తమకు ఓటేయలేదనే కక్షతో అతనిపై టీడీపీ గ్రీవెన్స్ సెల్‌లో ఆ పార్టీ నేత ఫిర్యాదు
పెద్ద సంఖ్యలో పోలీసులు, అధికారులు వచ్చి ఇంటి ప్రహరీ కూల్చివేత
వెంకినాయుడు కన్నీటితో ప్రాధేయపడినా కనికరించని అధికారులు
ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు
టీడీపీ నేతల ఆక్రమణలను కూల్చివేయాలంటూ ఆందోళన
విజయనగరం జిల్లా దన్నానపేటలో ఘటన
నెల్లిమర్ల రూరల్/విజయనగరం అర్బన్: అధికార దర్పంతో చెలరేగిపోతున్న టీడీపీ మూకలు చివరకు దేశ సైనికుడినీ వదిలిపెట్టలేదు. టీడీపీకి ఓటేయలేదనే అనుమానంతో అతనిపై దౌర్జన్యానికి దిగాయి. టీడీపీ గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేసి.. అధికార బలంతో అతని ఇంటిపైకి జేసీబీని దూకించాయి. 24 ఏళ్ల పాటు దేశానికి రక్షణగా నిలిచిన మాజీ జవాన్ ఇంటి ప్రహరీని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయించాయి. తనకు ఏ రాజకీయ పారీ్టతోనూ సంబంధం లేదని అతను కన్నీటిపర్యంతమైనా టీడీపీ మూకలు, అధికారులు కనికరించలేదు.
ఈ ఘటన శనివారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేటలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. దన్నానపేటకు చెందిన పతివాడ వెంకినాయుడు 24 ఏళ్ల పాటు సైనికుడిగా దేశానికి సేవ చేశాడు. ఆ కష్టార్జితంతో ఇల్లు నిరి్మంచుకున్నాడు. అయితే ఆ ఇంటి ప్రహరీ ఆక్రమణలో ఉందని ఇటీవల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గేదెల రాజారావు అమరావతికి వెళ్లి ఆ పార్టీ నాయకులను కలిసి.. టీడీపీ గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి అందిన ఆదేశాల మేరకు ఆర్డీవో సూర్యకళ గురువారం గ్రామంలో పర్యటించారు.
వెంకినాయుడు ఇంటి ప్రహరీ ఆక్రమణ భూమిలో ఉందని.. దానిని తొలగించాలని తహసీల్దార్ ధర్మరాజుకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో టీడీపీ నాయకుల ఆక్రమణలు కోకొల్లలుగా ఉన్నాయని, వాటిని తొలగించకుండా.. సైనికుడి ఇంటి మీదకు రావడమేంటని గ్రామస్తులు మండిపడ్డారు. కానీ, రెవెన్యూ అధికారులు శనివారం సుమారు 50 మందికి పైగా పోలీస్ సిబ్బందితో వచ్చి గ్రామస్తులను భయబ్రాంతులకు గురి చేశారు. ఆ వెంటనే జేసీబీతో వెంకినాయుడు, అతని సోదరుడు లక్ష్మణరావుకు చెందిన ఇంటి ప్రహరీని కూల్చివేశారు.
వెంకినాయుడు దంపతులు కన్నీటిపర్యంతమై ప్రాధేయపడినా అధికారులు కనికరించలేదు. దీంతో అధికారులు, టీడీపీ నేతల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆందోళనకు దిగారు. దీంతో తహసీల్దార్ ధర్మరాజు.. టీడీపీ నేతల ఆక్రమణలు కూడా తొలగిస్తామంటూ పేపర్‌పై సంతకం పెట్టి బాధితులకు అందజేశారు.
జవాన్‌ను వేధించడమే మీ రాజకీయమా?: బొత్స
దేశ రక్షణ కోసం సేవలందించిన జవాన్ ఇంటి ప్రహరీని అన్యాయంగా కూల్చేయడమే మీ మంచి సంప్రదాయమా? సైనికుడిని వేధించడమే మీ రాజకీయమా? అని నెల్లిమర్ల టీడీపీ ఎమ్మెల్యేపై, ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉగ్రవాది ఇంటికి వెళ్లినట్లుగా.. ఆర్మీ ఉద్యోగి ఇంటిపైకి 50 మంది పోలీసులతో వెళ్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు.
‘మాజీ సైనికుడు వెంకినాయుడు ఇంటి ప్రహరీ కూల్చితే మీకొచ్చే లాభమేంటి? అదో మారుమూల గ్రామం. అయినా ఎందుకు కూల్చారు? కలెక్టర్, ఎస్పీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. రాజకీయాలకు కొత్తగా వచి్చన ఎమ్మెల్యే జిల్లాలోకి ఇలాంటి సంస్కృతిని తీసుకురావడం దారుణం’ అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ సురే‹Ùబాబు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పాల్గొన్నారు.
దేశానికి సేవ చేస్తే.. ఇదా బహుమతి!
మాజీ సైనికుడు వెంకినాయుడు మీడియాతో మాట్లాడుతూ... ‘నేను 24 ఏళ్ల పాటు దేశ రక్షణ కోసం పని చేశా. అలాంటి నాకు ఇదా ఈ ప్రభుత్వమిచ్చే బహుమతి. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేదనే కక్షతో గ్రామ టీడీపీ నేత గేదెల రాజారావు అమరావతి వరకు వెళ్లి మరీ నాపై ఫిర్యాదు చేశాడు. న్యాయం, ధర్మం అంటూ మాట్లాడే పవన్‌కళ్యాణ్, చంద్రబాబుకు ఈ మాజీ సైనికుడికి జరుగుతున్న అన్యాయం కనిపించడంలేదా? రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని నాపై వేధింపులకు పాల్పడడం సరికాదు. గ్రామంలోని టీడీపీ నేతల ఆక్రమణలు తొలగించే వరకు నా పోరాటం ఆగదు. టీడీపీ వాళ్ల దౌర్జన్యాలను అడ్డుకొని రాష్ట్రపతి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment