కూడేరు: ఎన్నికల హామీ మేరకు రైతు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయకుండా రోజుకొక ప్రకటనల తో మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నీటి మూటలని తేలిందని ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆయనను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మండల కేంద్రంలో శనివారం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన స మావేశమయ్యారు.
రైతు, డ్వాక్రా రుణాల మాఫీ కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 5న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాపై ఎమ్మెల్యే చర్చించారు. మం డలం నుంచి వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, రైతులు, మహిళలు ధర్నాకు తర లి రావాలని పిలుపు నిచ్చారు. అపద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని ఎద్దేవా చేశారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు, పింఛన్లు కోల్పోయిన బాధితులు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న డ్వా క్రా మహిళలు, చేనేత కార్మికుల కష్టాలు ముఖ్యమంత్రికి కనిపించడం లేదన్నారు. ఆయనకు సింగపూర్ ధ్యాస తప్ప ఏమి పట్టడం లేదన్నారు.
చంద్రబాబు నిర్వాహకంతో రుణాలు పొందిన రైతులు బ్యాంక్ మెట్లు ఎక్కలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించలేక డిఫాల్ట్‌ర్లు మా రిపోయారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతుందని భరోసా ఇచ్చారు. ధర్నాతో ప్రభుత్వం దిగిరావాలన్నారు.
సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, మండల వైఎస్ ఎంపీపీ రాజశేఖర్, సర్పంచ్‌లు రామ్మోహన్, క్రిష్టప్ప, వెంకటేశులు, మండల నాయకులు మాదన్న, తిమ్మారెడ్డి, శశికాంత్ రెడ్డి, మలోబులేసు, రాచనగౌడ్, భాస్కర్‌రెడ్డి, చితంబరం, నారాయణరెడ్డి, శంకర్‌రెడ్డి, తిమ్మారెడ్డి, ఓబులేసు, మల్లిఖార్జున, గోవింద్, శంకర్ నాయక్, శ్రీనివాసులు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబు మాటలు నీటి మూటలు
Published Sun, Nov 30 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM
Advertisement
Advertisement