ప్రాణహితకు జాతీయ హోదా ప్రకటించాలి | Pranahitha announce national status | Sakshi
Sakshi News home page

ప్రాణహితకు జాతీయ హోదా ప్రకటించాలి

Published Fri, Mar 20 2015 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

Pranahitha announce national status

  • లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ డిమాండ్
  •  సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు తక్షణం జాతీయ హోదా ప్రకటించాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడుతూ గోదావరి నదీ జలాలు సమర్థవంతంగా వాడుకోలేక  పోతున్నామని దీంతో తెలంగాణలో సాగునీరులేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. పోలవరానికి అనేక అడ్డంకులు, కోర్టుల్లో కేసులు ఉన్నప్పటికీ జాతీయ హోదా ప్రకటించారని, కానీ ప్రాణహితకు ఏ ఆటంకం లేకపోయినా ప్రకటించడం లేదన్నారు. తక్షణం ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చి జాతీయ హోదా ప్రకటించాలని కోరారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement