ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు టీఆర్‌ఎస్ సవాల్ విసిరింది. గురివింద గింజ లాగా తన తండ్రి పాలనలోని లోపాలను చూడకుండా..
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు టీఆర్‌ఎస్ సవాల్ విసిరింది. గురివింద గింజ లాగా తన తండ్రి పాలనలోని లోపాలను చూడకుండా.. టీఆర్‌ఎస్‌పై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. బుధవారం ఇక్కడ తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘టీడీపీ నేతలు పదేపదే విమర్శలు చేస్తుంటే నేను, మా ఎంపీ బూర నర్సయ్య గారు కలసి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పాం. లోకేశ్ టీఆర్‌స్ పాలనపై ట్విటర్‌లో ఏదో రాశార ట.. నేను మళ్లీ చెబుతున్నా.. ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధం. నీకు దమ్మూ, ధైర్యం ఉంటే చర్చకు రా’ అని పేర్కొన్నారు.