స్నేహమేరా జీవితం | Money Is Honey Latest Movie | Sakshi
Sakshi News home page

స్నేహమేరా జీవితం

Dec 6 2016 3:20 AM | Updated on Sep 4 2017 9:59 PM

స్నేహమేరా జీవితం

స్నేహమేరా జీవితం

జీవితంలో డబ్బు ముఖ్యం కాదు. స్నేహం అంతకంటే విలువైంది’’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మనీ ఈజ్ హని’. జె.వి. నాయుడు,

‘‘జీవితంలో డబ్బు ముఖ్యం కాదు. స్నేహం అంతకంటే విలువైంది’’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మనీ ఈజ్ హని’. జె.వి. నాయుడు, రోషన్, ఎం.ఆర్, వెంకీ, అభిషేక్, రచనా స్మిత్, రష్మిజా, బాబు పోకల ముఖ్య పాత్రల్లో జనార్ధన్ శివలంకి దర్శకత్వంలో జాలె వాసుదేవనాయుడు నిర్మించారు. జి.వసంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేసి, మరో నిర్మాత రాజ్ కందుకూరికి అందించారు. ట్రైలర్‌ను కల్యాణ్ ఆవిష్కరించారు. 
 
దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మంచి కథ తయారు చేసుకున్న తర్వాత నిర్మాత కోసం వెతకడం మొదలుపెట్టా. ఆ టైమ్‌లో మా గురువు వాసుదేవనాయుడుగారు సినిమా చేస్తానని ముందుకొచ్చారు. నా తొమ్మిదేళ్ల కష్టమే ఈ చిత్రం. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించాం’’ అన్నారు. సాయివెంకట్, ఆర్.కె.గౌడ్, సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement