తెలంగాణ, ఏపీ ఐఎంఏ కార్యవర్గాల ఎన్నిక | Telangana AP IMA Executive Selection | Sakshi
Sakshi News home page

తెలంగాణ, ఏపీ ఐఎంఏ కార్యవర్గాల ఎన్నిక

Published Mon, Jul 14 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

తెలంగాణ, ఏపీ ఐఎంఏ కార్యవర్గాల ఎన్నిక

తెలంగాణ, ఏపీ ఐఎంఏ కార్యవర్గాల ఎన్నిక

విజయవాడ,హన్మకొండ: రెండు రోజుల పాటు విజయవాడలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 56వ రాష్ట్ర మహాసభలు (ఉమ్మడి రాష్ట్రం) ఆదివారం ముగిశాయి.  ఉమ్మడి రాష్ట్ర కౌన్సిల్‌ను ఆంధ్ర, తెలంగాణలుగా విభజిస్తూ తీర్మానించారు. ఏపీ అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన డాక్టర్ పి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా సీతారామయ్య (ఒంగోలు), కె.ఆనందనాయుడు (తిరుపతి), జె.సి.నాయుడు (విజయనగరం), కార్యదర్శులుగా కృష్ణారెడ్డి (నెల్లూరు), కె.వెంకటేశ్వర్లు (నెల్లూరు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సమావేశంలో ఐఎంఏ నేతలు ఎన్.అప్పారావు, జి.సమరం, సుబ్రహ్మణ్యం, యాదగిరి   పాల్గొన్నారు. ఐఎంఏ తెలంగాణ అడ్‌హక్ కమిటీ చైర్మన్‌గా వరంగల్ నగరానికి చెందిన డాక్టర్ కొండపల్లి సుధాకర్‌రెడ్డి నియమితులయ్యూరని జాతీయ ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించిన డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి తెలిపారు. 2015 నుంచి తెలంగాణ మెడికల్ అసోసియేషన్ పూర్తి సంస్థగా ఆవిర్భవించనున్నట్లు పేర్కొన్నారు. జనరల్ సర్జన్ అరుున సుధాకర్‌రెడ్డి ప్రస్తుతం ఇండియన్ రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement