tribal leaders
-
ఎవరీ సావిత్రి ఠాకూర్? ఏకంగా కేంద్ర మంత్రి వర్గంలో..!
దేశ ప్రధానిగా నరేంద్రమోదీ జూన్ 09న మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. మోదీ కొత్త ప్రభుత్వంలని కేంద్ర మంత్రి వర్గంలో చోటు పొందడం అంటే ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు లెక్క. చెప్పాలంటే దేశం అంతటని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి గొప్ప అవకాశాన్ని ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని గిరిజన నాయకురాలు సావిత్ర ఠాకూర్‌కి దక్కింది. ఇంతకీ ఎవరీమె..? ఆమెకు ఈ అవకాశం ఎలా దక్కిందంటే..నరేంద్ర మోదీ జూన్ 09న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన తోపాటు 72 మంత్రలు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ప్రభుత్వంలోని మంత్రి వర్గంలో మధ్యప్రదేశ్‌లోని ధార్‌కు చెందిన 46 ఏళ్ల సావిత్రి ఠాకూర్ అనే గిరిజన నాయకురాలు చోటు దక్కించుకుంది. రాష్ట్రపతి భవన్ వేదిక జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఠాకూర్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె మధ్యప్రదేశ్‌లో దీదీ ఠాకూర్‌గా పేరుగాంచింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె గులాబీ రంగు చీర తోపాటు సంప్రదాయ గంచాను ధరించి వచ్చారు.ఆమె ఎవరంటే..దీదీ ఠాకూర్‌గా పేరుగాంచిన సావిత్రి ఠాకూర్‌కి రాజకీయ నేపథ్యం లేదు. ఆమె తండ్రి రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ కాగా, భర్త రైతు. పురుషాధిక ప్రపంచంలో అంచెలంచెలుగా పైకొచ్చింది. ఆమె సామాజికి కార్యకర్తలా మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్, ధార్ వంటి ప్రాంతాల్లోని గిరిజన మహిళలు, పేద మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. వారిని స్వయం సమృద్ధిగా మార్చడానికి రుణలు సేకరించడంలో తన వంతుగా సహాయసహకారాలు అందించింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి.. 2003లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరడం జరిగింది. అలా ఆమె జిల్లా పంచాయతీ మెంబర్‌గా ఎన్నికై.. అక్కడ నుంచి అంచెలంచెలుగా ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నారు. ఆమె షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ) రిజర్వడ్ సీటుపై ధార్ నుంచి పోటీ చేసి బీజేపీకి మహళా గిరిజన నాయకురాలయ్యింది. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే 2019లో బీజేపీ టిక్కెట్ నిరాకరించడంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ పార్టీ పదవులను నిర్వహించింది. తదనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 2.18 లక్ష మెజార్టీ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రాధేశ్యామ్‌పై విజయం సాధించారు. గతంలో ఠాకూర్ బీజేపీలో జిల్లా ఉపాధ్యాక్షుడిగా ఉన్నారు. 2013లో ఆమె కృషి ఉపాజ్ మండి ధమ్నోద్ డైరెక్టర్‌గా, ఆదివాసీ మహిళా వికాస్ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా పలు ఉన్నత పదవులును అలంకరించారు. గిరిజన నాయకురాలిగా ఆమె ప్రజలకు చేసిన సేవలకు గానూ బీజేపీ ఇలా కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఇచ్చి మరీ గౌరవించింది. కాగా, కేంద్ర మంత్రి మండలిలోని కొత్త మంత్రులు..కేంద్ర మాజీ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఎంపీలు అన్నపూర్ణా దేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నిముబెన్ బంభానియా, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ తదితరులు. అయితే వారిలో సీతారామన్, దేవిలకు క్యాబినేట్లో చోటు దక్కగా, మిగిలిన వారు సహాయ మంతులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 18వ లోక్‌సభలో కొత్తమంత్రి మండలిలో కేబినేట్ పాత్రలో ఇద్దరు తోసహా ఏడుగురు మహిళలు చేరారు. అయితే గతంలో జూన్ 05న రద్దయిన మంత్రిమండలిలో మాత్రం దాదాపు 10 మంది దాక మహిళా మంత్రులు ఉండటం విశేషం. Savitri Thakur takes Oath of Office and Secrecy as Union Minister of State during the #SwearingInCeremony #OathCeremony #ShapathGrahan pic.twitter.com/E9NKSqQPET— PIB India (@PIB_India) June 9, 2024 (చదవండి: మోదీ ప్రమాణా స్వీకారోత్సవంలో పాల్గొననున్న మహిళా లోకో పైలట్లు వీరే..!) -
తెలుగుదేశానికి తుడుం దెబ్బ!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి గిరిజన అభ్యర్థుల నుంచి గట్టి దెబ్బ తగలనుంది. అల్లూరి జిల్లాలో పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. ఇప్పటికే పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, అరకు నుంచి దొన్నుదొర, అబ్రహంలు పోటీలో ఉంటామని ప్రకటించారు. అదే దారిలో రంపచోడవరం నియోజకవర్గం నుంచి వంతల రాజేశ్వరి కూడా రెబల్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. గిరిజనులను మోసం చేసిన తెలుగుదేశం పార్టీని అల్లూరి జిల్లాలో తుడిచిపెట్టేస్తామని హెచ్చరిస్తున్నారు. గిరిజనులంటే చిన్న చూపు ఉన్న తెలుగుదేశం పార్టీకి తమ సత్తా చాటుతామని.. నిన్ను నమ్మం బాబూ అంటూ ఎక్కడికక్కడ తీర్మానాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో అల్లూరి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిని చవిచూసింది. ఎంపీ ఎన్నికల్లో కూడా నామరూపాలు లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో మరింత గట్టిగా తెలుగుదేశం పార్టీకి తుడుం దెబ్బ రుచి చూపిస్తామని గిరిజనులు ఘంటాపథంగా హెచ్చరిస్తున్నారు. పార్టీలు మారినా ఫాయిదా లేదు..! వాస్తవానికి 2014 ఎన్నికల్లో పాడేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి ఈశ్వరి.. చంద్రబాబు వలలో చిక్కుకుని వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరారు. ఇక అరకు నుంచి గెలిచిన కిడారి సర్వేశ్వరరావు కూడా చంద్రబాబు మాటల మాయలో పడి పార్టీ మారారు. రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి కూడా అదే దారిలో వెళ్లారు. అయితే, ఈ దఫా ఎన్నికల్లో వీరిలో ఇద్దరికీ పక్కా సీటు అని చంద్రబాబు నమ్మించారు. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి పక్కాగా పోటీలో ఉంటానని నమ్మారు. ఇక రంపచోడవరం నుంచి రాజేశ్వరి కూడా తనకు ఎదురులేదని భావించారు. పార్టీ మారి వచ్చిన తమకు గౌరవం దక్కుతుందని ఊహించుకున్నారు. అరకు నుంచి దొన్నుదొరను అభ్యర్థిగా కూడా బహిరంగ సభ పెట్టి మరీ బాబు ప్రకటించారు. అయితే, తీరా ఎన్నికలు వచ్చే సమయానికి అరకు సీటును బీజేపీకి కేటాయించిన చంద్రబాబు.. మిగిలిన రెండు సీట్లలో కూడా తనను నమ్మి పార్టీ మారి వచ్చిన వారికి మొండిచేయి చూపారు. తమకు విలువ లేకుండా పోయిందని వారంతా మరింత కోపంతో రగిలిపోతున్నారు. నమ్మించి మోసం చేసిన బాబుకు తమ సత్తా చాటుతామని హెచ్చరిస్తున్నారు. నామరూపాలు లేకుండా చేస్తాం...! అల్లూరి జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క సీటునూ టీడీపీ దక్కించుకోలేదు. అరకు ఎంపీతో పాటు పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాలన్నింటిలోనూ ఓటమి చవిచూసింది. ఈ దఫా ఎన్నికల్లో ఎక్కడో ఒక్క సీటులోనైనా బోణీ చేయాలని భావించిన టీడీపీ అరకు నుంచి ముందుగానే దొన్నుదొరకు సీటు ఇస్తున్నట్టు ప్రకటించింది. దొన్నుదొరకు సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన ఆ పార్టీ మరో నేత అబ్రహం రెబల్‌గా బరిలో ఉంటానని ప్రకటించారు. అయితే, తీరా షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆ సీటును కూడా బీజేపీకి కేటాయించారు. ఈ నేపథ్యంలో అరకు నుంచి అటు అబ్రహంకు తోడు దొన్నుదొర కూడా చంద్రబాబు వ్యవహారశైలిపై మండిపడుతూ బరిలో ఉండనున్నట్టు ప్రకటించారు. నమ్మించి మోసం చేసిన చంద్రబాబును ఏజెన్సీ ప్రాంతాల్లో నామరూపాలు లేకుండా చేస్తామని గిడ్డి ఈశ్వరి శపథం చేస్తున్నారు. మరోవైపు సీటు కోల్పోయి కన్నీరు పెట్టుకున్న రంపచోడవరం నియోజకవర్గం నుంచి రాజేశ్వరి కూడా తమ సత్తా చూపి ఏజెన్సీల్లో సైకిల్ పార్టీకి సీటు లేకుండా చేస్తామని పేర్కొంటున్నారు. మొత్తంగా అల్లూరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి రెబల్ అభ్యర్థుల బెడద వెంటాడుతోంది. -
తండాల స్థాయి నుంచి కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం గిరిజన నేతలు కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ కోరారు. తండాల స్థాయి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. గాందీభవన్‌లో శనివారం జరిగిన ఆదివాసీ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. లోక్‌సభ అభ్యర్థులతో గిరిజన విభాగం సమ న్వయం చేసుకోవాలని, ప్రతి అసెంబ్లీ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని, పార్ల మెంట్ నియోజక వర్గాల వారీగా భారీ సభలను గిరిజనులతో ఏర్పాటు చేయాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీని ప్రధాని చేయడంలో గిరిజనులు ప్రధాన భూమిక పోషించాలన్నారు. ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ బెల్ల య్యనాయక్ మాట్లాడుతూ...అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన విధంగానే రాష్ట్రంలో 13–14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర వైస్ చైర్మన్ రఘు నాయక్, కోఆర్డినేటర్లు గణేశ్ నాయక్ పాల్గొన్నారు. -
కమలం పార్టీ శ్రేణుల్లో గుబులు.. నిధుల వాడకం వ్యాఖ్యలతో మైనస్ కానుందా?
ఒక సీటు కోసం ఒకే పార్టీలోని ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుంటే కొట్లాట తప్పదు. ఇప్పుడు ఆదివాసీల జిల్లాలోని కమలం పార్టీలో ఇదే జరుగుతోంది. అక్కడ ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కోసం బీజేపీలో కుస్తీపట్లు మొదలయ్యాయి. ఆదివాసీ ఎంపీ, గిరిజన నేతల మధ్య ఫైట్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కమలం పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎంపీ సోయం బాపురావు ఎంపీ ల్యాడ్స్ నిధుల దుర్వినియోగ వివాదం అటు జిల్లాలో, ఇటు పార్టీలో తీవ్ర దుమారం రేపింది. ఎంపీకి కేటాయించిన నిధుల వినియోగంపై బీజేపీ ప్రజా ప్రతినిధులతో సోయం బాపురావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ల్యాడ్స్ నిదులు ఇంటి నిర్మాణం కోసం, కొడుకు పెళ్లి కోసం వాడుకున్నట్లు చెప్పారు. ఆ వీడియో బయటకి వచ్చి మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిధుల వాడకంపై ఎంపీ వ్యాఖ్యలు పెను సంచలనానికి దారి తీసాయి. నిధుల దుర్వినియోగం పై ఎంపీ సోయం బాపురావు స్పందించారు. తాను ల్యాడ్స్ నిధులు వాడుకోలేదన్నారు.. ఇల్లు నిర్మాణం, కొడుకు పెళ్లి కోసం అణా పైసా వాడుకోలేదని స్పష్టం చేశారు. తాను నిధుల దుర్వినియోగానికి పాల్పడితే ఎంపీ పదవికి రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. పార్టీలోనే తనపై కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ చెప్పారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్ తనమీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తుంటే వారిద్దరికీ గిట్టడంలేదని విమర్శించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తాను ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నానని, అందుకే ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు తనను బీజేపీ నుంచి సాగనంపడానికి ఇదంతా చేస్తున్నారని ఎంపీ సోయం అన్నారు. అదే విధంగా తన ఎంపీ సీటుకు కూడా ఎసరు పెట్టేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మధ్య విభేదాలకు చాలా కారణాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఖానాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీచేయడానికి రమేష్ రాథోడ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒక విడత ప్రచారం కూడా పూర్తి చేసుకున్నారు. కాని అక్కడి నుంచి రమేష్ రాథోడ్ కాకుండా జడ్పీటీసీ జానుబాయి, హరి నాయక్‌లకు ఎంపీ సోయం మద్దతిస్తున్నారని సమాచారం. ఇక్కడి నుంచే ఇద్దరి మధ్యా విభేదాలు మొదలయ్యాయి. చదవండి: వేధింపుల ఎపిసోడ్.. సర్పంచ్ నవ్యకు నోటీసులు చివరికి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయట. అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ సీటు కోసం జిల్లా పరిషత్ చైర్మన్ సుహసిని రెడ్డి కూడా పోటీపడుతున్నారు. ఇక్కడ కూడా ఎంపీ బాపురావు జిల్లా అధ్యక్షుడికి మద్దతివ్వడంలేదట. వీరిద్దరి మధ్యా గతంలో ఒక భూ వివాదం కూడా చోటు చేసుకోవడంతో విభేదాలు మరింత ముదిరాయంటున్నారు. అయితే ఎంపీ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ స్పందించారు. తనపై ఎంపీ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఎంపీకి తనకు విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఎంపీని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎంపీతో కలిసి పనిచేయడానికి తాను సిద్దమన్నారు రమేష్ రాథోడ్. జిల్లాలో పార్టీ ఎంపీ, ఇతర నేతల మధ్య విభేదాలు కొనసాగితే ఫైనల్‌గా నష్టపోయేది పార్టీయేనని అక్కడి కాషాయ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య నేతల మధ్య విభేదాలు తొలగించాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నారు. -
Bhimbor Deori: భీంబర్ డియోరీ.. ఎవరో తెలుసా?
భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సంరంభంలో ఉన్న మనం ఈశాన్య భారత్‌కు చెందిన భీంబర్ డియోరీని గుర్తుచేసుకోవాలి. ఈయన అసోంను తూర్పు పాకిస్తాన్లో విలీనం చేసే ప్రయత్నాలను విఫలం చేసిన జన నాయకుడు. అలాగే స్వదేశీ వర్గాలను ఉద్ధరించడంలో, అసోం ప్రయోజనాలను పరిరక్షించడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి ఫలితంగా అసోం విధాన సభలో గిరిజనుల కొరకు 5 స్థానాలు రిజర్వు చేయబడ్డాయి. స్వాతంత్య్రేచ్ఛ ఆయన రక్తంలోనే ఉంది. ప్రత్యేక మాతృభూమి కోసం 1945 మార్చి 21– 23 మధ్య ‘ఖాసీ దర్బార్ హాల్ తీర్మానాలు’ చేశారు. ఈ తీర్మానాలతో వివిధ గిరిజన తెగలకు చెందిన స్థానిక నాయకులు తమ స్వతంత్ర మాతృభూమిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు. ఆయన 1903 మే 16న అసోంలోని శివసాగర్ జిల్లాలోని వనిదిహింగ్ గ్రామంలో గోదారం డియోరీ, బజోతి డియోరీ దంపతులకు జన్మించారు. సాధారణ గిరిజన యువకుడైన భీంబర్ అసోం సివిల్ పరీక్షలో ప్రథమ స్థానం సంపాదించారు. కానీ ఈయన గిరిజనుడైనందున బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. పట్టుదలతో ఆయన డిబ్రుగర్లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1933లో ‘అసోం బ్యాక్వర్డ్ ప్లెయిన్స్ ట్రైబల్ లీగ్’ని స్థాపించి దాని వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా పని చేశారు. 1941 జూన్ 18న వివిధ విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాలలో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులను జనరల్ డైనింగ్ హాల్లోకి అనుమతించమని పోరాడారు. 1946 జూలై 8న అసోం ప్రభుత్వంలో అటవీ, కార్మిక శాఖ మంత్రిగా నియమితులైనారు. అసోం ప్రజల హృదయాల్లో భీంబర్ డియోరీ ఆదివాసీల నాయకుడిగానేగాక, ఆదర్శ జననేతగా నిలిచి 1947 నవంబర్ 30న తనువు చాలించారు. – గుమ్మడి లక్ష్మీ నారాయణ ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి (నవంబర్ 30న భీంబర్ డియోరీ 75వ వర్ధంతి) -
Birsa Munda: ఆదివాసీల ఆరాధ్యదైవం
ఆదివాసీ ప్రజల హక్కుల కోసం పోరాడిన యువకిశోరం బిర్సా ముండా. ఆయనను తన జాతి ప్రజలు దేవునిగా కొలిచారు. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా ఉలిహత్ గ్రామంలో 1875 నవం బర్ 15న సుగుణ ముండా, కర్మిహాట్ దంపతులకు బిర్సా ముండా జన్మించాడు. ‘సాల్గా’ గ్రామంలో మేనమామ వద్ద ఉంటూ ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. అనంతం చయిబాసాలోని మిషనరీ పాఠశాలలో చేరాడు. ఇందుకోసం క్రైస్తవంలోకి మారాల్సి వచ్చింది. బిర్సా ముండా పేరు బిర్సా డేవిడ్ గా మారింది. అందులో చదువుకుంటూనే పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. అప్పట్లో ఆదివాసీల భూములపై బ్రిటిష్ పాలకులు అధిక పన్నులు వసూలు చేసేవారు. పన్ను చెల్లించని వారి ఆస్తులను లాక్కునేవారు. ఎదురు తిరిగిన వారిని నానా బాధలు పెట్టేవారు. బ్రిటిష్‌వాళ్ల బాధలు పడ లేక చాలామంది ఆదివాసీలు అస్సాంలోని తేయాకు తోటలలోకి కూలీలుగా వెళ్లేవారు. తమ భూములను తిరిగి చ్చేయాలని ఒకరోజు ముండా తెగ పెద్దలతో కలిసి బిర్సా తెల్ల దొరలపై ఒత్తిడి చేశాడు. దాంతో మిషనరీ పాఠశాల ఆయనను బహిష్కరించింది. దీన్ని సవాలుగా తీసుకున్న బిర్సా వారి ఎదుటే నుదుట నామం పెట్టి, జంధ్యం ధరించి, ఇకపై క్రైస్తవంలోకి ఒక్క ఆదివాసీని కూడా మారకుండా చూస్తానని ప్రతిన బూనాడు. బ్రిటిషర్ల వల్ల ముండా, సంథాల్, ఓరియన్, కోల్ జాతి తెగలు ఎప్పటికైనా ప్రమా దంలో పడే అవకాశం ఉందని భావించిన బిర్సా ప్రత్యేకంగా ‘బిర్సాయిత్’ మతాన్ని స్థాపించాడు. ఆయా తెగలకు ఆధ్యాత్మిక అంశాలు బోధించే వాడు. ఐకమత్యంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాడు. ప్రకృతి వైద్యంతో ఎంతోమంది ఆదివాసీలను కాపాడాడు. ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలు నచ్చిన ఆదివాసీలు బిర్సా ముండాను ధర్తీలబా(దేవుడు)గా కొలిచేవారు. తెల్లదొరలకు వ్యతిరేకంగా 1899 డిసెంబర్లో ఉల్ గులాన్ (తిరుగుబాటు) పేరిట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాడు. అందులో 7,000 మంది పాల్గొన్నారు. బిర్సా ఆచూకీ తెలపాలని ఆదివాసీలను నిర్బంధిస్తూ వారిపై దాడులకు దిగేవారు బ్రిటిష్‌వాళ్లు. వీటిని సహించని ఆయన అనుచరులు 1900 జనవరి 5న ఎట్కేడీ ప్రాంతంలో ఇద్దరు పోలీసులను చంపేశారు. దీనితో రగిలిపోయిన పోలీసులు ఆయన కోసం వేట ప్రారంభించి చివరికి 1900 ఫిబ్రవరి 3న జంకోపాయి అటవీ ప్రాంతంలో అరెస్టు చేసి రాంచీ జైలుకు తరలించారు. ఎప్పటికైనా తమకు ప్రమాదకారిగా మారతాడని భావించిన ప్రభుత్వం బిర్సా ముండాను 1900 జూన్ 9న విష ప్రయోగంతో చంపేసింది. బయటకు మాత్రం మలేరియాతో మరణించాడు అంటూ ప్రచారం చేసింది. ఇప్పటికీ ఆయన్ని జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఆదివాసీలు ‘భగవాన్ బిర్సా ముండా’గా పూజిస్తున్నారు. చనిపోయేటప్పుడు బిర్సాకు కేవలం 25 ఏళ్లు మాత్రమే. ఆయన ఉద్యమ ఫలితంగానే 1908లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఛోటా నాగపూర్ కౌలుదారుల హక్కు చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. (క్లిక్ చేయండి: నిజంగా భక్తులేనా? పైకి మాత్రమేనా?) – చింత ఎల్లస్వామి ఏబీవీపీ రాష్ట్ర పూర్వ సంయుక్త కార్యదర్శి (నవంబర్ 15న బిర్సా ముండా జయంతి) -
తమ హక్కుల రక్షణకు చర్యలు తీసుకోవాలంటున్న ఆదివాసీలు
-
బిర్సా స్ఫూర్తితో ముందుకు..
ఆదివాసీ పోరాటాల వారసత్వానికి ప్రతీకగా ఆవిర్భవించిన యోధుడు బిర్సాముండా. ఆదివాసీలపై జరుగుతున్న అణచివేతను చిన్నతనం నుంచీ చూసిన బిర్సాముండా అగ్రవర్ణాల దోపిడీపై గళం విప్పాడు. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై సమరశంఖం పూరించాడు. ఆదివాసీల ప్రాథమిక హక్కుల కోసం, జల్, జంగ్, జమీన్ కోసం విల్లంబులు అందుకుని పోరుబాటపట్టాడు. ఆంగ్లేయుల రాకతో విచ్ఛిన్నమైన ఆదివాసీ రాజ్యాలను చూసి తట్టుకోలేకపోయిన బిర్సాముండా నల్లదొరలతోపాటు, తెల్ల దొరలపైనా ఆయుధాలు ఎక్కుపెట్టాడు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సాగిన ‘మిలినేరియన్’ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. బిర్సాను దొంగచాటుగా బంధించిన తెల్లదొరలు 1900 జూన్ 9న రాంచీ జైలులో హతమార్చారు. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో బిర్సాముండా పోరాటం ఒక ప్రధాన ఘట్టం. నేటి పాలకవర్గ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా ఆదివాసీ సమాజాన్ని అంతం చేస్తోంది. పరి శ్రమలు, ప్రాజెక్ట్‌ల పేరు మీదు లక్షలాది ఆదివాసీ కుటుంబాలవారు నిర్వాసితులయ్యారు. దేశం లోని 570 గిరిజన తెగలలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ లెక్కల ప్రకా రం 75వరకు తెగలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. వీటిలో 19 తెగల ఆదివాసీ జనాభా వెయ్యికంటే తక్కువ. ఈ తెగలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో అగ్రకులాలను ఎస్టీ జాబితాలో కలపాలని ప్రభుత్వం యత్నిస్తోంది. ఇప్పటికే లంబా డీలు ఆదివాసీల రిజర్వేషన్లను దోచుకున్నారు. ఇందుకు దళారీ పాలకవర్గ విధానాలే కారణం. ఈ నేపథ్యంలో బిర్సాముండా పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకుని, ఆదివాసీలను చైతన్యపరిచి, వారి ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత మేధావులు, విద్యావంతులపై ఉంది. (నేడు బిర్సాముండా జయంతి) – ఊకే రామకృష్ణ దొర, ఆదివాసీ రచయితల సంఘం -
‘పవన్ కళ్యాణ్ ఇంటిని ముట్టడిస్తాం..’
సాక్షి, అనంతరపురం: మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కానీ పవన్ వ్యాఖ్యలపై గిరిజన జేఏసీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంటిని ముట్టడించడానికి కూడా తాము వెనుకాడబోమని వారు హెచ్చరించారు. మంగళవారం స్థానిక నాగులకట్ట వద్ద విలేకరుల సమావేశంలో గిరిజన జేఏసీ పుట్టపర్తి కన్వీనర్ కే. రవీంద్ర నాయక్, కో కన్వీనర్ కుళ్లాయి నాయక్, జిల్లా యువజన విభాగం కన్వీనర్ ఎస్. నారాయణస్వామి నాయక్ మాట్లాడారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని.. ఇందుకు తాను మద్దతిస్తానని, ప్రభుత్వంతో కూడా మాట్లాడతానని పవన్ చెప్పడం గర్హనీయమన్నారు. గిరిజనుల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టి అర్ధమవుతోందన్నారు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయిస్తే ఆ అడుగుజాడల్లోనే పవన్ నడవటం విచారకరమని గిరిజన నాయకులు అన్నారు. పవన్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గిరిజనుల ఆగ్రహం చవిచూడక తప్పదన్నారు. -
గిరిజన విద్యార్థులపై ప్రభుత్వం శీతకన్ను
అనంతపురం ఎడ్యుకేషన్ : గిరిజన విద్యార్థులను ప్రభుత్వం చులకనభావంతో చూస్తోందని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు వాపోయారు. గిరిజన విద్యార్థులకు గ్రూప్–1, 2 పరీక్షలకు ఉచిత శిక్షణను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి కొండలరావును కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ జిల్లాలో డిగ్రీలు, పీజీలు చేసిన గిరిజన యువకులు ఉపాధి అవకాశాలు లేక వ్యవసాయ కూలీలుగా, ఆటో కార్మికులుగా జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. ఇటీవల ఏపీ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ గ్రూప్–2 పరీక్షలకు సంబంధించి ఎస్సీ, బీసీ ,మైనార్టీ అభ్యర్థులకు ప్రభుత్వం శిక్షణ ఇస్తోందని, గిరిజన అభ్యర్థులను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారిని కలిసిన వారిలో వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి రాజునాయక్, గిరిజన విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి సాకే చిరంజీవి, నాయకులు భరత్, భాస్కర్‌నాయక్ ఉన్నారు.