అన్నివర్గాల అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం | TRS Govt Only Develops All Categories | Sakshi
Sakshi News home page

అన్నివర్గాల అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

Published Tue, Nov 6 2018 1:59 PM | Last Updated on Mon, Apr 8 2019 8:07 PM

TRS Govt Only Develops All Categories - Sakshi

ఎన్నికల ప్రచారంలో భేరిమోగిస్తున్న కిశోర్‌కుమార్‌

సాక్షి,మద్దిరాల(తుంగతుర్తి) :   టీఆర్‌ఎస్‌తోనే అన్నివర్గాల అభివృద్ధి సాధ్యమని తుంగతుర్తి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్‌ అన్నారు. సోమవారం మండల పరిధిలోని చౌళ్ల తండా, రాజానాయక్‌ తండా, గోరెంట్ల, పోలమల్ల, చందుపట్ల ,చిన్ననెమిలా, మామిళ్లమడమ, జి.కోత్తపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్ని మాట్లాడారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నికులాలను ఆదుకోవాలనే దృష్టితోనే గొల్లకుర్మలకు సబ్సిడీ గొర్రెలను, ముదిరాజ్‌లకు ఉచితంగా సబ్సిడీ చేపపిల్లలను పంపిణి చేశామన్నారు.  రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని బావించినా కేసీఆర్‌ మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువులు పూడిక తీయించారన్నారు.

 కల్యా ణ లక్ష్మి, రైతులకు 24గంటల ఉచిత కరెంట్, ఎస్సారెస్పీ కాలువల ద్వారా చెరువులను,  రైతు బంధు,  రైతు బీమా పథకాలని ప్రవేశపెట్టి దేశంలోనే నంబర్‌వ న్‌గా నిలిచారన్నారు. మరోసారి ఆశీర్వదించి అత్యధిక మెజార్టితో గెలింపిస్తే నియోజవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. చందుపట్ల గ్రామంలో పలువురు నిరసన తెలపాలని ప్రయత్నించిన ప్పటికి పోలీస్‌లు సర్ధిచెప్పడంతో వారు నిరసనను విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ ఎస్‌ఏ.రజాక్‌. గ్రంథాలయ కమిటీ డైరెక్టర్‌ దుగ్యాల రవిందర్‌రావు, జీడీ భిక్షం, వైఎంపీపీ లక్ష్మణ్, మాజీ సర్పంచ్‌Œ ల ఫోరం మం డల అధ్యక్షుడు లౌడ్య వెంకన్న, బెజ్జంకి శ్రీరాంరెడ్డి, అశోక్, గుడ్ల వెంకన్న,వెంకన్న, కోడి శ్రీనివాస్, గుండ్ల నాగయ్య, మాజీ సర్పంచ్‌లు కన్నా సురాం భ,వీరన్నగౌడ్, వెంకన్న, ఉమామహేశ్వరీ, సోమక్క,లింగారెడ్డి, వెంకట్‌రెడ్డి,  మధుçసూదన్,వెంకన్న,నేండ్రా మల్లారెడ్డి, సైదులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement