సాక్షి, హైదరాబాద్: బొగ్గు గనులు విస్తరించిన నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించాలని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన పార్టీ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, నల్లాల ఓదేలు, పుట్ట మధు, దివాకర్‌రావు సోమవారం హైదరాబాద్‌లో సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ శ్రీధర్‌ను కలిశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా పరిసర నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయాలని సీఎండీని కోరారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలు, సమస్యలు పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతామని సీఎండీ శ్రీధర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
రేవంత్ నీ తీరుమార్చుకో: ఎంపీ సుమన్
తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లిపోతాయనే భయంతో ఆ పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బాల్క సుమన్ అన్నారు. సింగరేణి సీఎండీని కలిశాక ఆయన మీడియాతో మాట్లాడారు. బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
‘నియోజకవర్గాలకు నిధులివ్వండి’
Published Tue, Jan 13 2015 7:06 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM
Advertisement
Advertisement