Pranahitha-Chevella project
-
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవహక్కులను ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టివిక్రమార్క, నర్సారెడ్డి, వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కీ, సర్వే సత్యనారాయణ, దానం నాగేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఇక్కడి పాలకులు అవమానపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబేడ్కర్ పేరు మీద ఉన్న ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా చేశారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు కేవలం పేరు మార్చడం ద్వారా రూ.50 వేలకోట్ల అంచనా వ్యయాన్ని పెంచారన్నారు. దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందన్నారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు వస్తాయన్నారు. -
కేసీఆర్‌కు ముక్కు కూడా మిగలదు: జీవన్ రెడ్డి
జగిత్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు పట్టిన శని అని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆయనకు చట్టాలపై అవగాహన ఉందో లేదో తెలియదని, న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో అంతర్గత విభేదాలతో సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలపై కోర్టుకు వెళ్లి కాంగ్రెస్‌ను బాధ్యులను చేస్తున్నారని అన్నారు. ఆయనేమీ రాజ్యాంగానికి అతీతుడు కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఇప్పటివరకు కేంద్రానికి డీపీఆర్ సమర్పించలేదని విమర్శించారు. కేసీఆర్ అబద్ధాలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని.. చెప్పే అబద్ధాలకు, చేసే మోసాలకు ముక్కు నేలకు రాయాల్సి వస్తే కేసీఆర్‌కు ముక్కు కూడా మిగలదని ఎద్దేవా చేశారు. ప్రాణహిత- చేవెళ్ల తో తెలంగాణ సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉన్నా, రీడిజైన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని, ప్రాజెక్టుల నిర్మాణ జాప్యానికి కేసీఆర్ కారణమని ఆరోపించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విధి లేని పరిస్థితుల్లోనే కరీంనగర్ మెడికల్ కాలేజ్ కోసం ఆమరణ దీక్షకు దిగుతున్నారని చెప్పారు. ఈ రాష్ట్రంలో పౌరహక్కులకు విలువ లేదన్నారు. అహంకారమే కేసీఆర్‌ను గద్దె దించుతుందని జీవన్‌రెడ్డి తెలిపారు. -
'డిజైన్ మార్చితే తీవ్ర పరిణామాలే'
హైదరాబాద్ : ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును యథావిధిగా నిర్మించాలని, డిజైన్ మార్చితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నగరంలో మీడియాతో శుక్రవారం ఆమె మాట్లాడుతూ... రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు తాగు, సాగునీరు అందించడం సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు ఇష్టం లేనట్టుగా ఉందన్నారు. అందుకోసమే ప్రాణహిత-చేవెళ్లను మెదక్ వరకు పరిమితం చేస్తానని కేసీఆర్ అంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్ ను కేసీఆర్ మరిచారా అని ఈ సందర్భంగా సబిత ప్రశ్నించారు. వాటర్ గ్రిడ్ కోసమే ప్రాణహిత - చేవెళ్లను రీ డిజైన్ చేస్తున్నారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ రంగారెడ్డి ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును చేవెళ్ల వరకు చేపట్టాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ప్రాణహిత పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే కేసీఆర్ ఈ ప్రాజెక్టుపై వివాదం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. -
గోదారికి రాంరాం.. జూరాలకు సలాం!
- ప్రాణ హిత- చేవెళ్ల ప్రాజెక్టు కుదింపు యత్నం - పక్కజిల్లాల వరకే పరిమితం - ప్రత్యామ్నాయంగా జూరాల నుంచి కృష్ణాజలాలు - మూడో దశలో మన జిల్లాకు సాగునీరు - రూ.32వేల కోట్ల అంచనా వ్యయం - ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి దశాబ్ధకాలం అన్నదాతలకు ఆదరువు అవుతుందనుకున్న ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టు కథ.. కంచికి చేరుతుంది. నెర్రెలు విచ్చుకున్న నేలలను సస్యశ్యామలం చేసి హరితతోరణం సృష్టిస్తుందని భావించిన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కుదించే యత్నం చేస్తోంది. గోదావరి జలాలను రంగారెడ్డి జిల్లాకు తరలించాలని కలలుగన్న జనహృదయ నేత, స్వర్గీయ డాక్టర్ రాజశేఖరరెడ్డి ఆశయానికి గండికొడుతూ.. ప్రాజెక్టులో అటు ప్రాణహిత.. ఇటు చేవెళ్లకు కోత పెట్టడం ద్వారా ైరె తాంగం ఆశలపై నీళ్లు జల్లుతోంది. ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టుతో హరితవిప్లవం ఖాయమని భావించిన కర్షకులను ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల’ పథకంతో ఏమారుస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :భూగర్భజలాలపై ఆధారపడుతున్న తెలంగాణ జిల్లాలో హరితసిరులు పండించాలనే సంకల్పంతో ప్రాణహితకు డిజైన్ చేసిన ప్రభుత్వం.. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.38,500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. దీంట్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో రూ.1.40 లక్షల ఆయకట్టును స్థిరీకరించవచ్చని అంచనా వేయడమేకాకుండా.. పంప్‌హౌజ్, సొరంగం, భూసేకరణ, ఇతర పనులకు రూ.1,500 కో ట్లను కూడా ఖర్చు చేసింది. అయితే, ప్రస్తుతం కేసీఆర్ సర్కారు చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ నుంచి చేవెళ్లకు గోదారి నీటిని తరలించడం భగీరథ ప్రయత్నమే అవుతుందని భావిస్తున్న సర్కారు ప్రాజెక్టును పక్క జిల్లాల వరకే పరిమితం చేసి రంగారెడ్డిని తప్పించే యత్నం చేస్తోంది. ప్రాణహితకు ప్రత్యామ్నాయంగా పక్కనే ఉన్న జూరాల నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చి జిల్లాలోని బీడు భూములను సాగులోకి తీసుకురావడం ఉత్తమమనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పట్లో కష్టమే..! ‘పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల’ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. వరద సమయాల్లో వృధాగా పోతున్న 70 టీఎంసీల నీటిని వినియోగించుకోవడం ద్వారా కృష్ణా బేసిన్‌లోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలు.. అందులో రంగారెడ్డి జిల్లాలో 2.70 లక్షల ఎకరాలకు సస్యశ్యామలం చేయవచ్చని అంచనా వేసింది. అయితే, నిర్మాణ వ్యయం తడిసిమోపెడు కానుండడం.. ముంపు బారిన పడే గ్రామాల సంఖ్య గణనీయంగా ఉండడంతో పునరాలోచనలో పడింది. తొలిదశలో జూరాల నుంచి కోయిల్‌కొండ వరకు కృష్ణా జలాలను తీసుకురావాలనే ప్రతిపాదనపై ఇంజినీరింగ్ నిపుణుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రూ.32 వేల కోట్లు ఖర్చుచేసి కేవలం రిజర్వాయర్లలో నీటిని నింపుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటని.. ఆయకట్టు స్థిరీకరణ జరిగితే తప్ప ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదని అంటున్నారు. భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టు మొదటి రెండు దశలు దాటి మూడో దశలో పనులు కార్యరూపం దాల్చాలంటే దాదాపు దశాబ్ధకాలం పట్టే అవకాశం ఉందని విశ్లేషిస్తున్న నిపుణులు.. రంగారెడ్డి జిల్లాకు ఇప్పట్లో జూరాల జ లాలు రావడం కల్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. -
పాత డిజైనే ప్రాణ‘హితం’!
రాష్ట్ర ప్రభుత్వానికి రిటైర్డ్ ఇంజనీర్ల బృందం సూచన {పాజెక్టుపై రూపొందించిన నివేదికలో వెల్లడి మహారాష్ట్ర కోరినట్లు మీటర్ ఎత్తు తగ్గించి తుమ్మిడిహెట్టి నుంచే నీటి మళ్లింపు చేయాలని సూచన 20-30 టీఎంసీలు తగ్గితే.. వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి వాడుకోవచ్చని ప్రతిపాదన ఇలాచేస్తేనే ఇప్పటిదాకా జరిగిన పనులు వృథా కావని హితవు హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పాత డిజైనే శ్రేయస్కరమని గోదావరి ప్రాజెక్టుల పరిశీలనకు ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఇంజనీర్ల బృందం తేల్చింది. కావాలంటే మహారాష్ట్ర కోరుతున్నట్లుగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును ఒక మీటరు మేర తగ్గించి.. నీటిని మళ్లించుకోవడమే మేలని స్పష్టం చేసింది. ఎత్తు తగ్గింపుతో నిర్ణీత స్థాయిలో నీటిని తీసుకోలేకపోతే... మిగ తా నీటిని ప్రాణహితకు దిగువన ఉన్న వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి మళ్లించుకోవచ్చని సూచించింది. ఇలాచేస్తే ఇప్పటివరకు జరిగిన దాదాపు రూ. 4 వేల కోట్ల విలువైన పనులు వృథా కావని రిటైర్డ్ ఇంజనీర్ల బృందం తమ నివేదికలో తేల్చిచెప్పినట్లు సమాచారం. ఘనమైన ప్రాజెక్టు.. గోదావరి నది నుంచి 160 టీఎంసీల నీటిని మళ్లించి.. సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు పథకం పొడవునా గ్రామాలకు, రాజధానికి తాగునీరు అందించడం కోసం రూ. 38,500 కోట్ల అంచనా వ్యయంతో ‘ప్రాణహిత-చేవెళ్ల’ భారీ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించి.. అక్కడి నుంచి ఎల్లంపల్లికి, మిడ్‌మానేరుకు నీటిని మళ్లించి, ఆ తర్వాత హైదరాబాద్ మీదుగా చేవెళ్ల వరకూ నీటిని తరలించనున్నారు. అయితే తుమ్మిడిహెట్టి బ్యారేజీతో తమ ప్రాంతంలో ముంపు ఎక్కువగా ఉంటుందని, ఎత్తు తగ్గించాలని మహారాష్ట్ర కోరడంతో... ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నుంచి కాకుండా.. 110 కిలోమీటర్ల దిగువన ఉన్న కాళేశ్వరం సమీపంలోని మేటిగడ్డ వద్ద నీటిని మళ్లించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ డిజైన్ మార్పుపై అధ్యయనం చేసే పనిని వ్యాప్కోస్ సంస్థకు అప్పగించింది. ఇక మరోవైపు గోదావరిలో లభ్యత నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా అదనపు బ్యారేజీల నిర్మాణం, ప్రాజెక్టుల పరిధిలో చేయాల్సిన రీ డిజైనింగ్ తదితర అంశాల పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు రిటైర్డ్ ఇంజనీర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ బృందం సభ్యులు అనంతరాములు, వెంకట్రామారావు, చంద్రమౌళి, దామోదర్‌రెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, సాంబయ్య, జగదీశ్వర్ ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రాణహిత ప్రాజెక్టు పనులను పరిశీలించారు. దీనిపై తమ ప్రతిపాద నలు, సూచనలతో కూడిన 14 పేజీల నివేదికను గురువారం నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు అందజేశారు. పాత డిజైన్‌కే మొగ్గు! దుమ్ముగూడెం నుంచి ప్రాణహిత వరకు ఎక్కడెక్కడ అదనపు బ్యారేజీల నిర్మాణం చేపట్టాలనే దానిపై తమ 14 పేజీల నివేదికలో స్పష్టంగా వివరించిన కమిటీ... చివరి రెండు పేజీల్లో మాత్రం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించింది. కొత్త ప్రతిపాదన అయిన కాళేశ్వరం వద్ద నీటి మళ్లింపునకు పూనుకుంటే.. విద్యుత్ అవసరం మరో 400 మెగావాట్ల మేర పెరుగుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేగాకుండా ఇప్పటివరకు బ్యారేజీ 152 మీటర్ల ఎత్తును పరిగణనలోకి తీసుకుని జరిగిన రూ. నాలుగు వేల కోట్ల విలువైన కాలువల పనుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర కోరుతున్నట్లుగా బ్యారేజీ ఎత్తును ఒక మీటరు తగ్గించి, 151 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్రను ఒప్పించాలని రిటైర్డ్ ఇంజనీర్ల బృందం సూచించింది. ఎత్తు తగ్గింపు వల్ల నిర్ణీత 160 టీఎంసీల నీటి మళ్లింపు సాధ్యంకాకుంటే... 130 టీఎంసీల వరకు తరలించి, మరో 30 టీఎంసీలను బ్యారేజీకి 70 కిలోమీటర్ల దిగువన ఉన్న వేమనపల్లి వద్ద మళ్లించవచ్చని తెలిపింది. దీనికోసం వేమనపల్లి వద్ద మరో బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని పేర్కొంది. ఇలా చేస్తే ఎల్లంపల్లి తర్వాతి మూడు ప్యాకేజీలు యథావిధిగా ఉంటాయని బృందం పేర్కొన్నట్లుగా తెలిసింది. వ్యాప్కోస్ నివేదిక వచ్చాకే.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ బాధ్యతలను ప్రస్తుతం వ్యాప్కోస్‌కు అప్పగించినందున.. రిటైర్డ్ ఇంజనీర్ల బృందం నివేదికపై ప్రభుత్వం వెంటనే ఏ నిర్ణయానికీ రాలేదని నీటి పారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యాప్కోస్ నివేదిక అందాక.. రెండు నివేదికలను పరిశీలించి ప్రాజెక్టుపై ముందుకెళ్లే అవకాశం ఉందని తెలిపాయి. -
ముంపు నిర్వాసితులకు మంచి ప్యాకేజీ: హరీశ్‌రావు
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్లతో ముంపునకు గురయ్యే గ్రామాలను సహాయ పునరావాసం కింద మంచి ప్యాకేజీ అందజేస్తామని నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం ఈ అంశమై టీఆర్ఎస్ సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ప్రకారం నిర్వాసితులకు మార్కెట్ రేటుకు మూడురె ట్లు, ఎస్సీ, ఎస్టీలకు అయితే నాలుగు రెట్లు పరిహారం చెల్లిస్తామన్నారు. ఇక ప్రాణ హిత ఎత్తు, లెండి, పెన్‌గంగ, ఇచ్ఛంపల్లి ప్రాజెక్టుల సత్వర పూర్తికి సరిహద్దు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లు మరో ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 75 వేల మందికొక 108: లక్ష్మారెడ్డి 108, 104 సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోగ్యశాఖా మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం లక్షల మందికి ఒక అంబులెన్స్ ఉందని, దానిని 75 వేల మందికి ఒకటి అందుబాటులో ఉంచేలా వాటి సంఖ్యను 506కు పెంచామన్నారు. బడ్జెట్లో సైతం వాటి నిర్వహణకు రూ.60 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి చర్యలు: సీఎం రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. మంగళవారం ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ, బలాలా, ముంతాజ్ అహ్మద్ ఖాన్లు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. మైనార్టీల సంక్షేమానికి వీలుగా సచార్ కమిటీ ప్రతిపాదనలను అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఎలాంటి సూచనలు చేయలేదని చెప్పారు. రాష్ట్ర పరిధిలోనే మైనార్టీల అభివృద్ధికి స్కాలర్షిప్పులు, స్టడీ సర్కిళ్లు, విద్య, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. -
డిజైన్ మారితే విద్యుత్ పిడుగు
ప్రాణహితపై ‘వ్యాప్కోస్’ హెచ్చరిక హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేయాల్సి వస్తే విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశముందని సర్వే సంస్థ వ్యాప్కోస్ అంచనా వేసింది. ఇప్పటికే ఉన్న విద్యుత్ అవసరాలకు తోడు అదనంగా 400 మెగావాట్ల విద్యుత్ అవసరమయ్యే అవకాశాలుంటాయని సంస్థ తేల్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రాజెక్టు అంచనా వ్యయం గణనీయంగా పెరుగుతుందని సంస్థ గుర్తించినట్లు తెలుస్తోంది. విద్యుత్ అవసరాలు ఎలా ఉన్నా డిజైన్ మార్పుపై ముందుకే వెళ్లాలని, కాళేశ్వరం దిగువ నుంచే నీటిని తీసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న సీఎం ఆ మేరకే ప్రాణహిత పేరును కాళేశ్వరంగా మార్చాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే గణనీయం: ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్లుగా నిర్ణయించడంతో తమ భూభాగంలోని 4,500 ఎకరాల మేర ఆయకట్టు ముంపునకు గురవుతుందని, ఈ దృష్ట్యా బ్యారేజీ ఎత్తును తగ్గించాలని మహారాష్ట్ర ఇటీవల రాష్ట్రాన్ని కోరింది. కానీ గోదావరి నుంచి 160 టీఎంసీల నీటిని తీసుకునే క్రమంలో బ్యారేజీ ఎత్తును ఒక్క మీటర్ మేర తగ్గించినా బ్యారేజీ సామర్ధ్యం తగ్గుతుందని, అదే జరిగితే నిర్ణీత నీటి మళ్లింపు సాధ్యం కాదని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. అయితే మహారాష్ట్ర విజ్ఞప్తి నేపథ్యంలో డిజైన్ మార్చాలని భావిస్తున్న ప్రభుత్వం దీని బాధ్యతను వ్యాప్కోస్‌కు కట్టబెట్టింది. ప్రాథమిక సర్వే చేసిన ఆ సంస్థ ప్రస్తుతప్రణాళిక ప్రకారం కాకుండా కాళేశ్వరం దిగువ నుంచి నీటి మళ్లింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుతో పోలిస్తే ఇక్కడ 50 మీటర్ల మేర ఎత్తు తక్కువగా ఉండటంతో విద్యుత్ అవసరాలు గణనీయంగా పెరగనున్నాయి. ప్రాజెక్టుకు 3,159 మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఉంటాయని ఇదివరకే ప్రభుత్వం అంచనా వేయగా అది మరో సుమారు 400 మెగావాట్ల మేర పెరిగే అవకాశముందని వ్యాప్కోస్ తేల్చినట్లు తెలుస్తోంది. విద్యుత్ సంక్షోభంలో ఉన్న రాష్ట్రం ఈ స్థాయి విద్యుత్‌ను ఎక్కడి నుంచి తెస్తుందని కేంద్ర జల సంఘంతోపాటు రాష్ట్ర సాగునీటిరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. -
ప్రాణహితకు జాతీయ హోదా ప్రకటించాలి
లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు తక్షణం జాతీయ హోదా ప్రకటించాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడుతూ గోదావరి నదీ జలాలు సమర్థవంతంగా వాడుకోలేక పోతున్నామని దీంతో తెలంగాణలో సాగునీరులేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. పోలవరానికి అనేక అడ్డంకులు, కోర్టుల్లో కేసులు ఉన్నప్పటికీ జాతీయ హోదా ప్రకటించారని, కానీ ప్రాణహితకు ఏ ఆటంకం లేకపోయినా ప్రకటించడం లేదన్నారు. తక్షణం ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చి జాతీయ హోదా ప్రకటించాలని కోరారు. -
పొరుగు రాష్ట్రాలతో మరింత సఖ్యత
చర్చలతో జలవివాదాల పరిష్కారానికి టీ సర్కార్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై పొరుగు రాష్ట్రాలతో మరింత సఖ్యతతో మెలగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వివాదం నెలకొన్న ప్రాజెక్టుల పరిధిలో సర్దుబాటు ధోరణితో వ్యవహరించి, భవిష్యత్ బంధాలు పటిష్టం చేసుకునే దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా నీటి విడుదల విషయంలో ఏపీతో తలెత్తిన వివాదంతోపాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రతో జరిపిన చర్చలు ఫలప్రదమైన నేపథ్యంలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు విషయంలో ఛత్తీస్‌గఢ్‌తోనూ, పాలమూరు ఎత్తిపోతల, జూరాల-పాకాల ప్రాజెక్టుల విషయంలో కర్ణాటకతోనూ చర్చించి సయోధ్య చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏపీ, తెలంగాణ జల జగడం కొలిక్కి..: తెలంగాణ, ఏపీల మధ్య 3 నెలలుగా నలిగిన కృష్ణా నదీ జలాల వివాదం ఇటీవల చర్చల ద్వారానే కొలిక్కి వచ్చింది. వాస్తవ వాటాలను మించి అదనంగా 43 టీఎంసీల మేర నీటిని ఏపీ వినియోగించుకున్నప్పటికీ భవిష్యత్తులో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలనే ఉద్దేశంతో కృష్ణాలోని 63 టీఎంసీల లభ్యత నీటిని అవసరాల మేరకు పంచుకునేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించడం తెలిసిందే. అలాగే ప్రాణహిత-చేవెళ్ల, లెండి, పెన్‌గంగల విషయంలో మహారాష్ట్రతోనూ సర్కారు ఇదే ధోరణితో వ్యవహరించింది. ప్రాణహిత బ్యారేజీ ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూ ప్రాంతానికి ఆ రాష్ట్ర చట్టాలకు లోబడి నష్టపరిహారం చెల్లించడంతోపాటు పెన్‌గంగ విషయంలో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు కట్టుబడి పనులను ముందుకు తీసుకెళ్లే తదితర అంశాలపై జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయి. త్వరలోనే కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లతో చర్చలు: ఇచ్చంపల్లిపై ఇప్పటికే మహారాష్ట్రతో చర్చలు ప్రారంభించిన రాష్ట్రం త్వరలోనే దీనిపై ఛత్తీస్‌గఢ్‌తోనూ చర్చలు జరుపాలనే నిర్ణయానికి వచ్చింది. గతంలో జరిగిన ఒప్పందాలు, ఉన్నత స్థాయి కమిటీ, కేంద్ర జల సంఘం సూచన మేరకు ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఎత్తును 112.77 మీటర్ల నుంచి 95 మీటర్లకు తగ్గించుకునేందుకు సమ్మతిస్తున్నందున ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలంటూ ఛత్తీస్‌గఢ్‌ను కోరాలని రాష్ట్రం నిశ్చయించింది. ఆల్మట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీరు: తుంగభద్ర నది నుంచి రాజోలిండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ద్వారా మహబూబ్‌నగర్‌కు సాగునీరు అందించే కాల్వల మరమ్మతు పనులు వేగిరం చేయడం, జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు ఆల్మట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలపై కర్ణాటకతో సంప్రదింపులు జరపాలన్నది ప్రభుత్వ యోచనగా ఉంది. -
‘బస్వాపురం’సామర్థ్యం పెంచాలి
నల్లగొండ రూరల్ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తిప్పారం రిజర్వాయర్ నుంచి బస్వాపురం రిజర్వాయర్ వరకు గ్రావిటీ ద్వారా నీరందిస్తేనే క్షామ పీడిత ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేఇ 70 టీఎంసీల నీరు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు రాసిన లేఖను స్థానికంగా ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రారంభించినట్లు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. 16 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టును రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో ఆలేరు, భువనగిరి, మునుగోడు ప్రాంతాల్లో 2 లక్షల 29 వేల 832 ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుందన్నారు. జిల్లాలో సాగునీరు అందించేందుకు రూ. వెయ్యి 82 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వరదలు వచ్చినప్పుడు నది నికర జలాలను జిల్లాలో వినియోగించుకునేందుకు బస్వాపురం రిజర్వాయర్‌ను 10 టీఎంసీలకు పెంచాలన్నారు. ప్రస్తుతం దీని సామర్థ్యం 0.8 టీఎంసీలు మాత్రమే ఉందన్నారు. పంటలకు నీరందించేందుకు 120 రోజులు అవసరం ఉంటుందని, కాగా 90 రోజుల వరకే నిర్ధారించడం వల్ల పంటలకు నీరందదన్నారు. ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టులో 16 ప్యాకేజీలో పనులు ప్రారంభమయ్యయన్నారు. సిద్ధిపేటలోని గజ్వేల్ తరహాలోనే ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ - 2 కింద కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే మూసీ వరకు కాల్వలను తవ్వించామన్నారు. మూసీకింద 2 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. దీని ద్వారా కొన్ని చెర్వులను మాత్రమే నింపామన్నారు. మిడ్ మానేరు బ్యాలెన్సింగ్ పనులను పూర్తి చేస్తే కొంత సాగునీరు అందుతుందన్నారు. మొత్తం జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 70 టీఎంసీలు కేటాయించాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ హయంలోనే ఎస్‌ఈడబ్ల్యు, జీఎన్‌పీ, డీఎల్ఆర్కు అవార్డు చేసినట్లు గుర్తు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించేందుకు 70 టీఎంసీల నికర జలాలను కేటాయించాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏఎంఆర్‌పీలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 30 టీఎంసీలు, నక్కలగండి కింద 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 30 టీఎంసీలు, బి.వెల్లెంల ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు 10 టీఎంసీల చొప్పున మొత్తం 70 టీఎంసీల నీటిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రీశైలం సొరంగమార్గం ద్వారా ఎక్కువ నీళ్లను తీసుకోవడం ద్వారానే జిల్లాలో పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్య, కరువు దుర్భిక్షాన్ని అధిగమించవచ్చన్నారు. అందుకు 90 రోజుల నదీ నికర జలాలను కేటాయించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, కాంగ్రెస్ నాయకులు తుమ్మల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణా నత్తనడకే..
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు భూసేకరణ నత్తనడకన సాగుతోంది. ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి ఏళ్లు గడుస్తుండగా.. భూ సేకరణ ప్రక్రియ కొనసా..గుతూనే ఉంది. దీంతో కొన్ని చోట్ల ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు ప్రాజెక్టు నిర్మాణంతో కోల్పోతున్న తమ భూములకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం తక్కువగా ఉందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన నూతన భూసేకరణ చట్టం ప్రకారమే భూములకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. భూమినే నమ్ముకుని తరతరాలుగా జీవనం కొనసాగిస్తున్నామని, జీవనాధారాన్ని కోల్పోతున్న తమకు ప్రభుత్వం అరకొర పరిహారం చెల్లించడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల వరకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తోంది. మెట్ట భూములకు ఎకరానికి రూ.లక్షా 25 వేలు, ఏడాదికి ఒకటీ, ఒక పంట పండే భూములకు రూ.3 లక్షల చొప్పున ఇస్తున్నారు. ఈ పరిహారం ఏమాత్రం సరిపోదని రైతులు ఆవేదన. కొత్తగా అమలు చేయనున్న భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నూతన చట్టం ప్రకారం చెల్లించే పరిహారం ఇప్పుడు ఇస్తున్న పరిహారం కంటే తక్కువగా వచ్చే అవకాశాలున్నాయని రెవెన్యూ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఐదు ప్యాకేజీలు.. తెలంగాణలోని ఏడు జిల్లాల పరిధిలో 16.40 లక్షల ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి సాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. పనులు పూర్తయితే జిల్లాలో 21 మండలాల పరిధిలో 1.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టు పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించారు. ఈ పనుల కోసం మొత్తం 8,491 ఎకరాల భూములు అవసరమని నీటి పారుదల శాఖ గుర్తించింది. నాలుగేళ్లు గడిచినప్పటికీ భూసేకరణ ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటి వరకు 3,672 ఎకరాలు మాత్రమే సేకరించగలిగారు. ఇంకా 4,818 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు 1,532 ఎకరాలు ఉండగా, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు 368 ఎకరాలు ఉన్నాయి. మిగిలిన 2,381 భూముల సేకరణ వివిధ స్థాయిలో ఉంది. సేకరిస్తున్న భూములకు సంబంధించి పరిహారం ఇంకా రైతులకు చెల్లించాల్సి ఉంది. అత్యధికంగా మందమర్రి మండల పరిధిలో భూములు సేకరించాల్సి ఉంది. ముఖ్యంగా క్యాతన్‌పల్లి, బొక్కలగుట్ట తదితర గ్రామాల పరిధిలో సుమారు రెండు వేల ఎకరాల భూసేకరణ ఇంకా జరగాల్సి ఉంది. నెన్నెల, బెల్లంపల్లి తదితర మండలాల పరిధిలో భూసేకరణ పక్రియ కొనసాగుతోంది. ముందుకు సాగని పనులు.. కొలిక్కిరాని భూసేకరణ ప్రక్రియ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులకు ప్రధాన అడ్డంకిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు చేపట్టిన కాంట్రాక్టు కంపెనీ భూసేకరణ సాకుగా చూపి పనులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవున్నాయి. ప్రస్తుతం కౌటాల నుంచి బెజ్జూరు వరకు కాలువల నిర్మాణం పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఐదు ప్యాకేజీల పరిధిలో పలుచోట్ల భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
అన్నీ మంచి శకునములే..
‘ప్రాణహిత’కు వీడుతున్న చిక్కులు తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును సమర్థిస్తూ సీడబ్ల్యూపీఆర్ఎస్ తుది నివేదిక ఇప్పటికే సిద్ధమైన అటవీ భూ పరిహార నివేదిక.. త్వరలో కేంద్రానికి తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుదల నేడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులన్నింటికీ శుభసూచకాలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 16 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టుపై పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఒక్కొక్కటిగా ప్రాణం పోసుకుంటున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నీటిని ఎత్తిపోసేందుకు ఉద్దేశించిన బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర అభ్యంతరాలను పక్కనపెట్టి, తెలంగాణ చేసిన నిర్ణయాన్ని సమర్థిస్తూ రెండు రోజుల కిందట కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నివేదిక సమర్పించింది. దీంతో మహారాష్ట్రలో భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. ప్రాజెక్టు నిర్మాణంవల్ల కోల్పోతున్న అటవీ భూమికి పరిహారంగా ప్రత్యామ్నాయ భూముల కేటాయింపునకు సంబంధించిన నివేదికలు ఇప్పటికే రాష్ట్ర అటవీ శాఖకు చేరాయి. అవి మరో రెండు, మూడు రోజుల్లో కేంద్రం పరిశీలనకు వెళ్లనున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహితపై నిర్మించదలిచిన తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనపు నీటి నిల్వలకు వెసలుబాటు లభించనుంది. దీనిపై సోమవారం శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చే యనున్నారు. మరోపక్క కేంద్ర జల సంఘం(సీడబ్ల్యుసీ) లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర అధికారులు సోమవారం సంఘం చైర్మన్ ఏపీ పాండ్యాతో భేటీ కానున్నారు. ఎత్తు పెంపునకు ఓకే! ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల మండల పరిధిలో ఉన్న తుమ్మిడిహెట్టి గ్రామంలో నిర్మించదలిచిన బ్యారేజీ ఎత్తును 152 మీటర్లుగా నిర్ణయించడాన్ని ముంపు ప్రాంతాలపై అధ్యయనం చేసిన సీడబ్ల్యు సీపీఆర్‌ఎస్ సంస్థ సమర్థించింది. 152 మీటర్ల ఎత్తు బ్యారేజీతో మహారాష్ట్రలో ఏ ఒక్క గ్రామం ముంపునకు గురికాదని, కేవలం 1300ల నుంచి 1500ల ఎకరాలు మాత్రమే ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించిన తుది నివేదికను రెండు రోజుల కిందట ప్రభుత్వానికి అందజేసింది. బ్యారేజీ ఎత్తును 150 మీటర్ల వరకు తగ్గించాలన్న మహారాష్ట్ర ప్రతిపాదనను ఆ సంస్థ తోసిపుచ్చింది. ప్రస్తుత నివేదికతో మహారాష్ట్ర ప్రాంతంలో ప్రాజెక్టు కింద అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ వేగిరం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూముుకు ఆ రాష్ట్ర చట్టాలను అనుసరించే పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన సమ్మతి తెలిపింది. దీనికితోడు ప్రాజెక్టు నిర్మాణంలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో కోల్పోతున్న సుమారు 7వేల ఎకరాల అటవీ భూమికి సమాన భూమిని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇప్పటికే సర్వే ద్వారా గుర్తించి అందుకు సంబంధించిన నివేదికలను రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన అధికారికి అందించింది. రాష్ట్ర అటవీ శాఖ తుది పరిశీలన అనంతరం ఒకటి, రెండు రోజుల్లో ఈ నివేదిక కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు వెళ్లనుంది. రెండు రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పెంపు ఇదిలా ఉండగా ప్రాణహితపై మెదక్ జిల్లాలో నిర్మించదలిచిన తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్ల నిల్వ సామర్ధ్యం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రాణహిత నదిపై పెద్దగా రిజర్వాయర్లు లేని దృష్ట్యా, ఈ రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాణహిత నదిపై కేవలం ఎల్లంపల్లి(20.17టీఎంసీలు), మిడ్‌మానేరు(25.175టీఎంసీలు) మినహాయిస్తే మధ్యలో నిర్మించదలిచిన మేడారం ఎత్తిపోతల, మోతే, అనంతగిరి, తిప్పారం రిజర్వాయర్లన్నీ తక్కువ నిల్వ సామర్థ్యం కలిగినవే. ఈ దృష్ట్యా తడ్కపల్లి రిజర్వాయర్‌ను 1.5టీఎంసీల నుంచి 30 టీఎంసీలకు, పాములపర్తిని 1 టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం సంకల్పించింది. నేడు సీడబ్ల్యుసీ చైర్మన్‌తో అధికారుల భేటీ.. ప్రాజెక్టుపై వస్తున్న పలు అభ్యంతరాలపై చర్చించేందుకు సోమవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు సీడబ్ల్యుసీ చైర్మన్ ఏబీ పాండ్యాతో ఢిల్లీలో మరోమారు భేటీ కానున్నారు. 1941 నుంచి ప్రస్తుతం వరకు గోదావరి నదీ జలాల లభ్యతపై కూడిన గణాంకాలతో అధికారులు పాండ్యాకు వివరణ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.40వేల కోట్లపైనా అధికారులు చైర్మన్ లేవనెత్తే సందేహాలకు సమాధానాలు ఇవ్వనున్నారు. -
ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి కొత్తగూడెం: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కలలుగన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కోరనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారన్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అంశాల వారీగా పార్లమెంట్లో ప్రస్తావించనున్నట్లు తెలి పారు. ఇటీవల విషజ్వరాలతో అనేకమంది మృత్యువాత పడ్డారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వివరించారు. రాష్ట్ర విభజనకు పూర్వం ముంపు మండలాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఓటు వేశారని, ఇప్పుడు వారి సమస్యలను ప్రస్తావించేందుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముంపు మండలాల ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ ఏర్పాటు కోసం పార్లమెంట్లో ప్రస్తావిస్తానన్నారు. బంగారు తెలంగాణ తెస్తామని అనేక హామీలు గుమ్మరించిన కేసీఆర్ ఇప్పుడు ఆ హామీలను విస్మరిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తికాకపోవడం వల్ల అధికారుల కొరత ఉందని, అందువల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించడం విడ్డూరం అన్నారు. ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రబీలో వరి సాగు చేయవద్దని ప్రకటించిన కేసీఆర్ జూన్ 2వ తేదీనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఖరీఫ్ సాగు వద్దని రైతులను కోరితే ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు కాదన్నారు. ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యతోపాటు ప్రస్తుతం నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. సీసీఐ ద్వారానే పత్తి కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని పొంగులేటి పేర్కొన్నారు. పత్తి క్వింటాలుకు రూ.4,050 చొప్పున కొనుగోలు చేయాలని కోరతామన్నారు. -
‘ప్రాణహిత’ పనుల్లో పురోగతి
{పాజెక్టు కింద కోల్పోతున్న భూమికి పరిహారం! నీటి పారుదల శాఖ నిర్ణయం హైదరాబాద్: తెలంగాణలోని అత్యధిక జిల్లాల సాగునీటి అవసరాలను తీర్చే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల పురోగతిలో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణంతో నష్టపోయే అటవీభూమికి సమానస్థాయిలో పరిహారంగా రెవెన్యూ భూమిని అందించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు నివేదికను రాష్ట్ర అటవీ శాఖకు అందజేసింది. అటవీ శాఖ దానిని పరిశీలించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు పంపనుంది. ఈ నివేదికకు కేంద్రం అంగీకారం తెలిపితే ప్రాజెక్టుకు జాతీయ హోదా వైపు కీలక అడుగు పడినట్లే. జాతీయ హోదాకు సంబంధించి 18 రకాల క్లియరెన్స్‌లు అవసరం ఉండగా, ఇప్పటికే 13 రకాల క్లియరెన్స్‌లు దక్కాయి. మరో 5 అంశాలకు సంబంధించి అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇందులో అటవీశాఖ అనుమతులు ముఖ్యమైనవి. ప్రాజెక్టు కింద కోల్పోతున్న 7,240 ఎకరాల అటవీ భూమికి పరిహారంగా భూమిని ప్రభుత్వం చూపించాల్సి ఉంటుంది. అటవీ భూమికి సమానవైన రెవెన్యూ భూమి కోసం అధికారులు సెప్టెంబర్ చివరి వారం నుంచే ఆయా జిల్లాల పరిధిలో సర్వే నిర్వహించారు. సుమారు 8 వేల ఎకరాల పరిహార భూమిని గుర్తించి రూపొందించిన నివేదికను రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణ అధికారికి అందజేశారు. ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురయ్యే గిరిజన గ్రామాల ప్రజల సమ్మతి తెలుపుతూ రాష్ట్ర గిరిజన సలహా మండలి తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. -
గిరిజనులకు నాలుగు రెట్ల పరిహారం
* సీఎం కేసీఆర్ వెల్లడి * ప్యాకేజీతో పునరావాసం * నిబంధనలు సవరించి సాయం * ప్రాణహిత-చేవెళ్లకు కౌన్సిల్ ఆమోదం * తండాలను పంచాయతీలుగా మార్పుపై మరోమారు భేటీ సాక్షి, హైదరాబాద్: నీటిప్రాజెక్టులు,ఇతర అభివృద్ధిపనుల వల్ల నిర్వాసితులయ్యే గిరిజనులకు దేశంలో ఏ రాష్ట్రమూ ఇవ్వనంత మంచి పునరావాస ప్యాకేజీని అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. శనివారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన గిరిజన సల హామండలి సమావేశం జరిగింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఈ సమావేశంలో మండలి ఆమోదం తెలిపింది. భూమిని పూర్తిగా కోల్పోయిన గిరిజనులను బాధితులుగా భావించాలని సీఎం చెప్పారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే వారి వివరాలను నోటిఫై చేయాలని, గిరిజన ప్రజాప్రతినిధులకూ వివరాలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ధర లక్ష ఉంటే నాలుగు లక్షల పరిహారం... ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే గిరిజనులకు రిజిస్ట్రేషన్ విలువ కన్నా ఎక్కువ నష్టపరిహారాన్ని, ఎకరా భూమి ధర రూ. లక్ష ఉంటే రూ. నాలుగు లక్షల పరిహారం అందుతుందని సీఎం చెప్పారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని మేలైన ప్యాకేజీని ఇస్తామని తెలిపారు. ఎస్టీలకు ఇచ్చే పునరావాస ప్యాకేజీ విషయంలో ప్రజా ప్రతి నిధులు సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వివరాలను అధికారులు సీఎంకు తెలియజేశారు. అక్షరాస్యతపై అధ్యయనం.. గిరిజనుల అక్షరాస్యతాశాతం పెరగకపోవడానికి కారణాలు, ఆ ప్రాంతాల్లో విద్యాసంస్థల పరిస్థితి ఏమిటి , ఖాళీలు ఎన్ని ఉన్నాయి, తదితర అంశాలను వెంటనే అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ర్టంలోని ఎస్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల పరిస్థితిపై కూడా నివేదికను సమర్పించాలన్నారు. ట్రైబల్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్.. ఎస్సీ పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన డిక్కి తరహాలో ఎస్టీ పారిశ్రామికవేత్తలు కూడా ట్రైబల్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటున్నదని సీఎం చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుకోడానికి గిరిజన పారిశ్రామికవేత్తలు సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారులు విద్యాసాగరరావు, రామలక్ష్మణ్, ఎంపీలు కె.కేశవరావు, అజ్మీరా సీతారాంనాయక్, జి.నగేశ్, ఎమ్మెల్యేలు అజ్మీరా చందూలాల్, అజ్మీరా రేఖానాయక్, కోవా లక్ష్మి, రాథోడ్ బాబురావు, బానోతు శంకర్, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, డీఎస్.రెడ్యానాయక్, కోరం కనకయ్య, బానోతు మదన్‌లాల్, సున్నం రాజయ్య, రవీంద్రకుమార్ రమావత్, ఎమ్మెల్సీ రాములునాయక్, ఉన్నతాధికారులు ఎస్కేజోషి, టి.రాధ, సోమేశ్‌కుమార్, శ్రీదేవి, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు. బాబూ.. కేసీఆర్‌లా మేలు చేయండి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న గిరిజనులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను.. పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురువుతున్న ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన సలహా మండలి సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తండాలు, గూడేలు పంచాయతీలుగా మారుస్తాం.. గిరిజనతండాలు, ఆదివాసీ గూడేలను గ్రామపంచాయతీలుగా మార్చే విషయంలోనూ చర్చ జరిగింది. ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నామని, విధివిధానాలను రూపొందించాల్సి ఉందని సీఎం అన్నారు. గ్రామానికి మూడు కిలోమీటర్ల అవతల ఉన్న తండాలను కలుపుతూ ప్రత్యేక గ్రామపంచాయతీలు ఏర్పాటుచేయాలని పలువురు ప్రజాప్రతినిధులు సూచించారు. 500 జనాభా ఉంటేనే గ్రామపంచాయతీ అనే నిబంధనకు కట్టుబడకుండా, దగ్గర్లో ఉన్న రెండు,మూడు తండాలను కలిపి ఒకే పంచాయతీ చేస్తే సరిపోతుందని వారు చెప్పారు. అదే విధంగా 500 లోపు జనాభా ఉన్నప్పటికీ, మిగతా జనావాసాలకు దూరంగా ఉంటే వాటిని కూడా ప్రత్యేక గ్రామపంచాయతీలుగా చేయాల్సిందేనని కొందరు సూచించారు. మరోసారి ఎస్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమై విధివిధానాలను ఖరారు చేస్తామని సీఎం తెలిపారు. -
‘ప్రాణహిత’ డిజైన్ మార్చుతాం: మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చేందుకు యోచిస్తున్నట్టు శాసనసభ వ్యవహారాల, నీటిపారుదల శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రిజర్వాయర్లు, కాల్వల ప్రతిపాదనలు సమగ్రంగా లేవని కేంద్ర జలవనరుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఆయన తెలిపారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ నీటి ప్రాజెక్టుల నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సరికొత్త చట్టం రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. కరువును ఎదుర్కొనేందుకు రూ.వెయ్యికోట్లతోచెరువుల పూడికతీత చేపట్టనున్నట్టు తెలిపారు. ఆగస్టు చివరి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలుంటాయని హరీశ్‌రావు వెల్లడించారు. -
ప్రాజెక్టులకు సహకరిస్తాం
తెలంగాణకు మహారాష్ట్ర హామీ ‘మహా’మంత్రితో హరీష్‌రావు చర్చలు సఫలం హైదరాబాద్: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి, నిర్వహణకు సంపూర్ణ సహకారం అందిస్తామని మహా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సహా లెండి, దిగువ పెన్‌గంగ ప్రాజెక్టులకు చెందిన అన్ని అంశాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు తోడ్పాటును అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రాణహిత బ్యారేజ్ తుది అలైన్మెంట్, ముంపు ప్రాంతం, బ్యారేజ్ ఎత్తు అంశాలపై చర్చించుకునేందుకు ఈ ఏడాది ఆగస్టుకు ముందే అంతర్రాష్ట్ర స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిం ది. సాగునీటి ప్రాజెక్టులకున్న అడ్డంకులను తొలగించుకునే క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు నేతృత్వంలోని ప్రజా ప్రతినిధులు, అధికారుల బృందం బుధవారం ముంబైకి వెళ్లిం ది. మహారాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హసన్ ముష్రిఫ్‌తో భేటీ అయిన బృందం లెండి, దిగువ పెన్‌గంగ, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై చర్చించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పలు అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. లెండి ప్రాజెక్టు ముంపు గ్రామాలకు సహాయ పునరావాసం, పునర్నిర్మాణం అందించేందుకు, హెడ్‌వర్క్‌లను పూర్తి చేసేం దుకు ఒప్పుకొంది. బిచ్కుంద, మద్నూర్ మండలాల్లో 22 వేల ఎకరాలకు సాగునీరందించే లెండి ప్రాజెక్టును 2015లో పూర్తి చేయాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం, పెరిగిన అంచనా వ్యయానికి తగ్గట్టు వాటాను చెల్లించేందుకు అంగీకరించింది. బ్యారేజ్ నిర్మాణ అధ్యయనానికి మద్దతు.. దిగువ పెన్‌గంగ ప్రాజెక్టు చేపట్టేందుకు రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాన్ని తిరిగి ధృవీకరించాలని కోరిన మహారాష్ట్ర అభ్యర్థనకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దిగువ పెన్‌గంగ, కింద ప్రతిపాదించిన బ్యారేజ్‌ను ప్రధాన పెన్‌గంగ నుంచి విడదీయాలని, గతంలో చేసిన ప్రతిపాదనలకు కేంద్ర జల సంఘం నుంచి ఆమోదం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా.. మహారాష్ట్ర అంగీకారం తెలిపింది. పెన్‌గంగ డ్యామ్ దిగువన బ్యారేజ్ నిర్మించేందుకు పూర్తిస్థాయి అధ్యయనానికి మహారాష్ట్ర ప్రభుత్వం తమ సమ్మతి తెలిపింది. ప్రతినిధి బృందంలో రాష్ట్ర అటవీశాఖ మం త్రి జోగు రామన్న, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హన్మం త్ షిండే, కోనేరు కోనప్ప, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, నీటిపారుదలశాఖ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ప్రాణహిత చీఫ్ ఇంజనీర్ హరిరామ్, గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్‌రావు ఉన్నారు.