దేశ ప్రధానిగా నరేంద్రమోదీ జూన్ 09న మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. మోదీ కొత్త ప్రభుత్వంలని కేంద్ర మంత్రి వర్గంలో చోటు పొందడం అంటే ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు లెక్క. చెప్పాలంటే దేశం అంతటని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి గొప్ప అవకాశాన్ని ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని గిరిజన నాయకురాలు సావిత్ర ఠాకూర్‌కి దక్కింది. ఇంతకీ ఎవరీమె..? ఆమెకు ఈ అవకాశం ఎలా దక్కిందంటే..
నరేంద్ర మోదీ జూన్ 09న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన తోపాటు 72 మంత్రలు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ప్రభుత్వంలోని మంత్రి వర్గంలో మధ్యప్రదేశ్‌లోని ధార్‌కు చెందిన 46 ఏళ్ల సావిత్రి ఠాకూర్ అనే గిరిజన నాయకురాలు చోటు దక్కించుకుంది. రాష్ట్రపతి భవన్ వేదిక జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఠాకూర్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె మధ్యప్రదేశ్‌లో దీదీ ఠాకూర్‌గా పేరుగాంచింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె గులాబీ రంగు చీర తోపాటు సంప్రదాయ గంచాను ధరించి వచ్చారు.
ఆమె ఎవరంటే..
దీదీ ఠాకూర్‌గా పేరుగాంచిన సావిత్రి ఠాకూర్‌కి రాజకీయ నేపథ్యం లేదు. ఆమె తండ్రి రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ కాగా, భర్త రైతు. పురుషాధిక ప్రపంచంలో అంచెలంచెలుగా పైకొచ్చింది. ఆమె సామాజికి కార్యకర్తలా మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్, ధార్ వంటి ప్రాంతాల్లోని గిరిజన మహిళలు, పేద మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. వారిని స్వయం సమృద్ధిగా మార్చడానికి రుణలు సేకరించడంలో తన వంతుగా సహాయసహకారాలు అందించింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి.. 2003లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరడం జరిగింది. అలా ఆమె జిల్లా పంచాయతీ మెంబర్‌గా ఎన్నికై.. అక్కడ నుంచి అంచెలంచెలుగా ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నారు.
ఆమె షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ) రిజర్వడ్ సీటుపై ధార్ నుంచి పోటీ చేసి బీజేపీకి మహళా గిరిజన నాయకురాలయ్యింది. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే 2019లో బీజేపీ టిక్కెట్ నిరాకరించడంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ పార్టీ పదవులను నిర్వహించింది. తదనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 2.18 లక్ష మెజార్టీ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రాధేశ్యామ్‌పై విజయం సాధించారు. గతంలో ఠాకూర్ బీజేపీలో జిల్లా ఉపాధ్యాక్షుడిగా ఉన్నారు. 2013లో ఆమె కృషి ఉపాజ్ మండి ధమ్నోద్ డైరెక్టర్‌గా, ఆదివాసీ మహిళా వికాస్ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా పలు ఉన్నత పదవులును అలంకరించారు.
గిరిజన నాయకురాలిగా ఆమె ప్రజలకు చేసిన సేవలకు గానూ బీజేపీ ఇలా కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఇచ్చి మరీ గౌరవించింది. కాగా, కేంద్ర మంత్రి మండలిలోని కొత్త మంత్రులు..కేంద్ర మాజీ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఎంపీలు అన్నపూర్ణా దేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నిముబెన్ బంభానియా, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ తదితరులు. అయితే వారిలో సీతారామన్, దేవిలకు క్యాబినేట్‌లో చోటు దక్కగా, మిగిలిన వారు సహాయ మంతులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 18వ లోక్‌సభలో కొత్తమంత్రి మండలిలో కేబినేట్ పాత్రలో ఇద్దరు తోసహా ఏడుగురు మహిళలు చేరారు. అయితే గతంలో జూన్ 05న రద్దయిన మంత్రిమండలిలో మాత్రం దాదాపు 10 మంది దాక మహిళా మంత్రులు ఉండటం విశేషం.
Savitri Thakur takes Oath of Office and Secrecy as Union Minister of State during the #SwearingInCeremony #OathCeremony #ShapathGrahan pic.twitter.com/E9NKSqQPET
— PIB India (@PIB_India) June 9, 2024
(చదవండి: మోదీ ప్రమాణా స్వీకారోత్సవంలో పాల్గొననున్న మహిళా లోకో పైలట్‌లు వీరే..!)
Comments
Please login to add a commentAdd a comment