కొడుతూ ఆ ప్రాంతాన్ని దుమ్ము మయం చేశాడు. ఎస్‌యూవీ టైర్ల నుంచి లేచే దమ్ము దృశ్యాలు అక్కడి మేఘాలను తలపిస్తున్నాయి. ఈ వీడియోను మోఫుసిల్_మెడిక్ అనే ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో పంచుకున్నాడు. అది కాస్తా తెగ వైరల్ అయింది.
Shared by a fellow birder from #Ladakh... this stupidity is getting out of hand. This seemingly "barren" landscape is teeming with #life- and the short summer is when that life is at its peak. That too at a Ramsar Site! These idiots need to be named, shamed and booked!… pic.twitter.com/wRpYkkYf6p
— Mofussil_Medic (@Daak_Saab) July 9, 2023
ఈ వీడియోపై నెటిజన్లు ఫైరయ్యారు. పర్యటకుని నిర్లక్ష‍్యానికి తగిన బుద్ది చెప్పాలను సూచించారు. మూర్ఖత్వం తారాస్థాయికి చేరింది.. ఇలాంటి పర్యటకులను ఆ ప్రాంతంలోకి అనుమతించకూడదని మరో యూజర్ అన్నాడు. భూటాన్ లాగే లఢక్‌లో పర్యటకులకు భారీ ట్యాక్స్‌లను విధించాలని, ఇలాంటి ఘటనలపై భారీ జరిమానాలు వసూలు చేయాలని మరో వ్యక్తి కామెంట్ బాక్స్‌లో రాసుకొచ్చాడు.
ఇదీ చదవండి: శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు.. 2024 జనవరి నుంచి రామ్‌లాలా దర్శనభాగ్యం!
Comments
Please login to add a commentAdd a comment