balcony Suman
-
కేటీఆర్ బాస్.. కేసీఆర్ బిగ్‌బాస్: సుమన్
అసెంబ్లీ ఆవరణలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మధ్య కొద్దిసేపు చర్చ జరిగింది. తనకు కేటీఆర్ బాస్ అయితే, సీఎం కేసీఆర్ బిగ్‌బాస్ అని సుమన్ అన్నారు. హరీశ్‌రావు కాదా అని రేవంత్ ప్రశ్నించగా.. తనకు హరీశ్ కూడా బాసేనని సుమన్ బదులిచ్చారు. ఇదేదో కండిషన్స్ అప్లై అన్నట్లుగా ఉందని రేవంత్ చమత్కరించారు. సుమన్‌పై ఇచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసు ఏమైందని రేవంత్‌ను విలేకరులు ప్రశ్నిచంగా, సుమన్ మేనేజ్ చేసుంటారని సమాధానమిచ్చారు. వెంటనే కల్పించుకున్న సుమన్ ‘ఈ రాష్ట్రంలో మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువగా ఉన్నది రేవంత్‌కే అనే విషయం అందరికీ తెలుసు’ అంటూ జవాబిచ్చారు. ఇప్పుడు కేసీఆర్‌కు జానారెడ్డే కాకుండా రేవంత్ కూడా మిత్రుడయ్యారని విలేకరులు వ్యాఖ్యానించడంతో ‘ఇప్పుడు మేం మిత్రుల య్యాం.. ఇక మీ సంగతి చెబుతాం’ అని రేవంత్ సరదాగా వ్యాఖ్యానించారు. -
ప్రాణహితకు జాతీయ హోదా ప్రకటించాలి
లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు తక్షణం జాతీయ హోదా ప్రకటించాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడుతూ గోదావరి నదీ జలాలు సమర్థవంతంగా వాడుకోలేక పోతున్నామని దీంతో తెలంగాణలో సాగునీరులేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. పోలవరానికి అనేక అడ్డంకులు, కోర్టుల్లో కేసులు ఉన్నప్పటికీ జాతీయ హోదా ప్రకటించారని, కానీ ప్రాణహితకు ఏ ఆటంకం లేకపోయినా ప్రకటించడం లేదన్నారు. తక్షణం ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చి జాతీయ హోదా ప్రకటించాలని కోరారు. -
‘నియోజకవర్గాలకు నిధులివ్వండి’
సాక్షి, హైదరాబాద్: బొగ్గు గనులు విస్తరించిన నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన పార్టీ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, నల్లాల ఓదేలు, పుట్ట మధు, దివాకర్‌రావు సోమవారం హైదరాబాద్‌లో సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ శ్రీధర్‌ను కలిశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా పరిసర నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయాలని సీఎండీని కోరారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలు, సమస్యలు పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతామని సీఎండీ శ్రీధర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. రేవంత్ నీ తీరుమార్చుకో: ఎంపీ సుమన్ తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లిపోతాయనే భయంతో ఆ పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బాల్క సుమన్ అన్నారు. సింగరేణి సీఎండీని కలిశాక ఆయన మీడియాతో మాట్లాడారు. బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. -
విద్యార్థి నాయకులకు పదవులు హర్షణీయం
టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సాధన ఉద్యమంలో పోరాడిన విద్యార్థి నాయకుల్లో అగ్రభాగాన ఉన్న వారందరికీ సీఎం కె చంద్రశేఖర్‌రావు ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిజాక్ చైర్మన్ పిడమర్తి రవికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్ష పదవి ఇవ్వడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం టీఆర్ఎస్ ఎంపీలు బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డిలు విజయ్‌చౌక్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యార్థి నాయకులను తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ విద్యార్థిలోకం స్వాగతిస్తోందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ఎంత చిత్తశుద్ధితో పనిచేశామో..ప్రజాప్రతినిధులుగా తెలంగాణ పునర్నిర్మాణానికి అంతే పట్టుదలతో పనిచేస్తామన్నారు. నిరుద్యోగుల కోసం త్వరలోనే లక్ష ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. మరో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, మెదక్ తరహాలో రైల్వే ప్రమాదాలు జరగకుండా లెవెల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లులేని చోట వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ కేంద్రాల శంకుస్థాపనకు రండి పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రి ఆయన ప్రధానిని కలసి ఈమేరకు విజ్ఞప్తి చేశారు. రామగుండంలో నాలుగువేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో గతప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అందులో భాగంగా 1600 మెగావాట్ల ప్లాంట్ కోసం ఎన్టీపీసీ అధికారుల బృందం అధ్యయనం చేసిందన్నారు. మిగిలిన 2400 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటుచేయాల్సి ఉందని గుర్తుచేశారు. ఈ విద్యుత్ కేంద్రాలకు వీలైనంత త్వరగా శంకుస్థాపన చేసేందుకు తప్పనిసరిగా రావాలని ప్రధానిని ఆహ్వానించినట్టు సుమన్ అనంతరం విలేకరులకు తెలిపారు. అలాగే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరినట్టు తెలిపారు. తాను దత్తత తీసుకున్న మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం దొండేపల్లి మండలం గూడెం గ్రామంలో చేపట్టిన కార్యాచరణను ఈసందర్భంగా ఆయన ప్రధానికి వివరించారు. -
బహిరంగ చర్చకు సై
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు టీఆర్ఎస్ సవాల్ విసిరింది. గురివింద గింజ లాగా తన తండ్రి పాలనలోని లోపాలను చూడకుండా.. టీఆర్ఎస్పై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. బుధవారం ఇక్కడ తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘టీడీపీ నేతలు పదేపదే విమర్శలు చేస్తుంటే నేను, మా ఎంపీ బూర నర్సయ్య గారు కలసి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పాం. లోకేశ్ టీఆర్స్ పాలనపై ట్విటర్లో ఏదో రాశార ట.. నేను మళ్లీ చెబుతున్నా.. ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధం. నీకు దమ్మూ, ధైర్యం ఉంటే చర్చకు రా’ అని పేర్కొన్నారు.