నేడు దావోస్‌కు సీఎం బాబు | CM launches today davos | Sakshi
Sakshi News home page

నేడు దావోస్‌కు సీఎం బాబు

Published Tue, Jan 20 2015 12:52 AM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM

CM launches today davos

సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు మంగళవారం నుంచి 5 రోజుల పాటు విదే శీ పర్యటనకు వెళ్తున్నారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. తిరిగి ఈ నెల 25న హైదరాబాద్ చేరుకుంటారు.  

మంగళవారం ఉదయం 4.10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి దుబాయ్ మీదుగా మధ్యాహ్నం 12.20కి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ చేరుకుంటారు. ఇక్కడ జరిగే ఒక సమావేశంలో పాల్గొని.. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దావోస్ చేరుకుంటారు. రాత్రి ఏడున్నర నుంచి 8 గంటల వరకు ఫోరం సమావేశంలో భాగంగా జరిగే స్వాగత కార్యక్రమంలో పాల్గొంటారు. ఫోరం సమావేశాల్లో పట్టణాభివృద్ధి భవితవ్యం అనే అంశంపై జరిగే సదస్సులో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
 
సీఎం బృందంలో..
సీఎం వెంట వెళ్లే ప్రతినిధి బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు,  కంభంపాటి  తదితరులు ఉన్నారు.
 
27 న మంత్రిమండలి భేటీ
దావోస్ నుంచి సీఎం చంద్రబాబు తిరిగి వచ్చాక ఈ నెల 27న మంత్రిమండలి భేటీకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement