
'అమరావతి అజరామరంగా నిలుస్తోంది'
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అమరావతి అజరామరంగా నిలుస్తోందన్నారు.
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అమరావతి అజరామరంగా నిలుస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోది అభివృద్ధి మంత్రంతో ప్రపంచం మొత్తం ప్రస్తుతం భారత్ వైపు చూస్తుందన్నారు. దేశం మాత్రం తెలుగురాష్ట్రాల వైపు చూస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. తెలుగు ప్రజల క్షేమం కోరుకునే వ్యక్తిగా తాను హామీల అమలుకు కృషి చేస్తానన్నారు.
స్వయానా భారత ప్రధాని నరేంద్రమోదీనే పార్లమెంట్ ప్రాంగణం నుండి మట్టిని, పవిత్ర యమునా నది నుండి నీటిని తీసుకొచ్చి నేను సైతం అంటూ రాజధాని నిర్మానానికి తీసుకొచ్చారని అన్నారు. శాతవాహనులు, ఇక్ష్వాకులు లాంటి గొప్ప రాజవంశాల పాలనకు వారసత్వంగా అమరావతి అజరామరమై నిలుస్తోందన్నారు.